Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Wednesday, 29 February 2012

Palak Corn Idli


కావలసిన పదార్థాలు:
 ఇడ్లీ పిండి(మినప్పప్పు ఇడ్లీ రవ్వ కలిపి పెట్టుకున్న మిశ్రమం) - రెండు కప్పులు, పాలకూర ముద్ద - రెండు టేబుల్ స్పూన్లు, స్వీట్ కార్న్ గింజలు - నాలుగు టేబుల్ స్పూన్లు, తినే సోడా - కొద్దిగా, ఉప్పు - తగినంత, నీళ్లు - సరిపడా.
 తయారుచేయు విధానం: 
ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి నూనెలో వేగించి రుబ్బుకోవాలి. ఇందులో ఇడ్లీ పిండి, స్వీట్ కార్న్ గింజలు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ పిండితో ఇడ్లీలు తయారుచేసుకోవాలి. అల్లం పచ్చడి లేదంటే కొబ్బరి పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.

On the dining table with fleas, mosquitoes avoid ....

డైనింగ్ టేబుల్ మీద ఈగలు,దోమలు రాకుండా ఉండాలంటే....టేబుల్ మద్యలో పుదినా ఆకులు ఉంచితే సరి.

Tuesday, 28 February 2012

Pani Puri


 
పూరీకి కావలసినవి:
ఉప్మారవ్వ (సన్నది) - కప్పు
మైదా - 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా - చిటికెడు
నూనె - వేయించడానికి తగినంత

పానీకి కావలసినవి:

చింతపండు గుజ్జు - అర కప్పు
నీళ్లు - 2 కప్పులు; జీలకర్ర పొడి (వేయించి పొడి చేయాలి)- టేబుల్ స్పూన్; జీలకర్ర - టేబుల్‌స్పూన్
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్
న ల్ల ఉప్పు - టేబుల్ స్పూన్
బెల్లం - 2 టేబుల్‌స్పూన్లు

తయారి:

పానీకోసం పై చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలిపి పక్కన ఉంచాలి.

పూరీ కోసం ...

రవ్వ, మైదా, బేకింగ్‌సోడా, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. పిండి మీద తడి క్లాత్ వేసి పదిహేను నిమిషాలు ఉంచితే మృదువుగా అవుతుంది. చిన్నచిన్న పిండి ముద్దలు చేసి మైదా లేదా రవ్వను అద్దుకుంటూ పీట మీద ఒత్తాలి. వీటిని కడాయిలో నూనె వేడయ్యాక వేసి రెండు వైపులా కాల్చి, బయటకు తీయాలి. ఈ పూరీలను పానీతో సర్వ్ చేయాలి. 

When the pieces of fries oil to be Suck.....

వేపుళ్ళు చేస్తున్నప్పుడు  ముక్కలు నూనె  ఎక్కువగా పిల్చకుండా ఉండాలంటే చెంచా వెనిగర్ కలపాలి.

Monday, 27 February 2012

Onion bajji



కావలసినవి:
ఉల్లిచక్రాలు - 20; శనగపిండి - కప్పు; కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను; లవంగాల పొడి - పావు స్పూను; పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి పేస్ట్ - అర స్పూను; మిరప ్పొడి - పావు స్పూను ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా 

తయారి:
పైన చెప్పిన పదార్థాలను (నూనె, ఉల్లిచక్రాలు తప్పించి) ఒక గిన్నెలో వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ బజ్జీలపిండిలా కలుపుకోవాలి. స్టౌ మీదబాణలిలో నూనె కాగిన తరవాత ఉల్లి చక్రాలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ బజ్జీలు వేసి దోరగా వేయించాలి. బాగా వేగిన తరవాత టిష్యూ పేపర్ మీదకు తీసి కొద్దిగా చల్లారిన తరవాత కొత్తిమీర లేదా టొమాటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

Give omelette overflowing ....

ఆమ్లెట్ పొంగినట్టు రావాలంటే....చిటేకడు పంచదార కలపాలి.

Sunday, 26 February 2012

Palli Chat


కావలసినవి:
పల్లీలు - కప్పు; అటుకులు - రెండు కప్పులు; స్వీట్ కార్న్ - కప్పు; పుట్నాలపప్పు - అరకప్పు; ఉల్లితరుగు - అరకప్పు సన్నగా తరిగిన టొమాటోలు - పావు కప్పు; నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 2; ఇంగువ -కొద్దిగా; పసుపు - కొద్దిగా; మిరప్పొడి - కొద్దిగా; నూనె - తగినంత; కరివేపాకు - రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు - టీ స్పూను

తయారి:

బాణలిలో కొద్దిగా నూనె కాగాక అందులో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. తరవాత, అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి పుట్నాలపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ అదే బాణలిలో మరికాస్త నూనె వేసి అందులో కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు వేసి అందులో అటుకులు కూడా వేసి గుల్లగా వేయించుకోవాలి. మరో పెద్ద పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించి ఉంచుకున్న పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి. మిరప్పొడి వేసి మరోమారు కలిపిన తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. చివరగా స్వీట్‌కార్న్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వెంటనే తినేయాలి. లేదంటే మెత్తపడిపోతాయి.

The dining table to be without the grease ...

డైనింగ్ టేబుల్ జిడ్డు గా లేకుండా ఉండాలంటే....రసం పిండేసిన నిమ్మ తొక్కలతో తుడవాలి.

Friday, 24 February 2012

Mushroom Paneer Masala


కావలసిన పదార్ధాలు...
మష్రూమ్స్‌ : 100 గ్రా.
పనీర్‌ : 100 గ్రా.
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)
పసుపు : 1/2 టీ స్పూన్‌
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 1 టీ స్పూన్లు
పచ్చి మిర్చి : 4 (తరిగి)
ధనియాల పొడి : 1 టీస్పూన్‌
గరం మసాలా పొడి : 1/2 టీ స్పూన్‌
కొబ్బరి పొడి : 2 టీస్పూన్లు
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1 టీస్పూన్‌
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : 4 స్పూన్లు
కొత్తిమీర : అలంకరణకి
తయారు చేసే విధానం...
మష్రూమ్స్‌ను తీసుకొని శుభ్రం చేసి, ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్‌, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్‌ వేసి కలపాలి. పనీర్‌ కరిగిన తర్వాత అది తక్కుపోతుంది కనుక బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి సాస్‌ వేసి సర్వ్‌ చేయాలి. 

Oil pongakunda be ......

నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వేయాలి.

Thursday, 23 February 2012

Baby Potato Kurma



కావలసిన పదార్థాలు:
ఆలుగడ్డలు: 6
ఎండు కొబ్బరి: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
గసగసాలు: 1tsp
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
టమాటాలు: 2-4
పసుపు: చిటికెడు
జీలకర్ర: 1/2tsp
చెక్క, లవంగం, యాలకలు: 2:2:2
ధనియాలపొడి: 11/2tsp
గరంమసాలా పొడి: 1tsp
పెరుగు: 1/2cup
బిర్యాని ఆకు: 2
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినంత


తయారు చేయు విధానం:
1. ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఎండుకొబ్బరి, కారం, ధనియాల పొడి, గసగసాలు కలిపి వేయించి, గ్రైండ్ చేసుకోవాలి.
3. ఒక పాన్ తీసుకొని అందులోనూనె పోసి జీలకర్ర, ఉల్లిగడ్డ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులో టమాట, అల్లం, వెల్లుల్లి పేస్ట్, బిర్యాని ఆకు, చెక్కాలవంగం, యాలకలు, పచ్చిమిర్చి, పసుపు వేసి పదినిమిషాల సేపు కలుపుతూ బాగా వేయించాలి. ఆ తర్వాత ఎండుకొబ్బరి పేస్ట్, గరంమసాలా పొడి, టమోటో ముక్కలు, ఉప్పు వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడకనివ్వాలి. ఈ మిశ్రం చిక్కబడినప్పుడు స్టౌ మీద నుండి దింపుకొని సర్వ్ చేయాలి. ఇది చపాతీ, పరోటా, రైస్ కి మంచి కాంబినేషన్.

Bisket packet be mettapadakunda .....

బిస్కేట్ పేకెట్ మెత్తపడకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో ఉంచాలి. 

Wednesday, 22 February 2012

Pineapple Coconut Biscuits



కావలసిన పదార్థాలు:
మైదా: 2cups
బేకింగ్‌ పౌడర్‌: 1tsp
పంచదార: 2cups
లోఫాట్ మిల్క్: 120grms
కొబ్బరి తురుము: 1/4cup
తినే సోడా: చిటికెడు
పైనాపిల్‌ ఎసెన్స్‌: 1tsp
కోడి గుడ్లు: 2
వెన్న: 100grsm

తయారు చేసే విధానం:
1. మొదటగా పంచదారను మెత్తగా పొడి చేసుకొని, మైదా పిండిని జల్లించుకోవాలి.
2. పాలలో మైదాపిండిలో బేకింగ్‌ సోడా, వెన్న వేసి కలపాలి. ఒక రోజూ ముందే మైదాను తడిపి బాగా మృదువుగా అయ్యేలా కలుపుకోవాలి. అలా చేస్తేనే బిస్కెట్స్‌ గుల్లగా వుండి కరకరలాడుతుంటాయి. 

3. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు పగులగొట్టి తెల్ల సొన మాత్రం తీసుకొని బాగా గిలకొట్టాలి. దానిలో చక్కెర పొడిని వేసి బాగా కలియబెట్టాలి. తరువాత గుడ్డు సోనాలో పైనాపిల్‌ ఎస్సెన్సు వేసి బాగా బ్లెండ్‌ చేసి దీన్ని మైదా పిండిలో వేసి కలపాలి. చక్కెర మిశ్రమంలో దీన్నంతటిని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని నాలుగు లేదాఐదు గంటల పాటుపక్కన వుంచుకోవాలి.
4. తరువాత వాటిని పూరీల్లా వత్తుకోవాలి. వీటిని నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిపైనే కొబ్బరి తురుమును చల్లి ఉంచాలి.
5. ఇప్పుడు కేక్‌ పాన్‌ తీసుకుని అందులో ప్రత్యేకంగా వుండే గిన్నెలో బిస్కెట్స్‌ ను పెట్టి బేక్‌ చేయాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు అలా వుంచేయాలి. అంతే పైనాపిల్‌ బిస్కెట్స్‌ రెడీ.

Avoid flies in the kitchen ...

కిచెన్ లో ఈగలు రాకుండా ఉండాలంటే పసుపు నీటిని చల్లాలి.

Tuesday, 21 February 2012

Palak-Potato Palau recipe


కావలసిన పదార్ధాలు:
 బాస్మతి రైస్: 2cupd
పాలకూర: రెండు కట్టలు
పొటాటో: 2
కారట్: 2
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చి: 4-6
కొత్తిమీర తరుగు: 1cup
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbps
గరం మసాలా పొడి: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: 1tsp
పసుపు: చిటికెడు
నూనె: కావలసినంత
చెక్క: చిన్న ముక్క
వంగాలు, యాలకులు: 2:2
షాజీర: కొద్దిగా

తయారు చేయు విధానం:

1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి పదినిమిషాలు నాననివ్వాలి.
2. తర్వాత పొటాటో(బంగాళదుంప), కారట్ ను శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పాలకూర, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి.
3. పాన్ లో నూనె పోసి వేడయ్యాక మసాల దినుసులు వేయాలి. సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత పాలకూర, పొటాటో, కారట్ తురుము వేసి వేగనివ్వాలి.
4. అందులోనే చిటికెడు పసుపు, కారం, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మరిగాక బియ్యం, తగినంత ఉప్పు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.
5 అంతే క్రిందికి దింపుకొని ఆవిరి అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి అంతా కలకలిపి వేడిగా రైతాతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.

eggplant slices not Black

వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూన్  పాలు కలపాలి.

Monday, 20 February 2012

Meal maker pudding recipe



కావలసిన పదార్థాలు:
మీల్ మేకర్: 100grms
క్యారెట్ లేదా బీట్‌రూట్ తురుము: 1/2cup
జీడిపప్పు: 4-6
కిస్‌ మిస్: 6-8
చక్కెర: 100grm
యాలకల పొడి: 1tsp
నెయ్యి: 2tsp
పాలు: 2cup
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. మీల్‌ మేకర్‌ లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. అవి చల్లారాక మిక్సీపట్టి పొడిలా చేసి పెట్టుకోవాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌ మిస్‌ లను వేయించి పక్కన పెట్టాలి.
3. ఆ తర్వాత క్యారెట్ తురుమును కూడా నెయ్యి వేసి వేయించాలి. ఇప్పుడు మరో పాన్ లో పాలు పోసి వేడి చేయాలి.
4. వేడయ్యాక క్యారెట్ తురుము, మీల్‌ మేకర్ పొడి, చక్కెర వేసి తిప్పుతూ ఉండాలి. బాగా ఉడికిన తర్వాత ఇలాయిచీ పొడి, నెయ్యి వేయాలి. అయితే నెయ్యి తేలేలాగా కానివ్వాలి. దించేముందు డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. 5. ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. ఆ తర్వాత మనకు నచ్చిన రీతిలో కట్ చేసి తింటే ఆ వేరు.

Sarees Wash be mixing color ....

పట్టు చీరలు ఉతికేతప్పుడు బకెట్ లో కొంచం నిమ్మ రసం వేయటం వల్ల రంగు పోవు. 

Sunday, 19 February 2012

Know hoarse throat ...

గొంతు బొంగురు తగ్గాలంటే....కరక్కాయ, పిప్పల్లను చూర్ణం చేసి తేనే తో నాకిస్తే సరి.

Know the eyes and stir quickly .......

కళ్ళ కలకలు వచ్చినవారు రాత్రి అంతా కరక్కాయలను నానా బెట్టిన నీళ్లతో కళ్ళు కడుక్కొంటే కలకలు తొందరగా తగ్గుతాయి. 

Saturday, 18 February 2012

Broccoli soup with curry


కావలసిన పదార్దాలు :
తోటకూర : 3 కట్టలు
ఉల్లిపాయ  : 1
మెంతులు  : 1 స్పూను
పచ్చిమిర్చి  : 3
చింతపండు  : నిమ్మకాయంత
ఉప్పు, కారం : తగినంత
అల్లం  : చిన్నముక్క
నూనె  : 3 స్పూన్లు

ఇలా చేయాలి...
తోటకూర కడిగి సన్నగా తరగాలి. అల్లం, ఉల్లిపాయలు ముక్కలుగా, పచ్చిమిర్చిని చీలికలుగా తర గాలి. చింతపండును నీటిలో నానబెట్టాలి. బాణాలిలో నూనె పొయ్యకుండా మెందులు వేసి వేపా లి. తర్వాత తరిగిన తోటకూర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఒకసారి కలిపి చింతపండు రసం పిసికి అందులో పోసి కారం వేసి, సరిపడ నీళ్ళుపోసి ఉడకనివ్వాలి. దించేసే ముందు విడిగా తాలిం పు పెట్టి అందులో వెయ్యాలి. అన్నీ ఉడికాక దించెయ్యాలి. వెల్లుల్లి రెండు గర్భాలు వేయాలి.

Remove acne scars on the face

ముఖం పై ఉన్న మొటిమల మచ్చలు పోవాలంటే....నిమ్మ కాయ తొక్కలను పొడిగా చేసి దానిలో కొద్దిగా వెన్న కలిపి ముఖానికి రాసుకుంటే సరి.

Friday, 17 February 2012

Batani to be cooked when the color remains unchanged ....

బటాణి లు ఉడికించి నప్పుడు రంగు మారకుండా ఉండాలంటే.... ఉడికించే ముందు అర చెంచా పంచదార లేదా నాలుగు చుక్కల వెనిగర్ చేర్చితే.... రంగు మారకుండా ఉంటాయి.

If a drop of stain on the face of the lens to use ....

బొట్టు బిళ్ళలు వాడటం వల్ల ముఖం పై మచ్చ పడితే.... తులసి రసం రాయటం వల్ల చాల ఉపయోగం ఉంటుంది.

Thursday, 16 February 2012

Corrosion of the plugged to be a pie .....

పెనం తుప్పు పట్టకుండా ఉండాలంటే పెనానికి నూనె రాసి పెట్టాలి. ఇలా చేస్తే దోసలు కుడా బాగా వస్తాయి.

Being the color to be the color of the clothes ...

రంగు బట్టలు రంగు పోకుండా ఉండాలంటే బట్టలు ఉతికే  నీళ్ళలో కాస్త పటిక కలిపితే సరి.

Wednesday, 15 February 2012

Sweet potato Bajji


కావలసిన పదార్థాలు: 
 చిలగడ దుంప (పెద్దది) -1, శనగపిండి - 1 కప్పు, బియ్యప్పిండి - పావు కప్పు, కారం - 1 టీ స్పూను, వాము పొడి - పావు టీ స్పూను, వంటసోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరపడా.
తయారుచేసే విధానం:

 ఒక వెడల్పాటి లోతైన పాత్రలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, వాముపొడి, ఉప్పు వేసి తగినంత నీటితో జారుగా కలుపుకోవాలి. చిలగడదుంప తొక్కతీసి, కొద్ది దళసరిగా చక్రాల్లా తరిగి, పిండిలో ముంచి, నూనెలో వేగించాలి. వేడివేడిగా టమోటా (కారం) సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Cholesterol Know .....

రోజు ఉదయం పరగడుపున అరగ్లాసుడు గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల తేనె, అరచెంచాడు నిమ్మరసం కలుపుకుని తాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల రక్త శుద్ధి జరగడంతోపాటు శరీరంలో కొలెస్ట్రాల్, బరువు అదుపులో ఉంటాయి.

Tuesday, 14 February 2012

Be More Meal......

భోజనం ఎక్కువ అయ్యి భుక్తాయాసం గా ఉంటె తినే సోడా, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు నీళ్లు కలుపుకొని తాగితే సరి.

juice from lemon to give better .......

నిమ్మ కాయ నుంచి రసం బాగా రావాలంటే పది నిముషాలు వేడి నీటి లో ఉంచితే సరి. 

Monday, 13 February 2012

throat Pain Know.....

కప్పు నీటిలో అరచెంచా అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, మూడు తులసి ఆకులు వేసి, పది నిమిషాలపాటు మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ పానీయాన్ని తాగితే గొంతు గరగర తగ్గుతుంది.

Keep the ants from reaching the sugar jar .......

పంచదార డబ్బాలో మూడు లవంగాలను వేస్తే చీమలు చేరవు.

Sunday, 12 February 2012

White hair Change black

తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే కొబ్బరి నూనె లో వెల్లుల్లి పాయలను ఉడికించి, తర్వాత వడకట్టి, ప్రతి రోజు తల కు రాస్తే తెల్ల వెంట్రుకలు నలుపు గా మారుతాయి.

the mirror Shine

అద్దం తళ తళ లాడుతూ ఉండాలంటే ఒక తెల్ల కాగితం తీసుకుని నీటితో తడిపి, కాగితం లోని నీటిని పిండేసి అద్దం తుడిస్తే చాలు.

Saturday, 11 February 2012

Burli Pav


కావల్సినవి:
గుడ్లు- నాలుగు, ఉల్లిపాయలు, టమాటా- ఒకటి చొప్పున, కొత్తిమీర- కొద్దిగా, పచ్చిమిర్చి- రెండు, ఆవాలు- చెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె- నాలుగు చెంచాలు, పావ్‌- నాలుగు, ఉప్పు- రుచికి తగినంత. 
తయారీ: 
 గుడ్లలోని సొనను గిన్నెలోకి తీసుకొని ఉప్పు వేసి బాగా గిలక్కొట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గించాలి. కొద్దిసేపటికి అందులో గుడ్ల సొన వేయాలి. పది నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి దించేయాలి. తరవాత పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక పావ్‌ను నూనెతో రెండువైపులా కాల్చుకోవాలి. వేడివేడిగా ఉన్న పావ్‌ల మధ్యలో ఎగ్‌ బుర్జి పెట్టి సర్వ్‌ చేస్తే సరిపోతుంది.

Worked as the thickness of the cream on top of milk .....

పాల పైన మీగడ మందం గా కట్టాలంటే చిల్లులు ఉన్న ప్లేట్ మూత పెట్టండి.

Friday, 10 February 2012

Sambar pongakunda be ......

సాంబార్ పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న సాంబార్ లో ఒక చుక్క మంచి నూనె వేస్తె సరి.

Without dregs of oil to be as fresh .....

నూనె మడ్డిగా లేకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఒక బంగాళాదుంప ముక్క వేసి ఒక గంట ఉంచితే మడ్డి అంతా కిందకు దిగి పోయి నూనె ఫ్రెష్ గా, క్లియర్ గా ఉంటుంది.

Thursday, 9 February 2012

Pullabadakunda be yogurt ......

పెరుగు పుల్లబడకుండా ఉండాలంటే అందులో  కొబ్బరి వెయ్యాలి.

cracks in the foot .....

పాదాల పగుళ్ళు బాదిస్తోంటే కలబంద గుజ్జు లో చిటికెడు పసుపు కలిపి పడుకొనే ముందు రాసుకోవాలి.

Wednesday, 8 February 2012

Hardened honey .....

తేనే గట్టిపడితే...వెడల్పాటి పాత్ర లో సగం దాక  నీళ్ళు మరిగించి అందులో ఆ సీసాను ఉంచండి. కాసేపటికి వాడు కోవటానికి తేనే సిద్దం.

Potato slices well Fry....

బంగాళదుంప ముక్కలని పది నిముషాలు మజ్జిగ నీళ్ళలో ఉంచి....వేయిస్తే చక్కగా వేగడం తో పాటు రుచి గా కూడా ఉంటాయి.

Tuesday, 7 February 2012

Pakora getting Soft?

సెనగ పిండి లో చెంచా వేడి నూనె, చిటెకెడు వంట సోడా కలిపితే పకోడీ లు కరకరలాడుతాయి.

When the oil is to be without shedding Gare, vada.....

వడలు, గారెలు చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే అందులో రెండు చెంచాల నెయ్యి కలపాలి.

Monday, 6 February 2012

pasta Boild to each other

పాస్తాను  ఉడికించేటప్పుడు ఉడికించే నీటిలో చెంచా ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పు వేస్తె ఒకదానికొకటి అతుక్కోవు. 

Remove Materials stains on the inside of the microwave.....

మైక్రో ఓవెన్ లోపల పదార్దాల మరకలు పోవాలంటే తినే సోడాలో నీళ్ళు కలిపి రుద్దితే సరి.

Sunday, 5 February 2012

Glass vessels Shine

గాజు పాత్రలు తోమే నీటిలో గుప్పెడు టేబుల్ సాల్ట్  వేస్తె అవి మెరుస్తుంటాయి.

Friday, 3 February 2012

Ginger, garlic to be stored for a long time

అల్లం, వెల్లుల్లి పాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే...... కాగితం కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి.

Dosa soft to be.....

దోసలు మెత్తగా దూదిలా ఉండాలంటే.....బియ్యంరవ్వను లేదా బొంబాయి రవ్వ ను ఒక కప్పు తీసుకుని జావ కాచి చల్లార్చి దోస పిండి లో కలిపితే చాలు.

Thursday, 2 February 2012

Suffering with dyspepsia

అజీర్తి తో బాధపడుతున్నారా..... అయితే అల్లం ముక్కలను ఉప్పు తో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

fridge to avoid odor

ఫ్రిజ్ దుర్వాసన రాకుండా ఉండాలంటే..... వాడని సాక్స్ లో కొన్ని కాఫీ గింజలు  ఉంచి పెడితే సరి.

Wednesday, 1 February 2012

Peyant brush becomes hard

పెయంట్ వేసే  బ్రష్ లు  గట్టిగా మారితే....షాంపూ కలిపినా నీటిలో కాసేపు ఉంచితే సరి. 

Know kadupubbaram....

ఒక గ్లాసు పాలను తీసుకుని అందులో కొంచెం ఉసిరి ఆకులను వేసి బాగా మరిగించి , ఆ పాలను వడగట్టి తాగుతుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.