Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Friday, 27 April 2012

If the beauty of your followed yogurt at home

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. అందుకనే పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.

- తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే.. మళ్లీ విడిగా కండీషనర్‌ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్‌లా ఉపయోగ పడుతుంది. పెరుగులో శనగపిండిని కలిపి, నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, ముఖం మీదనున్న మృతకణాలు తొలగిపోతాయి.
 

- ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే అది క్లెన్సింగ్‌ ఏజెంటులా పనిచేస్తుంది. పెరుగులో కాస్తంత చక్కెరగానీ లేదా ఉప్మా రవ్వగానీ వేసి బాగా కలిపి.. ముఖానికి పట్టించి మసాజ్‌ చేస్తే డెడ్‌ స్కిన్‌ తొలగిపోతుంది. పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్‌క్యూబ్‌లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్‌ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

Thursday, 26 April 2012

Apple Rasgulla


కావలసిన పదార్థాలు:
యాపిల్ పేస్ట్: 2cups
మైదా: 1/2cup
పంచదార: 1cup
బేకింగ్ సోడా: 1/4tsp
నీరు: 1 cup
రోజ్ వాటర్: 1/2 tbsp
వెనిలా: 1tbsp
యాలకుల పొడి: 1tsp
నూనె/నెయ్యి: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం: 

1. ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా, బేకింగ్‌ సోడా, వెనీలా, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. పూరి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత యాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ లో వేసి గట్టిగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పడు దీనిని చిన్నచిన్న బాల్స్‌ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసి అందులో ఈ యాపిల్ క్రీమ్ బాల్స్ పెట్టి గుడ్రంగా చుట్టుకోవాలి.
4. ఒక బౌల్ లో పంచదార, యాలకుల పొడి వేసి, నీళ్లు, కలిపి లేత పాకం పట్టి గోరువెచ్చగా ఉంచాలి.
5. తర్వాత యాపిల్ బాల్స్ ను వేడి నూనెలో సన్నటి మంటమీద వేగించి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసి పంచదార పాకంలో వేయాలి. పాకం బాగా పీల్చిన తర్వాత వీటిని తీసి చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ లో పెట్టి చివరిగా బాదం తరుగు గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే నోరూరించే యాపిల్ రసగుల్లాలు రెడీ...

Wednesday, 25 April 2012

Paneer Tikki


కావలసిన పదార్దాలు :
శనగ పప్పు : అర కప్పు
(వండే ముందు రెండు గంటలు నానబెట్టాలి)
పన్నీర్‌ : 500 గ్రా
ఎండు మిరపకాయలు : ఐదు
చాట్‌ మసాలా : 2 టీ స్పూన్లు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : నాలుగైదురేకులు
పచ్చి మిరపకాయలు : ఆరు
బంగాళాదుంపలు : నాలుగు
(మీడియం సైజువి)
కార్న్‌ఫ్లోర్‌ : పావు టీ స్పూన్‌
నూనె : 4 టేబుల్‌ స్పూన్లు

ఇలా చేయాలి
బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. అల్లం, పచ్చి మిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు వేసి వేడిచేయాలి. శనగపప్పు, ఎండు మిరపకాయలు, చాట్‌ మసాలా, ఉప్పు వేసి, శనగపప్పు వేగే వరకు వేయించాలి. ఇప్పుడు పన్నీర్‌ వేయాలి. ఉడికించిన బంగాళాదుంపలను చిదిమి కలపాలి.
 
ఈ మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి తీసుకుని టిక్కి ఆకారంలో మలిచి ఒక్కొక్కటిగా కార్న్‌ఫ్లోర్‌లో వేయాలి. టిక్కి మొత్తం ఫ్లోర్‌ పట్టించాలి. వీటిని కాగిన నూనెలో వేసి ఎర్రగా వచ్చే వరకు వేయించాలి. పైన చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే పన్నెండు లేదా పదమూడు టిక్కిలు చేయవచ్చు. ఈ పన్నీర్‌ టిక్కిని నచ్చిన చట్నీతో తిం టుంటే చూసే వాళ్లకి నోరూరకుండా ఉంటుందా.

Monday, 23 April 2012

Orange Lemon skyas


కావలసిన పదార్థాలు:
బత్తాకాయలు: 12
ఆరెంజ్‌ కలర్‌: 1/2tsp
పంచదార: 6
నీరు: 3cups
పొటాషియం మెటాబైసల్ఫేట్: 1/2tsp
ఆరెంజెస్: 3-4 లేదా ఆరెంజ్‌ ఎసెన్స్‌: 1tsp
నిమ్మకాయ: 3-4 లేదా సిట్రిక్‌ ఆసిడ్(నిమ్మ ఉప్పు)‌: 7tsp
ఐస్ క్యూబ్స్: 4-8

తయారు చేయు విధానం:
1. ముందుగా నీళ్ళలో పంచదార కలిపి తీగపాకం పట్టాలి.
2. తర్వాత 1/4 కప్పు వేడి నీళ్ళలో సిట్రిక్‌ ఆసిడ్‌ కలిపి పాకంలో కలపాలి.
3. ఇప్పుడు బత్తాయిలు రసం తీసి, ఆ రసానికి ఎసెన్సు, రంగు కలపాలి. ఆ బత్తాయి రసాన్ని పాకంలో కలపాలి. రెండు టీస్పూన్ల వేడి నీళ్ళలో పొటాషియం మెటాబైసల్ఫేట్‌ కలిపి రసంలో కలపాలి. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి మూత గట్టిగా పెట్టి వారం తర్వాత బయటకు తీసి తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్‌ చేయాలి.

Saturday, 21 April 2012

Mangoes coconut chutney


కావలసిన పదార్ధాలు:
మామిడికాయ: 2
పచ్చికొబ్బరితురుము: 4cup
ఎండుమిర్చి: 10
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర: 1tsp
వెల్లుల్లి: 4-6 రెబ్బలు
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: తగినంత
తాలింపుకు
శనగపప్పు: 1/2tsp
మినప్పప్పు: 1/2tsp
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: 2 


తయారు చేసే విధానం:
1. ముందుగా ఒక స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి.
2. తర్వాత ఈ ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లిరెబ్బలు జీలకర్ర మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, కొబ్బరితురుము వేసి అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4. నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే పుల్లగా, కమ్మగా మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ లొట్టలేయాల్సిందే.. ఇక వదిలిపెట్టారు అంతే...

Friday, 20 April 2012

Divide the onion, ginger Molds Remove

ఉల్లి పాయలు , అల్లం, వంటివి తరిగినప్పుడు చాపింగ్ బోర్డ్ మిద కొద్దిగా వంట సోడా రాసి పావు  గంట అయ్యాకా కడిగితే దుర్వాసనలు దురమవుతాయి.

Mikds vegetable masala idli


కావలసిన పదార్థాలు:
క్యారెట్‌: 1
బంగాళాదుంప: 1
పచ్చిబటానీ: 2tbsp
క్యాబేజీ: 2tbsp
పచ్చిమిర్చి: 3-6
ఉల్లిపాయ: 1
అల్లం: చిన్న ముక్క
బియ్యం: 3cups
మినప్పప్పు: 1cup
సెనగపప్పు: 1/4cup
కొబ్బరి నీళ్లు: 1glass
జీలకర్ర: 1tsp
కొబ్బరి తురుము: 2tsp
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం: 

1. ముందుగా పప్పులు, బియ్యం కడిగి ఆరుగంటల పాటు నీటిలో నానపెట్టుకోవాలి.
2. తర్వాత కూరగాయలను కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
3. అలాగే పప్పు, బియ్యం, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
4. ఇప్పుడు ఉడికించిన కూరగాయలు, కొబ్బరితురుము, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, కొబ్బరి నీళ్లు వేసి బాగా గిలక్కొట్టాలి. ఇడ్లీ పాత్రలో పిండివేసి ఆవిరి మీద ఇడ్లీను ఉడికించాలి. ఈ ఇడ్లీలను కరివేపాకు పొడి, కొబ్బరి చట్నీలతో సర్వ్ చేయాలి అంతే మసాలా ఇడ్లీ రెడీ.

Thursday, 19 April 2012

If wrinkles are more likely to

ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అప్లై చేయండి. రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Spicy Masala Dosa


కావలిసిన పదార్ధాలు:
బియ్యం: 2cups
అల్లం మిర్చి పేస్టు: 1tbsp
ఉల్లి ముక్కలు: 1cup
కారం: 1tsp
మైదా పిండి: 1cup
పుల్ల మజ్జిగ: 1glass
ఉప్పు: రుచికి తగినంత
పసుపు :చిటికెడు

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం నానబెట్టి శుభ్రం చేసి మెత్తగా పిండి రుబ్బు కోవాలి.
2.ఈ పిండికి మైదా, అల్లం, మిర్చి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు , కారం, పసుపు వేసి అన్ని కలిసేలా కలిపి మజ్జిగ పోసుకుని జారుగా చేసుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి పెన్నం మీద పిండితో రవ్వ దోసె మాదిరిగా వేసి సరిపడ నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
4. ఈ స్పైసీ మసాలా దోసెను వేడిగా కొబ్బరి చెట్నీ లేదా అల్లం చెట్నిలతో సర్వ్ చెయ్యాలి. చాలా రుచిగా ఉంటుంది.

Wednesday, 18 April 2012

Mexican brinjal (eggplant)


 కావలసిన పదార్దాలు:
వంకాయలు: 4-6
నీళ్లు వడగట్టిన గట్టిపెరుగు: 1/2
ఉప్పు: రుచికి తగినంత
మిరియాలపొడి: 1tsp
నిమ్మరసం: 1tsp
కొత్తిమీర: 2tbsp(గార్నిషింగ్ కి)
నూనె తగినంత
సాస్ కొరకు అవసరమైన వస్తువులు:
ఉల్లిపాయ ముక్కలు: 1cup(సన్నగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 4-6
టమోటో ముక్కలు: 2cupత
పచ్చిమిర్చి: 4-6
టమోటో సాస్: 2tbsp
క్యాప్సికమ్ సాస్: 1tsp
మిరియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:

1. ముందుగా వంకాయలను అర అంగుళం లావు గుండ్రటి ముక్కలుగా కోసి పది నిమిషాలు ఉప్పు కలిపిన నీటిలో ఉంచ బయటకు తీయ్యాలి. తర్వాత వీటిని పొడి బట్టతో శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టాలి.
2. తర్వాత పాన్ పెట్టి వంయాయ ముక్కలను వేసి రొట్టెలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
3. ఇప్పుడు పెరుగు ఉప్పు, మిర్చి, నిమ్మరసం వేసి కలిపి చల్లబడటానికి ఫ్రిజ్ లో ఉంచాలి. నూనె వేడి చేసి వెల్లుల్లి, ఉల్లిముక్కలు గోధుమరంగు వచ్చేంత వరకు వేయించి అన్ని పదార్థాలను వేసి పదినిమిషాలపాటు సన్నటి మంటమీద ఉడికించాలి.
4. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంయాయ ముక్కలను ప్లేట్ లో తీసుకొని ప్రతి ముక్కపై సాస్ వేసి ప్రి హాట్ ఓవెన్ లో 200డిగ్రీల సెంటీగ్రేడ్ పై ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. ఒక్కో ముక్కపై పెరుగు వేసి అలంకరించి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మెక్సికన్ బ్రింజాల్ రెడీ..

Know ceyandila spots .. !!

  • ద్రాక్షపండ్ల గుజ్జును రోజుకి రెండు సార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
  • బొప్పాయి గుజ్జును పూతలా వేసి పది నుంచి పదిహేను నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎం తో మార్పు ఉంటుంది.
  • యాపిల్‌ గుజ్జును మచ్చలపై రుద్ధి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
  • నారింజ తొక్కలను పొడి చేసి అర టి పండు గుజ్జులో కలిపి పూతగా వేసి ఆరాక గోరు వెచ్చటి నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
  • జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు స్ట్రాబె ర్రీ రసం రాసుకుంటే బ్లీచ్‌లా పని చేస్తుంది.
  • బాదం పప్పు గుజ్జులో గ్లూకోజ్‌ పౌడర్‌ కొద్దిగా కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చ లు తగ్గుముఖం పడతాయి.
  • ఆముదం గింజలను నానబెట్టి గుజ్జు చేసి మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంట య్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.

Tuesday, 17 April 2012

Pumpkin Halwa


కావలసిన పదార్ధాలు:
గుమ్మడికాయ - 1/2 kg
పంచదార -1/4 kg
నెయ్యి - 50 gms
కోవా - 50 gms
యాలకుల పొడి - 1 tsp
ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా - 1/4 కప్పు
కేసరి రంగు - చిటికెడు

తయారు చేయు విధానం:

1. ముందుగా గుమ్మడికాయ కడిగి చెక్కు తీసి, సన్నగా తురిమి పెట్టుకోవాలి.
2. మందపాటి పాన్ లో నెయ్యి వేసి అందులో రెడి చేసి పెట్టుకొన్న తురుము తడి ఆరిపోయేదాకా వేయించాలి.
3. ఇపుడు అందులో పంచదార వేసి మళ్ళీ ఉడికించాలి. కొద్దిగా చిక్కబడ్డాక కోవా, పిస్తా రంగు, యాలకుల పొడి వేసి బాగా కలిపి నెయ్యి బయటకు వచ్చేదాకా వేయించాలి. ఇపుడు సన్నగా తరిగిన ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా వేసి దింపేయాలి.

When the stomach disgusting ...

కడుపులో మంటగా ఉన్నప్పుడు... పావుకప్పు కొబ్బరి పాలలో రెండు చెంచాల ముల్లంగి రసాన్ని కలుపుకుని తాగితే నెమ్మదిస్తుంది.

Monday, 16 April 2012

Tomato Cashew Curry


కావాల్సిన పదార్ధాలు :
టమాటాలు: 1/2kg
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 1
యాలకలు: 3-4
దాల్చిన చెక్క: చిన్నది
లవంగాలు: 2
జీడిపప్పు: 1cup
కొబ్బరి తురుము: 1/2cup
గరం మసాలా: 1tsp
మిర్చి పొడి: 1tsp
పంచదార: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత

జీలకర్ర : 1tsp
నూనె: తగినంత
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారుచేసే విధానం :
1. ముందుగా అల్లంవెల్లుల్లి పేస్ట్, యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొబ్బరి, జీడిపప్పు, ముక్కలుగా తరిగిన కొన్ని టమాటా లు మిక్సీ జార్‌లో వేసి కాసేపు గ్రేండ్‌
చేయాలి.
2. తర్వాత ఆపై స్టౌ మీద పాన్ పెట్టి ఓస్పూన్‌ నూనె వేసి వేడెక్కాక, ఆవాలు, జీలకర్ర కాసేపు వేగనీయండి. ఇలా వేగిన పోపును ముందే సిద్దం చేసుకుని ఉంచిన టమాటా, జీడిపప్పు ముద్దలో రుచికి తగినంత ఉప్పు, పంచదార కలిపి బాగా వేయించాలి.
3. ఇప్పుడు మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమర్చి ముక్కులు, మిగిలిన టమాటాలు ఉడికించి గరం మసాలా పొడి, ఎర్ర కారంపొడి, వేయించి నజీడిపప్పు కలపి, ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకున్న టమాటా జీడిపప్పు మిశ్రమంలో కలిపి కొత్తి మీరతో గార్నీష్‌ చేసుకుంటే.. రుచికరమైన టమాటా జీడిపప్పు కర్రీ రెడీ..