Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Wednesday, 31 December 2014

నిమ్మ, బత్తాయి తొక్కలను పారేస్తున్నారా? కాస్త ఆగండి.

నిమ్మరసం కానీ, బత్తాయి రసం కానీ తీసిన తర్వాత తొక్కని ఇక నుంచి పారేయకండి. ఎందుకంటే సిట్రస్ జాతి పండ్ల తొక్కలను ఇంట్లో అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.  ఎలాగంటే.. 

*  గోరు వెచ్చని నీటిలో ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కను వేసి స్నానం చేయండి. ఇది శరీరాన్ని, వెంట్రుకలనూ తాజాగా ఉంచుతుంది. 
 
* నిమ్మ, కమలా, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ తొక్కలను ఒక చిన్న గిన్నెలో వేసి దాన్నిండా నీటిని పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఫ్రిజ్‌లోని చెడు వాసనలు పోతాయి.
 
* సిట్రస్ జాతి పండ్ల తొక్కలకు కొద్దిగా బ్రౌన్ షుగర్‌ను అద్ది అర చేతులకు మోచేతులకు రుద్దితే మొరటుదనం పోయి కోమలంగా తయారవుతాయి. 
 
* సిట్రస్ ఫ్రూట్స్ పండ్ల తొక్కలను అండర్‌గార్మెంట్స్ ఉన్న సొరుగులో ఉంచితే, బట్టల నుంటి మంచి వాసన వస్తుంది. 
 
* నిమ్మ, నారింజ తొక్కలు నానబెట్టిన నీటితో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన ఉండదు. ఈ తొక్కలను నమిలితే దంతాలకు, చిగుర్లకూ ఎంతో మంచిది. 

Tuesday, 30 December 2014

మృదువైన చేతులకు.....చిట్కాలు

చేతికి ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాస్తుండాలి. ముఖ్యంగా చలికాలంలో అయితే పగుళ్ల బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాలి. అయితే సహజ క్రీములను ఎక్కువగా ఆశ్రయించాలి. సౌందర్యలేపనాలను అతిగా వాడితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువగా పండ్లు, ఆకు కూరలు తినటం వల్ల చేతుల నిగారింపు మెరుగవుతుంది. అంతేకాకుండా అరటి, నారింజ, బొప్పాయి వంటి పండ్ల తొక్కలతో చేతులపై రుద్ది కొద్దిసేపటి తర్వాత నీటితో కడిగితే మురికి పోతుంది.

 నిమ్మరసంలో చక్కెర కలిపి చేతులకు పట్టిస్తే నున్నగా తయారవుతాయి. అదేవిధంగా పంచదార, కొబ్బరినూనె కలిపిన మిశ్రమం చేతికి మర్దనా చేసినా చేతులు నున్నగా అవుతాయి.

గ్లిజరిన్ ను కలిపి చేతులకు రాసుకుని గంట ఆగిన తర్వాత కడిగేస్తే చేతులు మృదువుగా తయారవుతాయి.

ఎండలో బయటకు వెళ్లేటపుడు చేతికి గ్లౌజులు తొడిగితే.., చేతుల నిగారింపు తగ్గకుండా, కాలుష్యం బారిన పడకుండా కాపాడుతుంది.

Sunday, 28 December 2014

అందమైన గోళ్ల కోసం మాయిశ్చరైజింగ్

అందమైన గోళ్ల కోసం మాయిశ్చరైజింగ్ అవసరమని బ్యూటీషన్లు అంటున్నారు. ఆరోగ్యవంతమైన గోళ్లు వేళ్లకు అందాన్ని ఇస్తాయి. అయితే  గోళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అవి రకరకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. 
 
గోర్ల అడుగుభాగం బ్యాక్టీరియా, ఫంగస్ నివాసానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో తేమ ఉండకుండా చూసుకోవాలి. గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు చేతులకు తప్పనిసరిగా గ్లౌస్ చేసుకోవాలి. సబ్బు నీళ్లలో ఎక్కువసేపు నానితే గోర్లు మెత్తబడి విరిగిపోతాయి. పని పూర్తవగానే చేతులతో పాటు గోర్లను తడి లేకుండా ఆరబెట్టాలి. 
 
గోర్లకు ట్రిమ్మింగ్, ఫైలింగ్ తప్పనిసరి. పెరిగిన మూలలో, ముందు భాగంలో కత్తిరించి గుండ్రటి ఆకారం వచ్చేలా షేప్ చేయాలి. తర్వాత గరుకు లేకుండా ఫైల్ చేయాలి. ఇందుకోసం పదునైన మానిక్యూర్ కత్తెర లేదా క్లిప్పర్స్ వాడాలి. స్నానం తర్వాత గోర్లు మెత్తగా ఉంటాయి. కాబట్టి ఈ పనులకు అదే సరైన సమయం. 
 
అలాగే మాయిశ్చరైజర్ ఉపయోగించే ప్రతీసారీ గోర్లను దృష్టిలో పెట్టుకోవాలి. గోరు మూలల్లో, అడుగున చిగుర్రలో మాయిశ్చరైజ్ జరిగేలా మసాజ్ చేయాలి. ఇందుకోసం హ్యాండ్ క్రీమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. 

Saturday, 27 December 2014

శీతాకాలంలో పొడిజుట్టుకు ఎటువంటి జాగ్రత్తలు అవసరం?

శీతాకాలంలో పొడిజుట్టు మరింతగా పొడిగా తయారవుతుంది. స్టీమ్ హీట్ వాడినా లేదా బయట ఎక్కువసేపు తిరిగినా మరింత పొడిబారుతుంది. అధికంగా షాంపు చేసుకోకుండా ఉంటే మంచిది. నరిషింగ్  షాంపుల్ని వాడాలి. 
 
కండీషనర్లు వాడితే ఫలితం కనిపిస్తుంది. షాంపు చేసుకున్న ప్రతీసారీ కండిషనర్ వాడితే జుట్టు మృదువుగా మెరుస్తుంది. మెరుపును పెంచే సెరం లేదా క్రీమ్‌లను ఉపయోగించాలి. తలస్నానం తర్వాత జుట్టును డ్రయ్యర్ ద్వారా కాకుండా సహజంగా ఆరబెట్టుకోవాలి.

Tuesday, 23 December 2014

మృదువైన చర్మం కోసం హెల్దీ ప్యాక్

మృదువైన చర్మం కోసం హెల్దీ ప్యాక్ వేసుకోండి. ఒక స్పూన్ తాజా కీరదోస గుజ్జుకి చెంచా మీగడ, రెండు చెంచాల  క్యారెట్ రసం కలిపి ఆ మిశ్రమాన్ని దట్టంగా మెడ నుంచి ముఖం వరకూ పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మానికి పోషకాలు అంది మృదువుగా మారుతుంది.
 
క్యారెట్ రసం, నిమ్మరసం, శెనగపిండి సమపాళ్లలో తీసుకుని పాపు కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు కాళ్లూ చేతులూ, మెడ దగ్గర పట్టించి ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

Monday, 22 December 2014

పాదాల పగుళ్లు వేధిస్తే......

అలాగే పాదాల పగుళ్లు వేధిస్తే.. గంధం మంచి ఔషదంగా పనిచేస్తుంది. దీనిలో పగుళ్లను తగ్గించే యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయి. గంధంలో కొబ్బరినూనె కలిపి దాన్ని పాదాలూ మడమల దగ్గర పూతలా పూయాలి. అర గంట అయిన తర్వాత  కాసేపు గోరువెచ్చని నీళ్లలో పాదాలను ఉంచి ఆపై శుభ్రపరుచుకుంటే సరి. ఇలా రోజు విడిచిరోజూ చేస్తే పగుళ్లు తగ్గుతాయి.

చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే.

చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే.. ఒక స్పూన్ గంధం పొడి, టేబుల్ స్పూన్ గులాబీ రేకుల ముద్ద, ఒక స్పూన్ బాదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మం తేమగా తాజాగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే నలుపు తగ్గుతుంది.