Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Friday, 27 April 2012

If the beauty of your followed yogurt at home

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. అందుకనే పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.

- తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే.. మళ్లీ విడిగా కండీషనర్‌ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్‌లా ఉపయోగ పడుతుంది. పెరుగులో శనగపిండిని కలిపి, నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, ముఖం మీదనున్న మృతకణాలు తొలగిపోతాయి.
 

- ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే అది క్లెన్సింగ్‌ ఏజెంటులా పనిచేస్తుంది. పెరుగులో కాస్తంత చక్కెరగానీ లేదా ఉప్మా రవ్వగానీ వేసి బాగా కలిపి.. ముఖానికి పట్టించి మసాజ్‌ చేస్తే డెడ్‌ స్కిన్‌ తొలగిపోతుంది. పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్‌క్యూబ్‌లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్‌ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

Thursday, 26 April 2012

Apple Rasgulla


కావలసిన పదార్థాలు:
యాపిల్ పేస్ట్: 2cups
మైదా: 1/2cup
పంచదార: 1cup
బేకింగ్ సోడా: 1/4tsp
నీరు: 1 cup
రోజ్ వాటర్: 1/2 tbsp
వెనిలా: 1tbsp
యాలకుల పొడి: 1tsp
నూనె/నెయ్యి: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం: 

1. ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా, బేకింగ్‌ సోడా, వెనీలా, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. పూరి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత యాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ లో వేసి గట్టిగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పడు దీనిని చిన్నచిన్న బాల్స్‌ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసి అందులో ఈ యాపిల్ క్రీమ్ బాల్స్ పెట్టి గుడ్రంగా చుట్టుకోవాలి.
4. ఒక బౌల్ లో పంచదార, యాలకుల పొడి వేసి, నీళ్లు, కలిపి లేత పాకం పట్టి గోరువెచ్చగా ఉంచాలి.
5. తర్వాత యాపిల్ బాల్స్ ను వేడి నూనెలో సన్నటి మంటమీద వేగించి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి పంచదార పాకంలో వేయాలి. పాకం బాగా పీల్చిన తర్వాత వీటిని తీసి చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ లో పెట్టి చివరిగా బాదం తరుగు గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే నోరూరించే యాపిల్ రసగుల్లాలు రెడీ...

Wednesday, 25 April 2012

Paneer Tikki


కావలసిన పదార్దాలు :
శనగ పప్పు : అర కప్పు
(వండే ముందు రెండు గంటలు నానబెట్టాలి)
పన్నీర్‌ : 500 గ్రా
ఎండు మిరపకాయలు : ఐదు
చాట్‌ మసాలా : 2 టీ స్పూన్లు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : నాలుగైదురేకులు
పచ్చి మిరపకాయలు : ఆరు
బంగాళాదుంపలు : నాలుగు
(మీడియం సైజువి)
కార్న్‌ఫ్లోర్‌ : పావు టీ స్పూన్‌
నూనె : 4 టేబుల్‌ స్పూన్లు

ఇలా చేయాలి
బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. అల్లం, పచ్చి మిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు వేసి వేడిచేయాలి. శనగపప్పు, ఎండు మిరపకాయలు, చాట్‌ మసాలా, ఉప్పు వేసి, శనగపప్పు వేగే వరకు వేయించాలి. ఇప్పుడు పన్నీర్‌ వేయాలి. ఉడికించిన బంగాళాదుంపలను చిదిమి కలపాలి.
 
ఈ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకుని టిక్కి ఆకారంలో మలిచి ఒక్కొక్కటిగా కార్న్‌ఫ్లోర్‌లో వేయాలి. టిక్కి మొత్తం ఫ్లోర్‌ పట్టించాలి. వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. పైన చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే పన్నెండు లేదా పదమూడు టిక్కిలు చేయవచ్చు. ఈ పన్నీర్‌ టిక్కిని నచ్చిన చట్నీతో తిం టుంటే చూసే వాళ్లకి నోరూరకుండా ఉంటుందా.

Monday, 23 April 2012

Orange Lemon skyas


కావలసిన పదార్థాలు:
బత్తాకాయలు: 12
ఆరెంజ్‌ కలర్‌: 1/2tsp
పంచదార: 6
నీరు: 3cups
పొటాషియం మెటాబైసల్ఫేట్: 1/2tsp
ఆరెంజెస్: 3-4 లేదా ఆరెంజ్‌ ఎసెన్స్‌: 1tsp
నిమ్మకాయ: 3-4 లేదా సిట్రిక్‌ ఆసిడ్(నిమ్మ ఉప్పు)‌: 7tsp
ఐస్ క్యూబ్స్: 4-8

తయారు చేయు విధానం:
1. ముందుగా నీళ్ళలో పంచదార కలిపి తీగపాకం పట్టాలి.
2. తర్వాత 1/4 కప్పు వేడి నీళ్ళలో సిట్రిక్‌ ఆసిడ్‌ కలిపి పాకంలో కలపాలి.
3. ఇప్పుడు బత్తాయిలు రసం తీసి, ఆ రసానికి ఎసెన్సు, రంగు కలపాలి. ఆ బత్తాయి రసాన్ని పాకంలో కలపాలి. రెండు టీస్పూన్ల వేడి నీళ్ళలో పొటాషియం మెటాబైసల్ఫేట్‌ కలిపి రసంలో కలపాలి. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి మూత గట్టిగా పెట్టి వారం తర్వాత బయటకు తీసి తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్‌ చేయాలి.

Saturday, 21 April 2012

Mangoes coconut chutney


కావలసిన పదార్ధాలు:
మామిడికాయ: 2
పచ్చికొబ్బరితురుము: 4cup
ఎండుమిర్చి: 10
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర: 1tsp
వెల్లుల్లి: 4-6 రెబ్బలు
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: తగినంత
తాలింపుకు
శనగపప్పు: 1/2tsp
మినప్పప్పు: 1/2tsp
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: 2 


తయారు చేసే విధానం:
1. ముందుగా ఒక స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి.
2. తర్వాత ఈ ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లిరెబ్బలు జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, కొబ్బరితురుము వేసి అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4. నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే పుల్లగా, కమ్మగా మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ లొట్టలేయాల్సిందే.. ఇక వదిలిపెట్టారు అంతే...

Friday, 20 April 2012

Divide the onion, ginger Molds Remove

ఉల్లి పాయలు , అల్లం, వంటివి తరిగినప్పుడు చాపింగ్ బోర్డ్ మిద కొద్దిగా వంట సోడా రాసి పావు  గంట అయ్యాకా కడిగితే దుర్వాసనలు దురమవుతాయి.

Mikds vegetable masala idli


కావలసిన పదార్థాలు:
క్యారెట్‌: 1
బంగాళాదుంప: 1
పచ్చిబటానీ: 2tbsp
క్యాబేజీ: 2tbsp
పచ్చిమిర్చి: 3-6
ఉల్లిపాయ: 1
అల్లం: చిన్న ముక్క
బియ్యం: 3cups
మినప్పప్పు: 1cup
సెనగపప్పు: 1/4cup
కొబ్బరి నీళ్లు: 1glass
జీలకర్ర: 1tsp
కొబ్బరి తురుము: 2tsp
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం: 

1. ముందుగా పప్పులు, బియ్యం కడిగి ఆరుగంటల పాటు నీటిలో నానపెట్టుకోవాలి.
2. తర్వాత కూరగాయలను కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
3. అలాగే పప్పు, బియ్యం, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
4. ఇప్పుడు ఉడికించిన కూరగాయలు, కొబ్బరితురుము, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, కొబ్బరి నీళ్లు వేసి బాగా గిలక్కొట్టాలి. ఇడ్లీ పాత్రలో పిండివేసి ఆవిరి మీద ఇడ్లీను ఉడికించాలి. ఈ ఇడ్లీలను కరివేపాకు పొడి, కొబ్బరి చట్నీలతో సర్వ్ చేయాలి అంతే మసాలా ఇడ్లీ రెడీ.

Thursday, 19 April 2012

If wrinkles are more likely to

ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అప్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Spicy Masala Dosa


కావలిసిన పదార్ధాలు:
బియ్యం: 2cups
అల్లం మిర్చి పేస్టు: 1tbsp
ఉల్లి ముక్కలు: 1cup
కారం: 1tsp
మైదా పిండి: 1cup
పుల్ల మజ్జిగ: 1glass
ఉప్పు: రుచికి తగినంత
పసుపు :చిటికెడు

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం నానబెట్టి శుభ్రం చేసి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
2.ఈ పిండికి మైదా, అల్లం, మిర్చి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు , కారం, పసుపు వేసి అన్ని కలిసేలా కలిపి మజ్జిగ పోసుకుని జారుగా చేసుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి పెన్నం మీద పిండితో రవ్వ దోసె మాదిరిగా వేసి సరిపడ నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
4. ఈ స్పైసీ మసాలా దోసెను వేడిగా కొబ్బరి చెట్నీ లేదా అల్లం చెట్నిలతో సర్వ్ చెయ్యాలి. చాలా రుచిగా ఉంటుంది.

Wednesday, 18 April 2012

Mexican brinjal (eggplant)


 కావలసిన పదార్దాలు:
వంకాయలు: 4-6
నీళ్లు వడగట్టిన గట్టిపెరుగు: 1/2
ఉప్పు: రుచికి తగినంత
మిరియాలపొడి: 1tsp
నిమ్మరసం: 1tsp
కొత్తిమీర: 2tbsp(గార్నిషింగ్ కి)
నూనె తగినంత
సాస్ కొరకు అవసరమైన వస్తువులు:
ఉల్లిపాయ ముక్కలు: 1cup(సన్నగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 4-6
టమోటో ముక్కలు: 2cupత
పచ్చిమిర్చి: 4-6
టమోటో సాస్: 2tbsp
క్యాప్సికమ్ సాస్: 1tsp
మిరియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:

1. ముందుగా వంకాయలను అర అంగుళం లావు గుండ్రటి ముక్కలుగా కోసి పది నిమిషాలు ఉప్పు కలిపిన నీటిలో ఉంచ బయటకు తీయ్యాలి. తర్వాత వీటిని పొడి బట్టతో శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టాలి.
2. తర్వాత పాన్ పెట్టి వంయాయ ముక్కలను వేసి రొట్టెలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
3. ఇప్పుడు పెరుగు ఉప్పు, మిర్చి, నిమ్మరసం వేసి కలిపి చల్లబడటానికి ఫ్రిజ్ లో ఉంచాలి. నూనె వేడి చేసి వెల్లుల్లి, ఉల్లిముక్కలు గోధుమరంగు వచ్చేంత వరకు వేయించి అన్ని పదార్థాలను వేసి పదినిమిషాలపాటు సన్నటి మంటమీద ఉడికించాలి.
4. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంయాయ ముక్కలను ప్లేట్ లో తీసుకొని ప్రతి ముక్కపై సాస్ వేసి ప్రి హాట్ ఓవెన్ లో 200డిగ్రీల సెంటీగ్రేడ్ పై ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. ఒక్కో ముక్కపై పెరుగు వేసి అలంకరించి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మెక్సికన్ బ్రింజాల్ రెడీ..

Know ceyandila spots .. !!

  • ద్రాక్షపండ్ల గుజ్జును రోజుకి రెండు సార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
  • బొప్పాయి గుజ్జును పూతలా వేసి పది నుంచి పదిహేను నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎం తో మార్పు ఉంటుంది.
  • యాపిల్‌ గుజ్జును మచ్చలపై రుద్ధి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
  • నారింజ తొక్కలను పొడి చేసి అర టి పండు గుజ్జులో కలిపి పూతగా వేసి ఆరాక గోరు వెచ్చటి నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
  • జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు స్ట్రాబె ర్రీ రసం రాసుకుంటే బ్లీచ్‌లా పని చేస్తుంది.
  • బాదం పప్పు గుజ్జులో గ్లూకోజ్‌ పౌడర్‌ కొద్దిగా కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చ లు తగ్గుముఖం పడతాయి.
  • ఆముదం గింజలను నానబెట్టి గుజ్జు చేసి మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంట య్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.

Tuesday, 17 April 2012

Pumpkin Halwa


కావలసిన పదార్ధాలు:
గుమ్మడికాయ - 1/2 kg
పంచదార -1/4 kg
నెయ్యి - 50 gms
కోవా - 50 gms
యాలకుల పొడి - 1 tsp
ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా - 1/4 కప్పు
కేసరి రంగు - చిటికెడు

తయారు చేయు విధానం:

1. ముందుగా గుమ్మడికాయ కడిగి చెక్కు తీసి, సన్నగా తురిమి పెట్టుకోవాలి.
2. మందపాటి పాన్ లో నెయ్యి వేసి అందులో రెడి చేసి పెట్టుకొన్న తురుము తడి ఆరిపోయేదాకా వేయించాలి.
3. ఇపుడు అందులో పంచదార వేసి మళ్ళీ ఉడికించాలి. కొద్దిగా చిక్కబడ్డాక కోవా, పిస్తా రంగు, యాలకుల పొడి వేసి బాగా కలిపి నెయ్యి బయటకు వచ్చేదాకా వేయించాలి. ఇపుడు సన్నగా తరిగిన ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా వేసి దింపేయాలి.

When the stomach disgusting ...

కడుపులో మంటగా ఉన్నప్పుడు... పావుకప్పు కొబ్బరి పాలలో రెండు చెంచాల ముల్లంగి రసాన్ని కలుపుకుని తాగితే నెమ్మదిస్తుంది.

Monday, 16 April 2012

Tomato Cashew Curry


కావాల్సిన పదార్ధాలు :
టమాటాలు: 1/2kg
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 1
యాలకలు: 3-4
దాల్చిన చెక్క: చిన్నది
లవంగాలు: 2
జీడిపప్పు: 1cup
కొబ్బరి తురుము: 1/2cup
గరం మసాలా: 1tsp
మిర్చి పొడి: 1tsp
పంచదార: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత

జీలకర్ర : 1tsp
నూనె: తగినంత
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారుచేసే విధానం :
1. ముందుగా అల్లంవెల్లుల్లి పేస్ట్, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొబ్బరి, జీడిపప్పు, ముక్కలుగా తరిగిన కొన్ని టమాటా లు మిక్సీ జార్‌లో వేసి కాసేపు గ్రేండ్‌
చేయాలి.
2. తర్వాత ఆపై స్టౌ మీద పాన్ పెట్టి ఓస్పూన్‌ నూనె వేసి వేడెక్కాక, ఆవాలు, జీలకర్ర కాసేపు వేగనీయండి. ఇలా వేగిన పోపును ముందే సిద్దం చేసుకుని ఉంచిన టమాటా, జీడిపప్పు ముద్దలో రుచికి తగినంత ఉప్పు, పంచదార కలిపి బాగా వేయించాలి.
3. ఇప్పుడు మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమర్చి ముక్కులు, మిగిలిన టమాటాలు ఉడికించి గరం మసాలా పొడి, ఎర్ర కారంపొడి, వేయించి నజీడిపప్పు కలపి, ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకున్న టమాటా జీడిపప్పు మిశ్రమంలో కలిపి కొత్తి మీరతో గార్నీష్‌ చేసుకుంటే.. రుచికరమైన టమాటా జీడిపప్పు కర్రీ రెడీ..

Storage papads be .....

అప్పడాలు ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే, వాటిని పెట్టిన డబ్బాలో కొద్దిగా ఇంగువ ఉంచితే సరి!

Sunday, 15 April 2012

If the gravy is thin and ...

గ్రేవీ మరి పలుచగా ఉంటే... పిండి బదులు ఉడికించిన బంగాళా దుంప కలిపితే సరిపోతుంది.

Dry Fruit Ice Cream


కావలసినవి:
హోల్‌మిల్క్: 500ml
క్రీమ్ (30 % ఫ్యాట్ ఉన్నది): 250grms
పంచదార: 1cup
నట్స్(జీడిపప్పు, బాదంపప్పు,
వాల్‌నట్స్, పిస్తా, పీనట్స్: 150grms
ఏలకుల పొడి: చిటికెడు
స్కిమ్డ్ మిల్క్ పౌడర్: 50grms

తయారు చేయు విధానం:
1. ముందుగా పాలకుకర్లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి.
2. తర్వాత మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి.
3. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి.
4. ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది. పాల మిశ్రమం చల్లారక నట్స్ అన్నీ వేసి కలపాలి.
5. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాల సేపు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్‌ క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టాలి. సర్వ్ చేసే ముందు నట్స్‌తో గార్నిష్ చేయాలి. అంతే డ్రైఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ

Saturday, 14 April 2012

Dry Fruit Sand Witch


కావలసిన పదార్థాలు:
జీడిపప్పు: 3cups
బాదం: 1cup
పిస్తా: 1cup
పంచదార: 3cups
కుంకుమ పువ్వు: 1tsp
యాలకుల పొడి: 1tsp
నెయ్యి: కొద్దిగా

తయారు చేయు విధానం:

1. ముందుగా కొన్ని జీడిపప్పులను పక్కన తీసిపెట్టి మిగిలిన వాటిని ఓ అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా గ్రైండ్ చేయాలి.
2. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పు పొడిని వేసి వేయించాలి. పంచదారను విడిగా పాకం పట్టుకుని వేగుతున్న జీడిపప్పు పొడిలోనికి కలుపుకోవాలి.
3. తర్వాత పొడిచేయకుండా ఉంచిన జీడిపప్పును, బాదం, పిస్తాను ముక్కలు చేసుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు పంచదార మిశ్రమంలో పావు వంతు తీసుకుని అందులో కుంకుమపువ్వు, డ్రైప్రూట్స్ ముక్కలను కలపాలి.
5. మిగతా జీడిపప్పు పొడి, చక్కెర మిశ్రమాన్ని రెండు భాగాలు చేసుకుని ఒక్కొక్కభాగాన్ని పూరీల పీట వేసి రుద్దుకోవాలి. ఇప్పుడు మూడు లేయర్లు తయారవుతాయి. మొదటగా జీడిపప్పును మిక్స్ లేయర్ మళ్ళీ జీడిపప్పు మిక్స్ లేయర్ పరిచి చివరిగా కావాలనుకుంటే సిల్వర్ పేపర్ వేసి కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి. ఇవి పది రోజలు వరకూ తాజాగా ఉంటాయి...

Friday, 13 April 2012

Vegetable Vada


కావలసిన పదార్థాలు
బీన్స్ ముక్కలు: 1cup
క్యారెట్ ముక్కలు: 1/4cup
పాలకూర: 1 1cup
కొత్తిమీర: 1cup
క్యాబేజీ: 1/2cup
పచ్చిబఠాణీలు: 1/4cup
గరం మసాల: 2tbsp
పచ్చిమిర్చి: 6-8
అల్లం వెల్లిల్లి పేస్ట్: 2tbsp
బియ్యం పిండి: 1/2kg
శెనగపిండి: cup
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: 1/2cup
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం
1. ముందుగా కరివేపాకు, కొత్తిమీర, పాలకూరలను శుభ్రం గా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. తర్వాత పచ్చిబఠాణీలు, క్యారెట్స్, క్యాబేజీ, బీన్స్, ముక్కల్ని కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ లో ఒక విజిల్ వచ్చే వరకూ ఉడించి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యం పిండి, శెనగపిండి, తరిగిన పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ఉడికించిన క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ముక్కలను కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ గారెల పిండిలా కలపాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకొన్న పిండిని గారెల్లా చేసుకుని, నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.
5. అంతే వెజ్ గారెలు రెడీ. ఈ గారెల్ని టొమాటో సాస్ తోగానీ, కొబ్బరి చట్నీతో గానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. సాయంత్రంవేళల్లో స్నాక్స్ లా తినడానికి బాగుంటాయి.

Urad facial!

జిడ్డు చర్మం ఉన్నవారు మినపప్పుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫేషియల్‌లా వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్ర లో మినపప్పు తీసుకొని అందులో కాస్త పెరుగు, నిమ్మ రసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది.

Thursday, 12 April 2012

Soan Papi


కావలసిన పదార్థాలు:
మైదా: 1cup
శెనగపిండి: 1cup
నెయ్యి: 250
పంచదార: 3cups
నీళ్ళు: 2cups
పాలు: 2tbsp
యాలకుల పొడి: 1/2tsp
పిస్తా, బాదం: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, మైదా పిండిల వేసి బాగా కలపాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి బాగా వేడయ్యాక పిండిని పోసి బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించి దించి పక్కన పెట్టుకోవాలి.
3. చిన్న గిన్నెలో నీళ్ళు పోసి అందులో పంచదార, యాలకలపొడి వేసి, మద్య మద్యలో గరిటెతో కలుపుతూ పాకం తయారు చేసుకోవాలి.
4. ఇప్పుడు పాకం మరుగుతుండగానే పాలు కలిపి మరో నిమిషం మరిగించాలి. పాలు కలిపాక పంచదారలోని మడ్డి అంతా పైకి తేలుతుంది. తర్వాత పాకాన్ని వడబోసి మళ్ళీ వేరే గిన్నెలో వేసి, యాలకుల పొడి వేసి మరిగించాలి.
5. తర్వాత ఈ పాకాన్ని వేయించి పెట్టుకొన్న పిండిలో పోసి పెద్ద పళ్లుండే ఫోర్క్ తో పిండిలో పాకం కలిసేలా బాగా కలిపితే అది పొరలుపొరలుగా వస్తుంది.
6. దీన్ని నెయ్యి రాసిన పళ్లెంలో వేసి, దానిపై కట్ చేసి పెట్టుకొన్న పిస్తా, బాదం చల్లి, చేతితోగానీ, మరో ప్లేట్ తోగానీ ప్రేస్ చేసినట్లు అద్దాలి. వేడి తగ్గాక కట్ చేసి సర్వ్ చేయాలి.

pimples Remove.....

కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమవుతాయి.

Wednesday, 11 April 2012

Variety Vada


ఇవి కావాలి
 సెనగ పప్పు : కప్పు
మినపప్పు : టేబుల్‌స్పూన్‌
మామిడి తురుము : కప్పు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లంముక్క : చిన్నది
ఉప్పు : రుచిని తగినంత
నూనె : వేయించుడానికి సరిపడా
కరివేపాకు రెమ్మలు : రెండు
గరం మసాలా : పావు చెంచా(కావాల్సినంత)

ఇలా చేయాలి
సెనగపప్పు, మినపప్పును రెండు గంటల ముందు నానబెట్టకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేసి పచ్చిమిర్చి ముక్కలు, మామిడి తరుము వేయించి పెట్టుకోవాలి. నానిన సెనగపప్పు,మినపప్పును మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఇందులో వేయిం చి పెట్టుకున్న పచ్చిమిర్చి, మామిడి తరుము, సన్నగా తరిగిన అల్లం పలుకులు,కరివేపాకు తరుగు తగినంత ఉప్పు చేర్చి బాగా కలపాలి. ఈ పిండిని వడల్లా అద్ది కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేలా వేయించి తీయాలి. వీటిని వేడివేడిగా వడ్డిస్తే రుచిగా ఉంటాయి.

Coconut oil to be fresh for a long time .....

కొబ్బరి నూనె ఎక్కువ కాలం తాజా గా ఉండాలంటే నిల్వ చేసే డబ్బాలో కొద్ది రాళ్ళ ఉప్పును వేస్తె సరి.

Tuesday, 10 April 2012

Vegetable Kebab


కావలసిన పదార్థాలు:
కూరగాయలు (క్యాబేజీ, బీన్స్‌, క్యారెట్)- 2 cups సన్నగా తరిగిన
ఉడికించిన బంగాళ దుంప - 1,
పన్నీర్ - 50 grms
అల్లం, వెలుల్లు - 1 tbsp
పచ్చిమిరపకాయలు - 4
మైదాపిండి - 1 cup
శెనగ పిండి - 1 cup
మిరియాల పొడి - 1tsp‌,
అజినమోటో - 1/2 tsp
బ్రెడ్‌ పొడి - 1/2 cup
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. కూరగాయల ముక్కలకు బంగాళ దుంప, మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు, అజినమోటో చేర్చి అలాగే బ్రెడ్‌ పొడిని కూడా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని ఉండలు చేసి, పొడుగ్గా సాగదీసి, పన్నీర్‌ను నింపాలి. శెనగ పిండి, మైదాపిండిలో నీరు చేర్చి, గరిట జారుగా కలుపుకోవాలి.
3. కబాబ్‌లను ఈ తోపులో ముంచి మరుగుతున్న నూనెలో వేయించాలి. బయటికి తీసి, సగానికి గాటు పెట్టి, మళ్లీ వేయించాలి. నచ్చిన సాస్‌తో సర్వ్ చేయవచ్చు.

Stainless steel sink be without lightning

స్టెయిన్ లెస్ స్టీల్  సింకులు మెరుపు తగ్గకుండా ఉండాలంటే పని  అయిన తర్వాత వెనిగర్ లో ముంచిన స్పాంజ్ తో శుబ్రం చేయాలి.

Monday, 9 April 2012

French Toast


కావలసిన పదార్థాలు:
పాలు: 2cups
బ్రెడ్ స్లైసెస్: 8
పంచదార: 4tbsp
వెనిల్లా ఎసెన్స్ : నాలుగు చుక్కలు
నెయ్యి: 2tsp
కోడిగుడ్డు: 1
తేనె: 2tbsp
ఉప్పు: 1/2tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో కోడి గుడ్డు పగుల గొట్టి బాగా కలిపి ఉంచాలి. దాని లో చక్కెర, ఉప్పు, వెనిల్లా, మిల్క్ వేసి చక్కెర కరిగిపోయేంత వరకు కలపాలి.
2. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ను ఇందులో వేసి ఒక్క నిముషం వుంచి తీసేయాలి.
3. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ ని వేడి చేసి, దానికి కొద్దిగా బటర్ రాయాలి.
4. ఎగ్ మిశ్రమంలో నాన్చిన బ్రెడ్ స్లైసెస్ పాన్ పై పెట్టి ఎర్రగా కాలే వరకు రెండు వైపులా వేయించి, దానిపైన తేనె రాసి, వేడిగా సర్వ్ చేయాలి అంతే ఫ్రెంచ్ టోస్ట్ రెడీ.

To be without a place to fall in egg smell ..

కోడిగుడ్డు  పడిన చోట వాసన లేకుండా శుబ్రపడాలంటే ఆ ప్రాంతం లో టేబుల్ సాల్ట్ చల్లి పొడి వస్త్రం తో తుడిస్తే సరిపోతుంది. 

Sunday, 8 April 2012

Tips about Mangoes

  • మామిడిలో ఐరన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత పోగొడుతుంది. ‘సి’ విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
  •  కూరల్లో ఉప్పు ఎక్కువేతై మామిడి ముక్కలను వేసి, కొద్దిగా ఉడికించి తీసేయాలి.  
  • మామిడికాయను పల్చని ముక్కలుగా కోసి, ఎండలో పెట్టాలి. బాగా ఎండిన మామిడి ముక్కలను పొడి చేసి, నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పచ్చళ్లు, గ్రేవీలలో వాడుకోవచ్చు.  
  • ఉడికించి, తీసిన మామిడికాయ రసం గ్లాస్, కొన్ని తులసి ఆకులు, టీ స్పూన్ కొబ్బరి తురుము, కొత్తిమీర, టీ స్పూన్ అల్లం రసం, తగినంత ఉప్పు కలుపుకొని తాగితే వేసవి వేడి, అతి దాహం నుంచి విముక్తి లభిస్తుంది.  
  • జిడ్డు చర్మం గల వారు.. మామిడికాయను ఉడికించి, ఆ గుజ్జును ముఖానికి, మెడకు పట్టించి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు, మురికి వదిలిపోతుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

Methi pieces of Mangoes


కావలసినవి:
మామిడికాయలు- 250 గ్రా., మెంతులు- 25 గ్రా., నూనె - 150 గ్రా.,
జీలకర్ర పొడి - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూడి, ఆవపొడి - టీ స్పూను, అల్లం, వెలుల్లి రసం - ఒకో టీస్పూను, పసుపు - చిటికెడు, కారం - తగినంత, ఉప్పు తగినంత.

తయారి:

మామిడికాయ తొక్క తీసుకుని కావలసిన సైజులో ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. బాణలిలో నూనెపోసి మరిగించి, పక్కకు తీసిపెట్టుకోవాలి. మామిడి ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని వీటికి ఆవపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కలుపుకోవాలి. కారం, పసుపు, ఉప్పు చేర్చుకోవాలి. మెంతుల్ని మెత్తగా పొడిచేసుకుని ముక్కల్లో కలుపుకోవాలి. వెల్లుల్లిపాయల్ని, అల్లం ముక్కల్ని దంచి వాటి రసాన్ని చెంచాడు చొప్పున తీసుకోవాలి. ఈ రసాన్ని మామిడి ముక్కల్లో వేసి బాగా కలపాలి. మరిగించి చల్లార్చిన నూనె ఈ ముక్కలమీద పోసుకుని సీసాలోకి తీసుకోవాలి. తయారు చేసిన మర్నాడు తింటే మెంతి ముక్కలు ఊరి మరింత రుచిగా ఉంటాయి. ఇవి పదిరోజులపాటు నిలవఉంటాయి.

Saturday, 7 April 2012

Badusa


కావలసినవి:
మైదాపిండి : 1/2 kg
నెయ్యి : 1/2 kg
వెన్న : 100 grm
చక్కెర : 100 grm
బేకింగ్ సోడా-1/2 tsp
యాలకుల పొడి : 1 tsp
కుంకుమపువ్వు : పదిరేకులు

తయారు చేయు పద్దతి:

పంచదారని మిక్షర్ లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. మైదాపిండిలో, బేకింగ్, సోడా, వెన్న, పంచదార పౌడర్ ను వేసి, నీళ్ళు కలుపుతూ ముద్దవలే చేయాలి. ఈ ముద్దను గంటసేపు అలాగే నానబెట్టాలి. గంట తర్వాత నానిన ముద్దను తీసుకొని బాగా మర్ధించి చిన్న చిన్న వుండలుగా చేయాలి. ఒక్కొక్క ఉండను చపాతీవలె, నెయ్యిరాసి వత్తాలి. మరల చపాతీలాగా మడిచి నెయ్యిరాసి వత్తాలి. ఈ విధంగా నాలుగైదు సార్లు మడిచి వత్తాలి. పైనల్ గా చపాతి చాపవలె చుట్టాలి. తర్వాత అర అంగుళం ముక్కలుగా చాకుతో కట్ చేయాలి. ఇలా రోల్ టైప్ లో వచ్చిన ముక్కను వడలాగా వత్తి మధ్యలో కొద్దిగా అదిమి వుంచాలి. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కాగిన తర్వాత, ఒక్కొక్క బాదుషాను దోరగా వేయించి తీసి కుంకుమ పువ్వుతో చేసిన పంచదార పాకంలో వేయాలి.

Remove black stripes around the eyes....

కళ్ళ చుట్టూ ఉన్న నల్ల చారలు పోవాలంటే బాదం పప్పులో పాలు కలిపి నూరి కంటి చుట్టు పూసుకుని ఒక గంట ఉంచి తరువాత నీటితో కడగండి.

Friday, 6 April 2012

For freshness throughout the day ...

  • బకెట్‌ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నా నం చేయండి. లేదా స్నానము చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి ఇట్టే తేలిపోతుంది.
  • కాస్తంత కలబంద గుజ్జును బకెట్‌ నీటిలో వేసి స్నానం చేస్తే.. ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగ పడటమే గాక, అందులోని సుగుణాలు చర్మా నికి తేమనందిస్తాయి. అదేవిధంగా అలసట దూరం కావాలంటే గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది.
  • శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు మృదు వుగా, ప్రకాశవంతంగా మార్చడంలో కామొ మైల్‌ ఉపయోగపడుతుంది. అందుకే వారాని కొకసారి పదిచుక్కల కామొమైల్‌ నూనెను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పొడిగల చర్మంగల వారికి స్వాంతనాన్ని ఇస్తుంది. దీనివల్ల అలసట కూడా దూరమౌతుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే వేసవి బాధలు తప్పుతాయి.

Remove Spots on the skin

 తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు, గుంటలు తగ్గుతాయి.

Thursday, 5 April 2012

Broccoli dal


ఇవి కావాలి
కందిపప్పు   : 1/4 కిలో
తోటకూర   : పెద్ద కట్ట
టమాటాలు   : 2
ఉల్లిపాయలు          : 2
చింతపండు   : కొద్దిగా
ఎండుమిర్చి, పచ్చిమిర్చి: 4 కాయలు
ఉప్పు, పసుపు, కారం  : సరిపడ
కరివేపాకు కొత్తిమీర  : తగినంత
నూనె, ఇంగువ  : కొద్దిగా

ఇలా చేయాలి
పప్పు కడిగి పెట్టుకోవాలి. తోటకూరను బాగా కడిగి సన్నగా తరిగి పప్పులో వేయాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కూడా తరిగి పప్పులో వేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి. చింతపండు నానబెట్టాలి. బాండీలో నూనె కాగిన తరువాత ఇంగువ పోపు పెట్టి దాంట్లో ఉడికిన పప్పు వేసి ఉప్పు, పసుపు, కారం, తగినంత వేసి చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి కుతకుతలాడుతున్నప్పుడు దింపి సర్వ్‌చేయాలి. ఇదే విధంగా తోటకూర బదులు పాలకూర, బచ్చలికూరతో చేయవచ్చు.

Neck to be pretty ..!

  • మిలమిల మెరిసే ఛాయ, మృదువైన చర్మం కోసం బొప్పాయి గుజ్జును పది నిమిషాల పాటు ప్యాక్‌గా వేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
  • మెడ నలుపుగా మారిన వారు బొప్పాయి గుజ్జు ప్యాక్‌ వేసుకుంటే తెలుపుదనమే కాకుండా నునుపు దనం కూడా వస్తుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు.
  • చర్మంపై నల్లమచ్చలు ఉంటే శనగపిండిలో గోధుమ పొట్టు కలిపి స్నానం చేసేటప్పుడు మర్దన చేస్తూ వస్తే కొంత కాలానికి మచ్చలు మాయమవుతాయి.
  • ముఖంపై ముడతలు పోవాలంటే కమలాఫల రసంతో దూదిని ముంచి ముఖానికి అద్దుకుంటే, ముఖానికి సౌందర్యం వస్తుంది.
  • మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే ఒక చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన చెంచా పాలమీగడ కొంచెం రోజ్‌వాటర్‌ కలిపిన పేస్టును మెడకు పట్టించాలి.

Wednesday, 4 April 2012

Soup with green chillies


ఇవి కావాలి 
పచ్చిమిరపకాయలు 100 గ్రాములు
చింత పండు   25 గ్రా
నూనె  3 టీస్ఫూన్లు
మెంతులు    1 టీ స్ఫూన్‌
బెల్లం      చిన్న ముక్క
ఉప్పు     తగినంత
నువ్వు పప్పు      1 టీ స్ఫూన్‌

ఇలా చేయాలి
నువ్వు పప్పు, మెంతులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చింతపండు నానబెట్టి చిక్కగా రసం తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొద్దిగా నూనెవేసి కాగాక పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. అవి వేగాక చింత పండు రసం పోసి ఉడకనివ్వాలి. పులుసు ఉడికాక నువ్వు పప్పు పొడి, బెల్లం ముక్క,

ఉప్పు వేసి కాసేపు ఉంచి దించాలి.