Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Thursday, 29 December 2011

Capsicum Masala -green pepper masala Video

Cauliflower Gravy


కావలసినవి  :
కాలీఫ్లవర్‌ : ఒకటి
పెరుగు : 2 కప్పులు
కార్న్‌ఫ్లోర్‌ : 50 గ్రా
కారం : 1 టీ స్పూన్‌
మైదా : 75 గ్రా
ఉల్లిపాయలు : మూడు
అల్లం వెల్లుల్లి : 10 గ్రా
కొత్తిమీర : 1 కట్ట
జీలకర్రపొడి : 1 టి స్పూన్‌
జీడిపప్పు : 20 గ్రా
కారం : 1/2 టి స్పూన్‌
కొబ్బరి : చిన్నముక్క
ఫుడ్‌కలర్‌ : చిటికెడు
గరంమసాలా : 1/4 టి స్పూన్‌
ఉప్పు : తగినంత
పసుపు : 1/4 టి స్పూన్‌
రిఫైన్డ్‌ ఆయిల్‌ : వేయించేందుకు 


తయారి విధానం  :
కాలీఫ్లవర్‌ (గోబీ)ని పువ్వులుగా కొసి ఉప్పు నీళ్లలో వేసి కొంచెం మెత్తగా ఉడికించి నీళ్లు వార్చి, పక్కన ఉంచండి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా పోసి కొంచెం నీళ్లు కలిపి బజ్జీల పిండిలా చేశాక, అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, రెడ్‌ ఫుడ్‌ కలర్‌, తగినంత ఉప్పు కలపండి. తరువాత ఈ విశ్రమంలో గోబీ పువ్వులను ముంచి వేడి నూనెలో వేయించి గ్రేవీలో వేసి, రైస్‌తో గాని, రోటీతో గాని ఆరగించండి.

గ్రేవీ తయారి...
పెరుగులో కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీడిపప్పు, కొబ్బరి తురుము, గరంమసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు కలిపి మిశ్రమంలా చేసి ఉంచండి. ఒక గిన్నెలో నూనెపోసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించండి. అందులో పైన తయారు చేసి ఉంచిన పెరుగు మిశ్రమాన్ని కలిపి పది నిమిషాలు ఉడికించితే గ్రేవీ సిద్ధం.

 

Wednesday, 28 December 2011

Draiphruts be stored for several days ....

డ్రైఫ్రూట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిల్లో లవంగాలు వేసి ఉంచండి. 

Tooth swelling, pain Know .......

పటిక నీటిని, నోట్లో పోసుకుని పుక్కిట బడితే  పంటి వాపు, నొప్పి, వంటి చిగుళ్ళ నుండి రక్తం కారడం లాంటివి తగ్గుతాయి.

Tuesday, 27 December 2011

Appetite as well .....

ఆకలి బాగా వేయాలంటే  రెండు వంతుల టమోటా రసానికి ఒక వంతు కొత్తిమీర రసం, కొంచెం ద్రాక్ష రసం కలిపి భోజనానికి ముందు ఒక కప్పు తాగాలి.

Saturday, 24 December 2011

Cashew muffin cake


కావలసిన పదార్థాలు: 
మైదా - 140 గ్రాములు, పాలు - 200 గ్రాములు, పెరుగు - 70 గ్రాములు, బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూను, సోడా - అర టీ స్పూను, నీళ్లు - కొద్దిగా, వెనీలా - నాలుగు చుక్కలు, జీడి పప్పులు - అర కప్పు.

తయారుచేయు విధానం: 

ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో జీడి పప్పులు, వెనీల, కొద్దిగా నీళ్లు, పాలు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మఫిన్ మౌల్డ్స్‌లో పెరుగు రాసి ఈ మిశ్రమాన్ని పెట్టాలి. ఇలా అన్నింటిని తయారుచేసుకుని ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇరవై నిమిషాలపాటు బేక్ చేయాలి. కాజు మఫిన్ కేకులు రెడీ అయినట్టే.

Thursday, 22 December 2011

Egg Les plum cake


కావలసిన పదార్థాలు:
వెన్న: 150grm
పంచదార: 150grm
మైదా: 150grm
బేకింగ్ పౌడర్: 1tsp
డ్రైఫ్రూట్స్
: (కాజు, బాదం, ఆక్రోట్, టూటీ ఫ్రూటీ, కిస్‌ మిస్): 150grm
కొబ్బరి పౌడర్: 3tsp
తయారు చేయు విధానము:
1. ఒక చిన్న గిన్నెలో మూడు చెంచాల రమ్ వేసుకుని అందులో కాజు, డ్రైఫ్రూట్ లను నాలుగు గంటలు నానబెట్టాలి.
2. మరొక గిన్నెలో వెన్న, చక్కెర బాగా కలగలిసేలా కలపాలి. ఎటువంటి ముద్దలు లేకుండా కలుపుకుని ఒక కేక్ బేసిన్ తీసుకొని, దాని అంచుకు మైదా, నూనె రాయాలి.
3. తర్వాత ఇంతకు ముందు చేసిన మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మైక్రోవేవ్‌ లో అరగంట పాటు మీడియం హీట్‌ లో కేక్ మధ్య భాగం వేగే వరకూ ఉంచి తీయాలి. కేకులో సన్నపుల్ల గుచ్చితే అది పిండి అంటుకోకుండా బయటకు వస్తే కేకు పూర్తిగా ఉడికినట్టే. అప్పుడు ఓవెన్ నుండి తీసేయొచ్చు.
4. తర్వాత చాకొఫ్రూట్ సిరప్ కాని, చెర్రీస్, డ్రైఫ్రూట్స్ తో కాని కేక్ మీద అలంకరించుకోండి. వెన్న రాసి పెట్టుకున్న కేకు టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. ఇంకేం! ఎంతో ఊరించే ‘క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ.

Beautiful lips are the precautions to be taken ......


మృదువుగా, అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అయితే పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనందువల్ల అవి తరచు పొడిగా మారుతుంటాయి. పెదాలను నాలుకతో తడిచేసుకోవడం చాలామందిలో మనం గమనిస్తున్నదే. కాని అలా చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. చలికాలంలో చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవడం జరుగుతుంటుంది. పెదాలు చిట్లిపోయి రక్తం కూడా కారుతుంది. పెదాలు చిట్లిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోవడం, వాతావరణ మార్పులు ఇందులో ముఖ్యమైనవి. 
చలికాలంలో పెదాల సంరక్షణకు తీసుకోవలసిన సూచనలు ఇవి:
-పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకోవద్దు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమన ఉంటుంది కాని తడి ఆరిన తర్వాత నొప్పి అధికం అవుతుంది.

-బాగా నీరు తాగాలి. కనీసం రోజుకు పది గ్లాసుల నీరు తాగాలి.

-చవకరకం లిప్‌స్టిక్స్ వాడవద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఇ ఆయింట్‌మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.

-కలబంద రసాన్ని పూయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

-కీరా ముక్కను పెదాలపై రాయడం వల్ల పెదాలు మృదువుగా ఉంటాయి.

-రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలపై పేరుకుని ఉన్న నెయ్యి రాయడం వల్ల ఉదయానికి పెదాలు మృదువుగా, మెరుస్తూ కనపడతాయి.

-ఆలివ్ ఆయిల్‌ను రాయడం వల్ల కూడా పెదాల పగుళ్లు తగ్గుతాయి.

-మార్కెట్లో దొరికే టీ బ్యాగును గోరువెచ్చని నీటిలో ముంచి పెదాలపై నాలుగైదు నిమిషాల సేపు ఉంచడం వల్ల పెదాలకు కావలసిన తేమ ఏర్పడి నిగారింపు వస్తుంది.

-విటమిన్ ఎ, బి,సి, బి2, ఇ లోపాల వల్ల కూడా పెదాలు చిట్లిపోయి రక్తం కారుతుంది. ఈ విటమిన్లు దొరికే కూరగాయలు, పండ్లు తీసుకోవడంతోపాటు విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలి.

-కొన్ని అలర్జీల వల్ల కూడా పెదాలు అందవిహీనంగా తయారయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులలో వైద్యుని పర్యవేక్షణలో మందులు తీసుకోవడం మంచిది. 

Wednesday, 21 December 2011

Keep skin soft in winter.....

గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టీ స్పూన్ ఆలివ్ నూనె, 5-6 చుక్కల నిమ్మరసం బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి బాగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకొని బాదం నూనె రాసుకోవాలి. చలికాలంలో రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది.


Kasuri methi

కసూరి మేథి ఈ మద్య తరచుగావినిపిస్తోంది.దీన్ని ఇంటి దగ్గరే తయారుచేసుకోవచ్చు. మెంతి ఆకులను నీడలో ఎండబెట్టి, పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి ని ప్రతి  వంటకం లోను వాడవచ్చు. దీని వల్ల వంటకానికి రుచి రావటం మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది.

Tuesday, 20 December 2011

Spice bhendi


కావలసిన పదార్థాలు: 
బెండకాయలు - పది, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రేకలు - ఐదు, పచ్చిమిరపకాయలు - రెండు, గరం మసాలా - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:

బెండకాయల్ని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి నిలువుగా గాటు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెండకాయల్లో కూరాలి. స్టౌ మీద మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి బెండకాయల్ని వేసి మూత పెట్టి సన్నని సెగపై పది నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మూత తీసి కాయల్ని రెండో వైపుకి తిప్పి మరో ఐదు నిమిషాలు వేగనిచ్చి తీసెయ్యాలి.

Monday, 19 December 2011

Pumpkin donuts


కావలసిన పదార్థాలు: 
గుమ్మడి ముక్కల గుజ్జు - రెండు కప్పులు, వరి పిండి - మూడు కప్పులు, బేకింగ్ పౌడర్ - నాలుగు టీ స్పూనులు, ఉప్పు - తగినంత, బేకింగ్ సోడా - అర టీ స్పూను, పంచదార - ఒక కప్పు, పెరుగు - మూడు టేబుల్ స్పూన్లు, గుడ్లు - రెండు, వెనీలా - ఒక టీ స్పూను, మజ్జిగ - అర కప్పు, నూనె - సరిపడా. తయారుచేయు విధానం:  
 పంచదారని మెత్తగా పొడి చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల పొడిని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పొడిలో గుమ్మడి గుజ్జు, పెరుగు, బేకింగ్ పౌడర్, వరి పిండి వేసి కలుపుకోవాలి.
ఎలక్ట్రిక్ మిక్సర్‌లో వేస్తే బాగా కలుస్తుంది. ఇందులో గుడ్డుసొన, బేకింగ్ సోడా, వెనీలా, కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. పూరీ పిండిలా మెత్తగా అయ్యాక తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టాలి. మూడు గంటల తర్వాత బయటికి తీయాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోయాలి. ఈ పిండిని బాగా పెద్ద సైజు చేగోడీలలా చేసుకోవాలి. నూనె కాగాక అందులో వేసి వేగించాలి. రెండు వైపులా బాగా వేగిన తర్వాత తీసేయాలి. వేడి చల్లారకుండానే వాటిపై పంచదార పొడిని చల్లాలి. తియ్యని గుమ్మడి డోనట్స్ తయారయినట్టే.

Onion rings


కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు - మూడు, శెనగపిండి - పావు కప్పు, బంగాళదుంప - ఒకటి, మొక్కజొన్న పిండి - అర కప్పు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, తినే సోడ - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: 

ఉల్లిపాయల్ని చక్రాల్లా కట్ చేసుకోవాలి. వీటిని రింగుల్లా విడదీసి పక్కన పెట్టుకోవాలి. బంగాళ దుంపని ఉడికించి, మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఇందులో శెనగపిండి, మొక్కజొన్న పిండి, ధనియాల పొడి, సోడా, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకుని బజ్జీల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకోవాలి. బాగా కాగాక ఉల్లిపాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేసుకుని ఎరుపురంగు వచ్చే వరకూ వేగించుకోవాలి. వీటిని అల్లం పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Oates Chikki


కావాల్సిన పదార్థాలు:
ఓట్స్ - 500 గ్రాములు, బెల్లం - 300 గ్రాములు, బాదం పప్పులు - 20, పిస్తా పప్పు - 15, నువ్వులు - పావు కప్పు, పల్లీలు - పావు కప్పు, జీడి పప్పు - పావు కప్పు, నెయ్యి - అర కప్పు,
తయారుచేయు విధానం:

ఓట్స్, బాదం పప్పులు, పిస్తా, పల్లీలు, నువ్వులు, జీడి పప్పుల్ని విడివిడిగా వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నెయ్యి, ఆ తర్వాత బెల్లం కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం వచ్చే వరకూ మరిగించి దించేయాలి. ఇందులో వేగించి పెట్టుకున్న ఓట్స్, మిగతా పప్పుల్ని అందులో వేసి బాగా కలపాలి. ఒక పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమం వేసి చల్లారనివ్వాలి. తర్వాత మనకి నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి.

Tamata Mal Puri


కావలసిన పదార్థాలు:
బెంగళూరు టమోటాలు -4, మైదా పిండి - ఒక కప్పు, బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూను, పాలు - ఒక టేబుల్ స్పూను, నెయ్యి - అర కప్పు, పచ్చి కొబ్బరికోరు - ఒక కప్పు, యాలకుల పొడి - కొద్దిగా, పంచదారపొడి - రెండు టేబుల్ స్పూన్లు, కిస్‌మిస్‌లు - పది, బాదం పలుకులు -ఆరు, జీడిపప్పు - ఎనిమిది, చెర్రీలు - పది.

తయారుచేయువిధానం:

టమోటాలను వేడి నీళ్లలో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత తొక్క తీసేసి పండుని మిక్సీలో వేసి రుబ్బుకుని గుజ్జుతీసుకోవాలి. ఇందులో మైదాపిండి వేసి బాగా కలపాలి.

పాలు, బేకింగ్ పౌడర్, పంచదార కూడా వేసి పిండిని జారుగా కలపాలి. ఇప్పుడు ఒక నాన్‌స్టిక్ పెనం పొయ్యి మీద పెట్టి గరిటతో పిండిని దోసెల్లా పోయాలి. ఈ పూరీ దాని నెయ్యి వేసి ఒక వైపు కాలాక తిరగేసి మళ్లీ నెయ్యి వేసి కాల్చాలి. ఇలా అన్నీ చేసుకున్నాక ప్లేటులో పెట్టి మడతలు వేయాలి. వీటిపైన పచ్చి కొబ్బరి , కిస్‌మిస్‌లు, జీడిపప్పు, బాదంపప్పు ,చెర్రీ పెడితే చూడడానికి అందంగా ఉంటుంది.