Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Thursday, 12 September 2013

కాలీఫ్లవర్ టమోటో కర్రీ



వర్షాకాలంలో వేడినీళ్లు తాగండి..


మేకప్‌ చెదరకుండా ఉండేందుకు క్యారెట్‌


ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే.......


నల్లటి వలయాలు, చేతులు తెల్లబడాలంటే?

కంటి కింద నల్లని వలయాలకు చెక్ పెట్టాలంటే? పసుపును వాడటం ఉత్తమమని బ్యూటీషన్లు చెబుతున్నారు. మీగడలో చిటికెడు పసుపు వేసుకుని కళ్లచుట్టూ మర్దన చేసుకోవాలి. రెండు నిమిషాలయ్యాక కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే... కళ్లచుట్టూ ఉండే నలుపు తగ్గి, అక్కడి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 
అలాగే అదేపనిగా ఎండలో తిరగడం వల్ల కొందరి చేతులు నల్లగా మారిపోతాయి. అలాంటప్పుడు రెండు చెంచాల కాచిన పాలల్లో చెంచా ఓట్స్‌పొడి కలపాలి. ఐదునిమిషాలయ్యాక చిటికెడు పసుపు చేర్చి చేతులకు పూతలా వేసుకుని మర్దన చేయాలి. పొడిబారిన చర్మ సమస్య తగ్గడమే కాదు చేతులూ తెల్లగా మారతాయి. 
ఈ పూతను రోజూ వేసుకోవచ్చు. వేళ్లకణుపుల్లో ఉన్న నలుపు కూడా ఈ ప్యాక్ తగ్గిస్తుంది.  కొద్దిగా నూనెలో పసుపు వేసి గోళ్లచుట్టూ మర్దన చేసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ సమస్య దరిచేరదు. గోళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.