Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Tuesday, 31 January 2012

Know anekayalu.....

జీడి మామిడి గింజ మీద ఉండే పెంకులో నూనెలాంటి పదార్ధం ఉంటుంది. దీన్ని ఆనెకాయలకు రాస్తే ఆనెలు తగ్గుతాయి.

Know plantar fires....

అరస్పూను సాంబ్రాణి, కొద్దిగా గవ్వపలుకు తీసుకుని దాన్ని యాబై గ్రాముల నువ్వుల నూనెలో వేసి బాగా కాచి, చల్లార్చి ప్రతిరోజు మూడు పూటలా అరికాలిమీద రాస్తుంటే అరికాలి మంటలు తగ్గుతాయి.

Monday, 30 January 2012

If rust stains on white dress

వంట సోడాలో కాసిని నీళ్లు కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. మరకలు పడిన చోట ఈ మిశ్రమాన్ని పూతలా రాయాలి. ఆరాక గోరువెచ్చటి నీళ్లలో నుసిమి ఎండలో ఆరేస్తే సరిపోతుంది.

Biryanilo chopped onions rings to be less strong .....

బిర్యానీ లేదా రొట్టెలతో పాటు కొందరికి చక్రాల్లా తరిగిన ఉల్లిపాయలు కూడా ఉండాల్సిందే. కానీ వాటిని అప్పటికప్పుడు తరిగి వడ్డించుకంటే మరీ ఘాటుగా ఉండి అంతగా తినలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఉల్లిపాయల్ని చక్రాల్లా తరిగి ఓ పాత్రలోకి తీసుకోవాలి. అవి మునిగేలా నీళ్లు పోసి ఆ తరవాత రెండుమూడు ఐసుముక్కలు వేయాలి. పదిహేను నిమిషాలయ్యాక ఆ నీళ్లు వంపేసి ప్లేటులోకి తీసుకుంటే తక్కువ ఘాటుతో కరకరలాడే ఉల్లిపాయ ముక్కలు సిద్ధం.

Sunday, 29 January 2012

White gravy to give.....

గ్రేవీ తెల్లగా రావాలంటే.. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలను మెత్తగా ముద్ద చేసి వేస్తే సరిపోతుంది.

Know the problem of hair fall....

బకెట్‌ నీళ్లలో తగినన్ని వేపాకులు వేసి మరిగించాలి. చల్లారాక వాటితో తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

Saturday, 28 January 2012

The new furniture Shine.....

రెండు వంతుల ఆలివ్‌నూనెలో ఒక వంతు నిమ్మరసం కలిపి ఫర్నీచర్‌ని తుడిస్తే కొత్తదానిలా కనిపిస్తుంది. నీటి మరకలూ దూరమవుతాయి.

Instant coffee powder to be clots....

ఇన్‌స్టంట్‌ కాఫీ పొడిని గాలి చొరబడని డబ్బాలో వేసి డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచితే ఎంత కాలమైనా గడ్డకట్టకుండా ఉంటుంది.

Friday, 27 January 2012

They are the problem of chapped lips.......

పెదవులు పగిలే సమస్య ఉన్న వారు నిద్రించే ముందు వెన్న లేదా నెయ్యి రాసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే అవి మృదువుగా మారతాయి.

Ant to have suffered the most in the kitchen....

వంటగది లో చీమల బాధ ఎక్కువగా ఉన్న చోట దోస కాయ ముక్కలు కోసి పెడితే సరి.

Thursday, 26 January 2012

Keep fresh vegetables .....

కూరగాయలు తాజాగా ఉండాలంటే వాటిని నిమ్మరసం కలిపిన నీటిలో కాసేపు ఉంచండి. అంతే కూరలు నిగ నిగ లాడుతాయి.

Pakora Kurma


కావల్సినవి: సెనగపప్పు- కప్పు, పచ్చిమిర్చి- ఐదు, అల్లం- చిన్నముక్క, మెంతులు- పావుచెంచా, కరివేపాకు- నాలుగురెబ్బలు, ఉప్పు, కారం- రుచికి సరిపడా, నూనె- మూడు కప్పులు, కొబ్బరి తురుము- అరకప్పు, జీడిపప్పు- నాలుగు, గసగసాలు- చెంచా, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- ఒకటి, అల్లంవెల్లుల్లి- అరచెంచా, ధనియాలపొడి- చెంచా, పసుపు- చిటికెడు, బిర్యానీ ఆకులు- రెండు, యాలకులు- మూడు, జీలకర్ర- అరచెంచా, నెయ్యి- మూడు చెంచాలు.

తయారీ: సెనగపప్పును నానబెట్టి, రెండు గంటలయ్యాక నీళ్లు తీసేసి, పచ్చిమిర్చి వేసుకుని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో దంచిన అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు వేసి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక బాణలిలో నూనె వేడిచేసి పిండిని పకోడీల్లా వేయాలి. అవి బంగారు వర్ణంలోకి వచ్చాక తీయాలి. ఎండుకొబ్బరి తురుము, జీడిపప్పు, గసగసాలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకొని కాసిని నీళ్లు కలిపితే ముద్దగా తయారవుతుంది. తరవాత బాణలిలో నూనె వేడి చేసి.. జీలకర్ర, మెంతులు, పసుపు, బిర్యానీ ఆకులు, యాలకులపొడి, కరివేపాకు  వేసి వేయించాలి. కొద్దిసేపటికి మిగిలిన పచ్చిమిర్చి తరుగు, టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించి.. అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటాలు, కారం, ధనియాల పొడి వేసి కలియతిప్పాలి. తరవాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకొన్న కొబ్బరి ముద్ద, కప్పు నీళ్లు, ఉప్పు చేర్చి మూత పెట్టాలి. ఘుమఘుమలాడే గ్రేవీ సిద్ధమయ్యాక పకోడీలు, కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయాలి. పకోడీ కుర్మాను అన్నంలో తింటే రుచిగా ఉంటుంది.

Wednesday, 25 January 2012

Honey Scrab

కీరదోసను మిక్సీలో వేసి గుజ్జు తీసుకోవాలి. దాన్ని వడకడితే రసం వస్తుంది. దానికి రెండుచెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే వారం రోజులు వాడుకోవచ్చు. ఈ మిశ్రమంలో దూదిని ముంచి.. రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Baby Corn bullets


కావల్సినవి: 
బేబీకార్న్‌ - ఎనిమిది, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, మొక్కజొన్నపిండి - రెండు చెంచాలు, మిరియాల పొడి - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కప్పు.  
తయారీ: 
బేబీకార్న్‌ను పొడుగ్గా తరగాలి. వాటిని మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ కలిపి పక్కన ఉంచాలి. తరవాత బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక ఒక్కో ముక్కను విడిగా వేసి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించుకొని తీయాలి. కరకరలాడే బేబీకార్న్‌ బులెట్లను టమాటాసాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి.

Tuesday, 24 January 2012

Frozen skin grease, dirt Remove

రెండు చెంచాల ఓట్స్‌ తీసుకుని పాలు లేదా పెరుగుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి కాసేపయ్యాక కడిగితే.. చర్మంపై పేరుకొన్న జిడ్డు, మురికి వదిలి తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

Silver objects Shine

వెండి వస్తువులు కొత్తవాటిగా మెరవాలంటే అగరవత్తుల బూడిద తో తోమాలి.

Monday, 23 January 2012

Books on the shelf to be getting worms....

పుస్తకాల  అల్మారా లో పురుగులు రాకుండా ఉండాలంటే కొంచెం గందం పొడి చల్లితే పురుగులు రాకుండా ఉంటాయి. మంచి సువాసన కూడా.

Remove sweat stains

బట్టల పై చెమట మరకలు పోవాలంటే కొద్దిగా షాంపూ పట్టించి కొంతసేపు అయ్యాకా ఉతికి ఆరేస్తే మరకలు మాయం.

Sunday, 22 January 2012

Remove Rice worm

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యాన్ని శుబ్రం చేసి కొంచెం ఆముదం పట్టిచి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా పురుగు పట్టకుండా ఉంటాయి.

garlic is to be stored for longer periods ....

వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెల్లుల్లి ని పొట్టు తీసి తడి లేకుండా కొంత సేపు ఎండలో ఆరబెట్టి  ఆ తర్వాత ఆలివ్ నూనె లో వేసుకుని ఫ్రిజ్ లో ఉంచి వాడుకోవాలి.

Saturday, 21 January 2012

Coriander dosa


కావలసిన పదార్థాలు:
ఉప్పుడు బియ్యం - ఒక కప్పు, మామూలు బియ్యం - రెండు కప్పులు, మినప్పప్పు- అర కప్పు, శెనగపప్పు - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర కట్టలు - రెండు, అల్లం ముద్ద - రెండు టీ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - నాలుగు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
ఉప్పుడు బియ్యాన్ని వేడినీళ్లలో ఉదయాన్నే నానపెట్టుకోవాలి. మామూలు బియ్యాన్ని చల్లటి నీళ్లలో నానపెట్టుకోవాలి. మినప్పప్పు, శెనగపప్పుని కూడా నానపెట్టాలి. సాయంత్రం అయ్యాక వీటన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి. మర్నాడు అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర తురుముని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని దోశలపిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి ఈ పిండితో దోశలు వేసుకోవాలి.

Plask avoid odor.....

ప్లాస్క్ దుర్వాసన రాకుండా ఉండాలంటే రెండు లవంగాలు వేస్తె సరి.

Friday, 20 January 2012

Mix without losing the sharpness of the blades to be....

మిక్సీ బ్లేడ్స్ పదును కోల్పోకుండా ఉండాలంటే  నెలకోసారి కల్లుప్పుని మిక్సీలో వేసి తిప్పితే సరి.

Gold jewelry Shine

చక్కర కలిపినా నీటిలో బంగారు నగలు ఉంచి అరగంట అయ్యాకా టూత్ బ్రష్ తో రుద్దితే మెరుస్తాయి.


Thursday, 19 January 2012

Sweet Basket


కావల్సినవి: రైస్‌ నూడుల్స్‌ - పావుకేజీ, జీడిపప్పు, వేరుసెనగపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు - అన్నీ కలిపి పావుకప్పు, యాలకులపొడి, - అరచెంచా, ఆకుపచ్చ రంగు - కొద్దిగా, బెల్లం - 200 గ్రా, నూనె, లేదా నెయ్యి - తగినంత.
తయారీ:
నూడుల్స్‌ ఉడికించి చల్లారాక నీళ్లు ఒంపేయాలి. బాణలిలో సగం వరకూ నూనె పోసి కాచి, చిల్లుల గరిటెలో నూడుల్స్‌ తీసుకొని మరో గరిటెతో ఒత్తిపట్టుకొని దాన్లో ఉంచాలి. బంగారువర్ణంలోకి వచ్చాక బయటకు తీస్తే బుట్ట ఆకృతి వస్తుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో బెల్లం తురుము తీసుకుని, ఆకుపచ్చరంగు కలిపి పాకం పట్టాలి. ముదురుగా వచ్చాక దాన్లో నెయ్యి, యాలకుల పొడి వేసి దించాలి. పాకం వేడిగా ఉండగానే నూడుల్స్‌ బుట్టల్ని వేసి కాసేపు ఉంచి తీయాలి. వీటిలో జీడిపప్పు, వేరుసెనగ, ఎండుద్రాక్ష, ఖర్జూరాల్లాంటివి వేసుకుంటే.. సరి.

Monday, 16 January 2012

Know ralatam per dandruff hair....

చుండ్రు తగ్గాలంటే.......ఉప్పు కలిపినా నీటిలో శిరోజాలు కడిగితే చుండ్రు తగ్గి జుట్టు రాలటం తగ్గుతుంది. 

Know shit pains.....

శరీరం అంతా ఆముదం రాసి, అరగంట ఆగి వేడి నీటిలో స్నానం చేస్తే శారీరక బాధలు తగ్గి నిద్ర పడుతుంది.

Tuesday, 10 January 2012

Idli Manchuria


కావలసినవి:
చిన్న (బటన్) ఇడ్లీలు - 10, టొమాటో సాస్ - రెండు టీ స్పూన్లు, సోయాసాస్ - రెండు టీ స్పూన్లు, పచ్చిమిర్చి - మూడు (పొడవుగా కట్ చేయాలి), క్యాబేజీ తురుము - పావు కప్పు, క్యారట్ తురుము - పావు కప్పు, అల్లంతురుము - కొద్దిగా, ఉల్లితరుగు - కొద్దిగా, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, కొత్తిమీర - చిన్న కట్ట

తయారి:

ముందుగా ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో అల్లం తురుము, ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆపైన సోయాసాస్, టొమాటో సాస్, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీరు చల్లి దోరగా వేయించాలి. తరవాత ఇడ్లీలను అందులో వేసి మరోమారు వేయించాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లో పెట్టి, క్యారట్ తురుము, క్యాబేజీ తురుము చల్లి సర్వ్‌చేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

Know headache.....

తలనొప్పి తగ్గాలంటే కాస్త లవంగ రసం, చిటికెడు ఉప్పు, కొద్దిగా పాలు కలిపి తీసుకుంటే తగ్గుతుంది.

Monday, 9 January 2012

Dry Fruit Idli


కావలసినవి
ఖర్జూరాలు - 6 , జీడిపప్పులు - 20, కిస్‌మిస్ - 20, బాదం పలుకులు - 10, (వీటినన్నిటినీ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి), ఇడ్లీపిండి - పది ఇడ్లీలకు సరిపడేంత, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చికొ బ్బరి తురుము - అర కప్పు, చెర్రీస్ - ఆరు, క్యారట్ తురుము - పావు కప్పు, తేనె - నాలుగు టీస్పూన్లు

తయారి

ముందుగా ఇడ్లీ పిండిని ఇడ్లీ రేకులలో వేసి స్టవ్ మీద ఉంచాలి. సగం ఉడికిన తరువాత ఒకసారి మూత తీసి, కట్ చేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు ఇడ్లీల మీద వేసి మళ్లీ మూత పెట్టేయాలి. బాగా ఉడికిన ఇడ్లీలను టిఫిన్ ప్లేట్లలోకి తీసి పైన కొద్దికొద్దిగా నెయ్యి వేసి దాని మీద క్యారట్ తురుము, కొబ్బరి తురుము, తేనె వేసి, చెర్రీస్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. వీటిని పిల్లలు బాగా ఇష్టపడతారు.

spoilage of to be refrigerated vegetables....

 ఫ్రిజ్‌లో కూరగాయల అర అడుగున కాగితం పరిచి వాటిని ఉంచితే తడిని ఎప్పటికప్పుడు పీల్చుకుంటుంది. కూరలు చెడిపోవు.

 

Sunday, 8 January 2012

Kanda Vadalu


కావల్సినవి: 
కంద - పావుకేజీ, బియ్యం - అరకప్పు, సెనగపప్పు - కప్పు, పచ్చిమిర్చి - పన్నెండు, జీలకర్ర - రెండు చెంచాలు, ఉప్పు, పసుపు - రెండు చెంచాల చొప్పున, పెరుగు - అరకప్పు, కరివేపాకు రెబ్బలు - మూడు, నూనె - పావుకేజీ, అల్లం - చిన్నముక్క, కొబ్బరి కోరు - ఐదు చెంచాలు.  
తయారీ: 
బియ్యం, సెనగపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి. కందను ముక్కలుగా తరిగి పసుపు, ఉప్పు కలిపిన పెరుగులో వేసి కాసేపు ఉంచాలి. నానబెట్టుకున్న సెనగపప్పు, బియ్యాన్ని గట్టి పిండిలా రుబ్బుకోవాలి. అందులో పెరుగు వంపేసిన కందముక్కలతో పాటు.. మిగిలిన పదార్థాలన్నీ వేసి.. మరోసారి మిక్సీ పట్టాలి. పిండి గట్టిగా ఉండేలా చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేడిచేసి పిండిని వడల్లా తట్టి వేసి బంగారువర్ణంలోకి వచ్చాక తీసేయాలి. ఈ వడల్ని నేరుగానే కాదు.. ఏ కూర లేనప్పుడు వేడివేడి అన్నంలో కూడా తినొచ్చు.

Gravy, soups thickened to give.....

గ్రేవీ, సూపులు చిక్కగా రావాలంటే తయారుచేసేటప్పుడు మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.

Saturday, 7 January 2012

Potato Basket


కావల్సినవి:
బంగాళాదుంపలు- నాలుగు, క్యాలీఫ్లవర్‌- ఒకటి, ఉల్లిపాయ తరుగు- పావుకప్పు, క్యాప్సికం- ఒకటి, బఠాణీలు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి-మూడు, టమాటాలు- నాలుగు, వెల్లుల్లి- నాలుగురెబ్బలు, ఉప్పు- రుచికి తగినంత, నెయ్యి- పావు కప్పు, కొత్తిమీర- కొద్దిగా.
 

తయారీ:
  బంగాళా దుంపల చెక్కు తీసిపెట్టుకోవాలి. అలానే పైన సగభాగం తీసేసి గిన్నెల్లా తయారుచేయాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్‌, క్యాప్సికం, బఠాణీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వెల్లుల్లిని గిన్నెలోకి తీసుకొని నీళ్లుపోసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు ఇంకిపోయే వరకూ వాటిని ఉడికించాలి. చల్లారాక గిన్నెల్లా చేసిన బంగాళాదుంపల్లో ఈ మిశ్రమాన్ని ఉంచి వెడల్పాటి పాన్‌లో పదినిమిషాలు ఉంచి తీయాలి. తరవాత బాణలిలో నెయ్యి కరిగించి టమాటా ముక్కలు వేయాలి. అవి మగ్గాక ఉప్పు వేసి బంగాళాదుంపలకు టూత్‌పిక్స్‌ గుచ్చి అందులో ఉంచి మూతపెట్టాలి. దుంపలు మెత్తగా అయ్యాక కొత్తిమీర చల్లి దించేస్తే సరిపోతుంది.

Silver objects to be Well......

వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే.. వాటిని భద్రపరిచేచోట కర్పూరం బిళ్లలు ఉంచాలి.

Friday, 6 January 2012

Vermicelli cutlet


కావల్సినవి: సేమియా- రెండు కప్పులు, బంగాళాదుంపలు- రెండు, క్యారెట్‌-ఒకటి, బీన్స్‌- యాభై గ్రాములు, ఉల్లిపాయ తరుగు- కప్పు, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా, మిరియాలపొడి- అరచెంచా, పచ్చిమిర్చి- నాలుగు, బ్రెడ్‌ ముక్కలు- నాలుగు, నూనె- అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత.

తయారీ: బంగాళాదుంపలను మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టాలి. అలానే మరో గిన్నెలో నీళ్లు పోసి అందులో చెంచా నూనె, కొద్దిగా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక సేమియా వేసి మూతపెట్టాలి. సేమియా ఉడికాక నీళ్లు ఒంపేసి.. అందులో క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద, ఉప్పు, మిరియాలపొడి, బ్రెడ్‌పొడి చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌ మాదిరి చేత్తో పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక కట్‌లెట్‌ వేయాలి. బంగారువర్ణంలోకి  వచ్చాక దించేస్తే సరిపోతుంది. వీటిని టమాటాసాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి.

Pimples, black spots due to their Remove....

మొటిమలు,వాటి వల్ల వచ్చే నల్లని మచ్చలు పోవాలంటే నాలుగు చుక్కల నిమ్మ రసం లో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలిపి మొతోమలకు రాసి, రెండు గంటలు తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

Thursday, 5 January 2012

Sago Roti


కావల్సినవి:
సగ్గుబియ్యం- కప్పు, బంగాళాదుంప- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, కొత్తిమీర- కొద్దిగా, నూనె- పావుకప్పు, వేరుసెనగలు- కప్పు, ఉప్పు-రుచికి తగినంత.
  తయారీ: 
 వేరుసెనగల్ని నూనె లేకుండా వేయించాలి. చల్లారాక పొట్టు తీసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. బంగాళాదుంప పొట్టు తీసి తురుముకోవాలి. తరవాత సగ్గుబియ్యంలో నీళ్లు పోసి ఐదు నిమిషాలయ్యాక ఒంపేసి పక్కన పెట్టాలి. మూడు గంటలయ్యాక నానిన సగ్గుబియ్యంలో పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు, బంగాళాదుంప తురుము వేసి బాగా కలపాలి. గట్టిగా ఉంటే కాసిని నీళ్లు కలుపుకోవాలి.ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి చేత్తో ఒత్తుకోవాలి. వీటిని పెనం మీద రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. వేడి వేడి సగ్గుబియ్యం రోటీలను కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

gas, belching Know.....

రెండు చిటికల దాల్చిన చెక్క పొడిని అర గ్లాస్ నీళ్ళల్లో కలిపి భోజనం చేసిన అర గంట తర్వాత తాగాలి.

Wednesday, 4 January 2012

Tamota Paneer Bajji


కావల్సినవి: 
టమాటాలు- ఐదు, పనీర్‌- రెండొందల గ్రాములు, ఉల్లిపాయలు- ఒకటి, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, ఉప్పు, కారం -రుచికి తగినంత, మైదా- పావు కప్పు, గరంమసాలా- పావు చెంచా, బ్రెడ్‌ పొడి- కొద్దిగా, కొత్తిమీర- అరకట్ట, నూనె- పావు కప్పు. 
తయారీ: 
టమాటాలను నాలుగు ముక్కలుగా కోసి గింజలను తొలగించి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. తరవాత బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, కారం వేయాలి. ఐదు నిమిషాలయ్యాక టమాటా ముక్కలు, పనీర్‌ తురుము, కొత్తిమీర వేసి బాగా కలియతిప్పాలి. టమాటా ముక్కలు మగ్గాక ఉప్పు వేసి దించేయాలి. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కాసిని నీళ్లు పోసి గరిటె జారుగా కలుపుకోవాలి. బాణలిలో కప్పు నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక టమాటా, పనీర్‌ కూరను ఉండలా చేసి మైదా పిండిలో ఉంచి బ్రెడ్‌ పొడిలో అద్ది వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేయాలి. వీటిని టమాటాసాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

Elbows black, roughness Remove....

సగం కప్పు పంచదారని, ముప్పావు కప్పు కుసుమ నూనె లో కరిగించి ఉంచుకోవాలి . రోజు పడుకోబోయే ముందు మోచేతులకు రాసుకుంటే నలుపు, గరుకుతనం తగ్గిపోతుంది.

Tuesday, 3 January 2012

American dosa


కావలసినవి
మైదా: కప్పు, వెుక్కజొన్నపిండి: 2 టేబుల్‌స్పూన్లు, వెన్న: టేబుల్‌స్పూను, పాలు: కప్పున్నర, కోడిగుడ్లు: 2, పంచదార: టేబుల్‌స్పూను, బేకింగ్‌పౌడర్‌: టీస్పూను, వెనీలా ఎసెన్స్‌: రెండు చుక్కలు, చాకొలేట్‌ సాస్‌: కప్పు, తాజాపండ్లముక్కలు: కప్పు, క్రీమ్‌: టేబుల్‌స్పూను.

తయారుచేసే విధానం
* ముందుగా మైదాలో కార్న్‌ఫ్లోర్‌, వెన్న, పాలు, కోడిగుడ్లసొన, పంచదార, బేకింగ్‌పౌడర్‌, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్‌ పెనంమీద చదరపు ఆకారంలో పలుచని దోసెల్లా వేసి రెండువైపులా కాల్చి తీయాలి.
* తరవాత ఒక్కో దోసె మీద కొద్దిగా చాకొలెట్‌ సాస్‌ వేసి, కొన్ని పండ్లముక్కలు చల్లి చదరపు ఆకారంలో మడవాలి. దీన్ని ప్లేటులో పెట్టి త్రికోణాకారం వచ్చేలా మధ్యలోకి కోసి చుట్టూతా కొద్దిగా చాకొలేట్‌సాస్‌ వేసి పైన క్రీమ్‌, పండ్లముక్కలు వేస్తే అదే అమెరికన్‌ దోసె. 

Cough early in the Know.....

*ఎక్కువుగా దగ్గు వస్తే క్యాబేజీ రసం లో పంచదార కలిపి ఇవ్వండి. 
*ఒక స్పూన్ తేనే లో ఒక స్పూన్ నీరు కలిపి, అందులో రెండు మిరియం గింజల పొడి ని కలిపి నెమ్మదిగా చప్పరిస్తే దగ్గు తగ్గితుంది. 
*అల్లపు రసం లో తేనే బాగా కలిపి తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది.

Monday, 2 January 2012

ఉల్లిపాయ కోసినప్పుడు కంటి నుంచి నీరు రాకుండా ఉండాలంటే....

ఉల్లిపాయ కోసినప్పుడు కంటి నుంచి నీరు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను గంట సేపు ఫ్రిజ్ లో ఉంచి కొస్తే కంటి నుంచి నీరు రాదు.

Sweet Corn Paneer Kurma