తరుచుగా మొటిమలు వస్తూ తగ్గకుండా అవి మచ్చలుగా పడేవారు 10 రోజులకు ఒకసారి
ఆవిరిపట్టి తరువాత మెంతుల పొడి 1/2 స్పూన్, పసుపు 1/4 స్పూన్, దోస కాయ
గుజ్జు 1 టీ స్పూన్, టమాట రసం 1 టీ స్పూన్ కలిపి అందు లో 1 టీ స్పూన్
కొబ్బరినీరు, సున్నం మీద తేట కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసి దానిని ముఖానికి
రాసి 20 నిమిషాల తరువాత చన్నీటితో కడగాలి. వారానికి ఒకసారి మెంతికూర
ఆకులని, వేపి చిగుళ్ళని, పసుపు కలిపి నూరి ముఖానికి రాసి 5 నిమిషాలు
నెమ్మదిగా వేళ్ళతో మసాజ్ చేసి 20 నిమిషాల తరువాత ముఖాన్ని కడగాలి. ఇలా
చేయటం వల్ల మొటిమలు తగ్గుతాయి.మెంతికూర 4 కట్టలు, గోరింటాకు 1/2 కప్పు, వేప
పొడి 1/4 కప్పు, పెరుగు 1 కప్పు, అన్నింటినీ కలిపి తలకి పట్టించి అరగంట
తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా 10 రోజులకి ఒకసారి చేస్తే
తలలో చుండ్రు తగ్గుతుంది. ఫేషియల్‌గా మెంతికూర ముఖంపై మచ్చలు ఉన్నా,
మొటిమలు ఉన్నా వారికి ఫేషియల్ చేసి తరువాత ప్యాక్ చేసే ముందు చిన్న
మెంతికూర రసం 5 చెంచాలు, నిమ్మరసం 1/2 చెంచా, పుదీనా రసం 2 చెంచాలు కలిపి
వేళ్ళతో ముఖాన్ని మసాజ్ చేస్తే ఎలాంటి మొటిమలైనా, మచ్చలైనా తగ్గుతాయి.
Saturday, 31 March 2012
Variety of cheese omelette
కావలసిన పదార్ధాలు:
కోడిగుడ్లు: 2
పచ్చిమిర్చి: 2
పాలు: 2 tbsp
పెరుగు: 2tbstp
ఉల్లిపాయ: 1
టమోటా: 1
మిరియాల పొడి: 1tsp
సన్నగా తరిగిన కూరలు: 2tbsp
చీస్: 2tbsp
ఆయిల్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయ, టమోటాలను సన్నగా తరిగిపెట్టుకోవాలి.
2. ర్వాత కోడుగుడ్లను పగులగొట్టి అందులో తరిగి పెట్టుకున్న కూరలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
3. పాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి వేడయ్యాక దీనిపై గుడ్డు మిశ్రమాన్ని వేసి కాలాక రెండు వైపులకు తిప్పి తురిమి పెట్టుకున్న చీస్‌ను పైన చల్లి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత ప్రక్కకు దింపుకోవాలి. అంతే వెరైటీ చీస్ ఆమ్లెట్ రెడీ.

Friday, 30 March 2012
Mushroom Palau
కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు: 250grms
పన్నీర్: 250grms
కాలీఫ్లవర్: 1/2cup
క్యాప్సికమ్: 2cup
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 6-10
బియ్యం: 2cups
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4-6
పలావు ఆకులు: 2
అల్లం వెల్లుల్లి: 2tbsp
కొత్తిమీర తురుము: 2tbsp
గరం మసాలా: 1tsp
నెయ్యి: 1tbsp
నూనె: తగినంత
తయారు చేసే విధానం:
1. మొదటగా బియ్యం అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, మష్రూమ్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. తర్వాత స్టౌ పై నాన్ స్టిక్ పాన్ లో నెయ్యి వేసి లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, పలావు ఆకు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత అల్లంవెల్లుల్లి వేసి ఒక్కనిమిషం పాటు వేయించి తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు, వేసి ఎర్రగా వేయించాలి. అవి వేగాక పన్నీర్ కూడా వేసి వేయించాలి.
4. తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, పుట్టగొడుగుల ముక్కలన్నీ వేసి తగినంత ఉప్పువేసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు బాగా మగ్గి మెత్తగా ఉడికిన తర్వాత వండిన అన్నంను అందులో వేసి బాగా కలకలిపి మూత పెట్టి సిమ్ లో కాసేపు ఉంచి కొత్తీమీర తురుము చల్లి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే మష్రూమ్ పలావ్ రెడీ....

Beautiful eyebrows - some tips
- కొనదేలిన ముక్కు ఉన్నవారు ఐబ్రోస్ లావుగా ఉంటే మంచిది.
- దూదిని ఆల్కహాల్‌లో ముంచి కనుబొమ్మల కింద భాగం, వెంట్రుకలపై భాగం బాగా శుభ్రం చేసి బ్రష్ చేసుకోండి. అయినా టాల్కమ్ పౌడర్‌ను ప్లకింగ్‌కి ముందు వేసుకోవటం మరిచిపోకూడదు. కన్నుకు అనుగుణమైన రీతిలో కనుబొమ్మల్ని షేప్ చేసుకొని ఐబ్రోలైనర్‌తో గీసుకోవాలి. గీతకు పైన వచ్చే వెంట్రుకల్ని ప్లక్కర్‌తో తీసివేయాలి. ప్లక్కర్ చర్మాన్ని పట్టకోకుండా జాగ్రత్త వహించాలి.
- చిన్న ముఖం ఉన్న వారికి చిన్న కనుబొమ్మలే అందంగా ఉంటాయి.
- కోడిగుడ్డు ఆకారంలో మీ ఫేస్ ఉంటే కనుబొమ్మలు దట్టంగా, ట్రిమ్‌గా ఉంటేనే బాగుంటుంది.
- త్రికోణాకృతి ముఖం గలవారికి కనుబొమ్మలు కాస్త మందంగా ఉండి కిందకి వంపు తిరిగి ఉండాలి.
- కనుబొమ్మలు మొత్తం తీసివేసి ఐబ్రోపెన్సిల్‌తో గీసుకునే దానికన్నా వాటిని షేప్ చేసుకుంటే మంచిది.
- పెద్దదిగా ముక్కు ఉన్న వారు కనుబొమ్మల మధ్య దూరం తక్కువగా ఉండేటట్లు తీర్చిదిద్దుకోవాలి.
- కనుబొమ్మల్ని తీర్చిదిద్దుకోవటంలో శ్రద్ధ, ఓపిక కనబరిస్తే మీరు అందంగా కనపడగలరు.
- గుండ్రటి ముఖం ఉన్న వారికి కనుబొమ్మలు వంపు తిరిగి సన్నగా ఉంటేనే మంచిది.
- ముఖం చదరంగా ఉంటే కనుబొమ్మలు పొడవుగా, చివర్లు కొనదేలి ఉంటే బాగుంటుంది.
Wednesday, 28 March 2012
Coconut Tips
- జుట్టు పొడిబారి ఎండు గడ్డిలా కనిపిస్తున్న ప్పుడు.. కప్పు కొబ్బరిపాలల్లో నాలుగు చెం చాల తేనె, ఒకటి లేదా రెండు కోడిగుడ్ల తెల్ల సొన చేర్చి బాగా కలిపి తలంతా పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా తయారవుతుంది.
- అప్పటికప్పుడు చర్మానికి మెరుపు రావాలం టే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖ మంతా మౄఎదువుగా మర్దన చేసి కాసేప య్యాక కడిగేయండి.
- శరీరం కోమలంగా తయారై.. ప్రకాశవం తంగా కనిపించాలంటే.. స్నానానికి అర గంట ముందు.. కొబ్బరిపాలతో బాగా మర్దన చేసుకుని సోయాపిండిలో కొద్దిగా బత్తాయిరసం కలిపి నలుగులా పెట్టుకోవాలి.
- బయటినుంచి వచ్చాక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరినీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరి నీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది.
Tuesday, 27 March 2012
Masala Puri
తెల్ల నువ్వులు : అరకప్పు అల్లం : 50 గ్రా పచ్చిమిర్చి : పన్నెండు డాల్డా : కప్పు నూనె : వేయించడానికి సరిపడా జీలకర్ర : ఐదు చెంచాలు ఉప్పు : రెండు చెంచాలు సోయా పిండి : పావు కప్పు మొక్కజోన్న పిండి : పావు కప్పు ఎండు కొబ్బరి తురుము: ఐదు చెంచాల చొప్పున మైదా : 250 గ్రా ఆకుపచ్చ రంగు : అరచెంచా
ఇలా చేయాలి
డాల్డాను కరిగంచి పెట్టుకోవాలి, వెడల్పాటి పాత్రలో మైదా, మొక్కజొన్న పిండి, సోయా, ఎండు కొబ్బరి తురు ము తీసుకుని డాల్డా వూసి బాగా కలపాతి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ముద్ద, రంగు చేర్చి..నీటితో గట్టిగా చపాతీ పిండిలా చేసుకునిన బాగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి.. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని నువ్వులు ముంచి పూరిల్లా వత్తుకోవాలి.ఫోర్కుతో మధ్య మధ్య గాట్లు పెట్టి నూనెలో వేయిస్తే చాలు. మసాలా పూరీలు రెడీ. ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి.
Cauliflower cooked after White
కాలిఫ్లవర్ ఉడికించే టప్పుడు కొంచెం పాలు పోస్తే దింపిన తర్వాత తెల్లగా కనిపిస్తుంది.
Monday, 26 March 2012
Ginger biskits
కావాల్సినవి :
డాల్డా లేదా బటర్ : ఆరకేజి
పంచదార : 150 గ్రాములు
కోర్స్‌లీ గ్రాండ్ పంచదార : 50గ్రా
గుడ్డులోని పచ్చసోన : రెండు
అల్లం జ్యూస్
(నీళ్ళు కలవకుండా) : రెండు చెంచాలు
మైదా పిండి : అరకేజి
అల్లం పౌడర్
(ఎండబెట్టి పొడి చేసుకోవాలి) : ఒక చెంచ
ఉప్పు : తగినంత
కాజూ ముక్కలు : 100 గ్రా
వెనీలా ఎసెన్స్ : 1/4 చెంచా ( చెంచాలో నాలుగవ వంతు)
తయారి విధానం
ముందుగా ఒక ప్యాన్‌లో 150 గ్రాముల పంచదార పాకం వచ్చేంత వరకు వేడిచేయండి. పంచదార ద్రవంలా మారి ఎరుపురంగువచ్చాక దాన్ని ఒక పాత్రలో వేసి చల్లార నివ్వండి. కొంత సమయం తరువాత
పాత్రనుంచి ఈ మిశ్రమాన్ని తీసి గ్రైండ్ చేయండి.ఇప్పుడు మిగితా మిశ్రమాలను
బటర్ లేదా డాల్డాలో వేసి కలపండి. కొంత సమయం తరువాత ఇందులో పంచదార
మిశ్రమాన్ని (గ్రైండ్ చేశాం కదా..దాన్ని) వేసి మళ్ళీ కలపండి. పచ్చసోనాను,
అల్లం రసాన్ని కలిపి కలపండి. ఇక మైదాపిండి, కాజూ ముక్కలను, వెనీలా ఎసెన్స్‌ను
వేసి కలపడమే మిగిలింది. ఈ మిశ్రమాన్ని చిన్న సెగపై కొంత సమయం ఉంచండి. కొంత
సమయం తరువాత తీసేసి..మీకు నచ్చిన ఆకారంలో కట్‌చేయండి. కట్ చేసిన ముక్కలను
300 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో 20 నిముషాలు ఉంచి తీసేయండి.
Avoid the smell of sweat in the summer ....
ఉదయం పూట రెండు స్పూన్ ల నిమ్మ రసాన్ని బకెట్ నీటిలో కలిపి స్నానం చేస్తే వేసవిలో చెమట వాసన రాదు.
Sunday, 25 March 2012
Coriander Rice

కావలసినవి:
బియ్యం - పావు కేజీ, ఏలకులు - 2, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - రెండు కప్పులు, బాదం పప్పు - 10, జీడిపప్పులు - 10, కిస్‌మిస్ - 10, ఉప్పు - తగినంత, నూనె - చిన్న గిన్నెడు, నెయ్యి - రెండు టీ స్పూన్లు
తయారి:
బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కొలత బియ్యానికి ఒకటిన్న నీరు పోసి అన్నం వండి పక్కన ఉంచాలి. కొత్తిమీర ఆకులను తుంపి శుభ్రంగా కడిగి నీరు లేకుండా చూసిపక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక అందులో ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరవాత కొత్తిమీర ఆకులు వేసి పచ్చివాసన పోయేలా వేయించి దింపేయాలి. మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో బాదంపప్పు, జీడిపప్పు, కిసిమిస్‌లను వేసి దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో అన్నం వేసి పొడి పొడిలాడేలా చేయాలి. అందులో వేయించి ఉంచుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌లు వేసి కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి. దీనికి పెరుగుచట్నీ కాంబినేషన్ బావుంటుంది.
Fry the vegetables to be as good taste ....
వేపుడు కూరలు దించే ముందు కొంచెం శనగ పిండి పైన చల్లి కలిపి దించితే మంచి రుచి గా ఉంటాయి.
Saturday, 24 March 2012
Coriander chutney
కావలసినవి:
కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆవాలు -రెండు టీ స్పూన్లు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - 100 గ్రా., ఇంగువ - టీ స్పూను, బెల్లం -50 గ్రా.
తయారి:
కొత్తిమీరను కడిగి, తరిగి, పూర్తిగా ఆరనివ్వాలి. చింతపండులో కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి ఉడకనివ్వాలి. బాగా ఉడికి, చిక్కబడిన తరవాత దించి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ వేసి, కాగిన తరవాత ఆ నూనె తీసి వేరే పాత్రలో పోసి పక్కన ఉంచాలి. తరవాత అదే బాణలిలో మరి కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర వేయించి, మరో గిన్నెలోకి తీసి ఉంచాలి. ఎండుమిర్చి కూడా వేయించి, పక్కన ఉంచాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో కొత్తిమీర పచ్చివాసన పోయేలా వేయించి దించేయాలి. మిక్సీలో ముందుగా ఎండుమిర్చి మెత్తగా గ్రైండ్ చేసి, తరవాత చింతపండు గుజ్జు, కొత్తిమీర, ఉప్పు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసేయాలి. దీనిలో వేయించిన పోపు, ఇంగువ కాచిన నూనె పోసి కలపాలి. ఇది నెలరోజుల వరకు నిల్వ ఉంటుంది.
Some tips coriander
కొత్తిమీరను పచ్చళ్లలోనూ, సాస్‌లలోనూ, కూరల్లోనూ, సూపుల్లోనూ వాడుతున్నారంటే ఆహారపదార్థాలలో ఔషధాన్ని కలుపుతున్నట్టే.
వేరుతో ఉన్న కొత్తిమీరను కొనుగోలు చేయాలి. మస్లిన్ క్లాత్ బ్యాగ్‌లో కొత్తిమీరను చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
వెల్లుల్లి, ఉల్లి, కొన్ని చుక్కల నిమ్మరసం, పుదీనా, బెల్లం, పసుపు, ఉసిరి, ఎండు మామిడిపొడి, కొత్తిమీర కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఆహారంతో పాటుగా కొద్దిగా తీసుకోవాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది.
కొత్తిమీర ఆకులు, గులాబీ నీళ్లతో కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటే తీవ్రత పెరిగిన దగ్గు తక్కువవుతుంది.
కొత్తిమీర ఆకులను నుదుటి మీద పెట్టుకొని పడుకుంటే త్వరగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్య బాధించదు.

Friday, 23 March 2012
Urad Gare
కావలసిన పదార్ధాలు :
మినప పప్పు : 1/2kg
పచ్చిమిర్చి: 2
అల్లం: కొద్దిగా
మిరియాలు: 1tsp
ఉల్లిపాయలు: 4-5
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: వేయించడానికి సరిపడా
వంటసోడ : చిటికెడు
తయారు చేయు విధానం :
1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి.
3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి.
4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ .

Thursday, 22 March 2012
Ugadi chutney
కావలసిన పదార్థాలు:
తగినన్ని మామిడి ముక్కలు
వేప పువ్వులు: 3tbsp
కొత్త చింతపండు: 50grm
బెల్లం తురుము: 1/2cup
కారం: 1tsp
ఉప్పు: తగినంత
అరటిపండు ముక్కలు: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆతర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి.
2. చింతపండు పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేపపువ్వులు, కారం, ఉప్పు కలపాలి.
3. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి రెడి.

Wednesday, 21 March 2012
Mysore bajji
కావాల్సిన పదార్థాలు:
మైదా : 2cups
గోధుమ పిండి : 150grm
బొంబాయి రవ్వ: 150grm
ఉప్పు :రుచికి సరిపడా
మజ్జిగ : ఒక కప్పు
నూనె : వేయించడానికి సరిపడా
జీలకర్ర: 1tsp
అల్లం: చిన్నముక్క
బేకింగ్ పౌడర్ : 1tsp
వంట సోడా : చిటికెడు
ఉల్లిపాయలు : 2(చిన్నగా కట్ చేసినవి)
పచ్చి మిర్చి: 10
తయారు చేయు విధానం:
1. ముందుగా మూడు రకాల పిండులను మజ్జిగ తో కలిపి ఇరవై నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి..ఇది మరీ పలుచన కాకుండా సరిపడా గట్టిగా కలుపుకోవాలి.
2. బజ్జీలను వేసే ముందు ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బాగా కాగి వున్న నూనె లో వేసి వేగనివ్వాలి. అంతే వేడి వేడి మైసూరు బజ్జీ రెడీ.
skin Tips
1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి.
2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి.
3. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్‌క్రీమ్ లోషన్ ముఖానికి రాసుకోవాలి.
4. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని ఆ తరువాత చన్నీళ్ళతో స్నానం చేయాలి.
5. కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి పేస్ట్‌గా తయారు చేసి, దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
6. పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే, ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Tuesday, 20 March 2012
Walnuts Cookies
కావలసినవి
ఆలీవ్ ఆయిల్ 50 ఎం.ఎల్
తేనే 50 ఎం.ఎల్
గుడ్లు ఒకటి
పిండి 50 గ్రా.
కార్న్ ఫ్లేక్ 50 గ్రా.
ఓట్స్ 50 గ్రా.
వాల్‌నట్స్ 50 గ్రా.
ఇలా చేయాలి
1. ముందుగా ఒక బౌల్‌లో ఆలీవ్ ఆయిల్,గుడ్డు, తేనెను వేసి బాగా కలపండి.
2. ఈ మిశ్రమంలో పిండిని, ఓట్స్, కార్న్ ఫ్లేక్, వాల్‌నట్స్‌ను కలపండి.
3. ఒకసారి ఈ మిశ్రమం సిద్ధమయ్యాక గుండ్రంగా కట్ చేయండి.
4. ఈ పీసెస్‌ను ఒక కుకీస్ ఆకారంలో కట్‌చేశాక వాటిని ప్రెస్ చేయండి (స్మూత్‌గా)
5. మైక్రోవేవ్ ఒవెన్‌లో 180 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో 15 నిముషాలు ఉంచండి.
6. ఓబెన్ నుంచి బయటికి తీసి చల్లారే దాకా ఆగండి. తరువాత కుకీస్‌తో పండగా చేసుకొండి.
Some of the care to be beautiful eyes
- ఒక బంగాళదుంపపై పొరను తీసివేసి దాంతో మీ కళ్ల చుట్టు ఉన్న చర్మంపై మృధువుగా రుద్దండి.ఇలా ఒక వారం చేయండి. తర్వాత మార్పును మీరే గమనిస్తారు.
- దీంతో పాటు సమయానికి నిద్దుర పోవాలి . కనీసం ఎనిమిది గంటలైన కునుకు తీయాలి.
- చల్లని పాలలో దూదిని తడిపి దాన్ని కళ్లపై ఉంచండి. 15 నిముషాల వరకు అది మీ కళ్లపై ఉన్న విషయాన్ని మర్చిపొండి.అలాగని తీసేయడం మాత్రం మర్చిపోకండి. 15 నిముషాల తరువాత తీసేసి ముహాన్ని కడగండి.
- స్నానం తరువాత చల్లని నీటిలో కళ్లని ముంచండి. చల్లదనాన్ని కళ్లకు అందించండి. మీ కళ్లు చాలా అందంగా మారుతాయి.
- ఒక టీ స్పూన్ టమాటో గుజ్జును, చిటికెడు పసుపు పొడి, అర టీస్పూన్ నిమ్మరసం, ఒ క టీస్పూన్ శనగ పిండిని తీసుకొని మెత్తని ఒక మిశ్రమాన్ని తయారు చేయండి.మీ కనురెప్పలపై అప్లై చేయండి. ఇది తప్పకుండా మాయ చేస్తుంది.
- రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు ముఖాన్ని కడగండి.
- అలీవ్ నూనె, పసుపు పొడిని కలిపి ముద్దగా చేసుకొన్ని కళ్లకింది నల్లని చారలపై అప్లై చేయండి.
- విటమిన్ ‘ఈ’ నూనెతో కళ్లకింది చారలపై మెల్లగా మసాజ్ చేయండి.
- రోజ్ వాటర్‌తో మీ కంటిని రోజు నిద్రపోయే ముందు శుభ్రం చేయండి.
- కీరా ముక్కలను మీ కనురెప్పలపై ఉంచి రిలాక్స్‌గా కలల లోకంలో విహారించండి.
Monday, 19 March 2012
Remove saris oil stains....
చీరలపై నూనె మరకలు పోవాలంటే టాల్కంపౌడర్ చల్లి మడత పెట్టండి. వారం తర్వాత పౌదరు దులిపివేయండి.
Bread Puri

కావలసినవి:
గోధుమ పిండి - కప్పు
బ్రెడ్ స్లైస్‌లు - 4
జీలకర్రపొడి - అర టీ స్పూన్
పంచదార - టీ స్పూన్
కారం - టీ స్పూన్
ధనియాల పొడి - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
వాము పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి తగినంత
తయారి:
గిన్నెలో గోధుమ పిండి, పంచదార, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, ధనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. మరొక గిన్నెలో బ్రెడ్ స్లైస్‌లను చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పాలు, వాము వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని గోధుమ పిండిలో కలిపి, కొన్ని నీళ్లతో ముద్ద చేయాలి.
చిన్న చిన్న పిండి ఉండలు చేసుకొని, పూరీని వత్తి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా కాల్చాలి. ఈ పూరీలను గ్రేవీతో లేదా ఛోలేతో సర్వ్ చేయాలి.
Sunday, 18 March 2012
Veg Sandwich

కావలసినవి:
బ్రెడ్ స్లైస్‌లు - 2, లెట్యూస్ - 2 ఆకులు, కీరా - 2 ముక్కలు (గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేయాలి), ఉల్లిపాయ - (గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేయాలి) 2 ముక్కలు, టొమాటో - గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేసిన 2 ముక్కలు, ఛీస్ స్లైస్ - 1, ఉప్పు - చిటికెడు, పసుపు - చిటికెడు, మిరియాలపొడి - చిటికెడు, ఫ్రెంచ్ ఫ్రైస్ - 5 (బేకరీలలో లభిస్తాయి), పుదీనా చట్నీ - పావు టీ స్పూన్, కొలెస్లా సలాడ్ (ఉడికించిన క్యాబేజీ, బంగాళదుంప, క్యారెట్ కలిపి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లినది) - అర టీ స్పూన్
తయారి:
ముందుగా కూరగాయలను శుభ్రపరుచుకొని కావలసిన విధంగా కట్ చేసుకోవాలి. త్రికోణాకారంలో కట్ చేసుకున్న రెండు బ్రెడ్ స్లైస్‌లను తీసుకోవాలి. ఓవెన్‌లో గ్రిల్ చేయాలి. బయటకు తీసిన బ్రెడ్ స్లైసులకు పుదీనా చట్నీ రాయాలి. ఒక బ్రెడ్ మీద లెట్యూస్, టొమాటో, కీరా, ఉల్లిపాయ, ఛీజ్ స్లైస్‌లను... ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. ఉప్పు, మిరియాల పొడి చల్లి, మరొక బ్రెడ్ స్లైస్‌ను దీనిపైన అమర్చాలి. దీనిని ఫ్రెంచ్ ఫ్రైస్‌తో సర్వ్ చేయాలి.
(శాండ్‌విచ్‌ను గ్రిల్ చేయకుండా సాదాగా కూడా తయారుచేసుకోవచ్చు.)
Bread Tips
- హోల్ వీట్ లేదా హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్‌నే ఎంపిక చేసుకోవాలి.
- బ్రెడ్ ప్యాకెట్ మీద ఉన్న తయారీ తేదీని పరిశీలించి తీసుకోవాలి.
- బ్రెడ్‌ను కాసేపు పెనం మీద వేడి చేసి, తీసి కాసేపటి తర్వాత మరోసారి వేయించితే కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది.
- బ్రెడ్ రుచిగా ఉండాలంటే పాలతో తుడిచి, పెనం మీద వేసి, వేడి చేసి, తీయాలి.
- బ్రెడ్ నిల్వ వాసన వస్తుంటే బ్రెడ్‌పీసుల మీద కొద్దిగా నీళ్లు చల్లి, అల్యూమీనియం ఫాయిల్లో చుట్టి, పదినిమిషాలు ఓవెన్లో వేడి చేస్తే తాజాగా ఉండటంతో పాటు నిల్వవాసన ఉండదు.
- మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను ఎండబెట్టి, పొడి చేసుకుంటే గ్రేవీలు, కూరల్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. వంటకాల తయారీలో బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి వాడాలి.
- పసుపు, పచ్చ రంగు బ్రెడ్ మీద కనిపించినప్పుడు ఫంగస్ చేరినట్టుగా గ్రహించి, పడేయం మంచిది.
- బ్రెడ్‌ను పెనం మీద రోస్ట్ చేసి, వాడటం వల్ల బాక్టీరియా నశిస్తుంది. ఆరోగ్యకరం కూడా.
- ఫ్రిజ్
దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్‌ను అందులో ఉంచాలి.
బ్రెడ్‌స్లైస్ చెడువాసనను పీల్చుకొని దుర్వాసనను దూరం చేస్తుంది.
Saturday, 17 March 2012
Remove ink stains....
దుస్తులమీద సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు.
Bundi Raita

కావలసిన పదార్ధాలు:
బూందీ: 100grm
పెరుగు: 2cups
పచ్చిమిర్చి:2
ఉప్పు: రుచికి తగినంత
వేయించిన జీలకర్ర పొడి: 1/2tsp
కొత్తిమీర తరిగినది: 2tbsp
కారం: 1/2tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా బూందీని నీళ్ళల్లో వేసి 2నిమిషాలు తర్వాత ఒకప్లేట్ లోనికి తీసుకోవాలి. పెరుగును చిక్కగా చిలుక్కోవాలి. దానిలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర ఆకులలో సగం వేయాలి.
2. తర్వాత అందులో బూందీ వేసి గరిటతో బాగా కలపాలి. తర్వాత మిగిలిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు, కారం వేసి సర్వ్ చేయడమే. దీనిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది.
Friday, 16 March 2012
Remove Tea Stains......
దుస్తుల మీద పడిన టీ మరకలు పోవాలంటే ఓ టమాటా ముక్క ను మరక మీద రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మరకపోతుంది.
Face Masks
బంగాళదుంప మాస్క్
పొడిచర్మానికి చక్కటి మాస్క్
బంగాళదుంప గుజ్జు 1 చెంచా
పెరుగు 1/2 చెంచా
బంగాళదుంప గుజ్జు, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంటసేపు ఉంచి తర్వాత కడగాలి.కేరట్ మాస్క్
సగము క్యారట్ తరిగి, రసంతీసి పావు చెంచా తేనెలో కలిపి ముఖానికి రాసుకొని పావుగంట తరువాత కడిగేసుకోవాలి.
ఇది సున్నిత చర్మం గల వారికి ప్రయోజనకరం. ఈ మాస్క్‌వలన ఎ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.

Thursday, 15 March 2012
Chukkakura Alu Curry
ఇవి కావాలి
బంగాలళ దుంపలు : 250 గ్రా చుక్కకూర : 4 ట్టలు పెద్దవి పచ్చి మిర్చి : 8 కాయలు కారం : 1/2 చెంచా ఉల్లిపాయ ముక్కలు : 1 కప్పు ధనియాల పొడి : 1 చెంచా ఎండుమిర్చి : రెండు ఉప్పు పసుపు నూనె : కావాల్సినంత కరివేపాకు : రెండు రెబ్బలు
ఇలా చేయాలి
దుంపలు శుభ్రంగా కడిగి చెక్కుతీసి సన్నగా తరగాలి. చుక్కకూర కూడా కడిగి
సన్నగా తరిగి ఉంచాలి. బాండీ లో కొంచెం నూనెలో బంగాళదుంపలను ముప్పావు వంతు
వేపి తీయాలి. బాండీలో మిగిలిన నూనె కాగిన తర్వాత పోపుసామాను వేసి వేగిన
తర్వాత మిర్చి ఉల్లి ముక్కలు వేసి వేపి ఆలూ ముక్కలు కూడా వేసి ఉడకని
వ్వాలి. ఉడికిన తర్వాత చుక్కకూర కూడా వేసి ఉప్పు, పసుపు, కారం,ధనియాల పొడి
వేసి మూతపెట్టి సన్నని సెగమీద ఉడికించాలి. ఉడికిన తర్వాత బాగా కలిపి దింపి
చపాతీలోకిగాని అన్నంలోకి గాని సర్వ్ చెయ్యాలి.Remove Luipstik Stains............
జేబు రుమాళ్ళపైన, టవల్స్ మీద పడే లిప్‌స్టిక్ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్ రాసి కొంతసేపు తర్వాత సబ్బుతో ఉతకాలి.
Wednesday, 14 March 2012
Remove Mehandi Stains...........
బట్టలకంటిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో
నానెయ్యా లి. తర్వాత శుభ్రత అదే వస్తుంది. లేక నిమ్మకాయ ముక్కతో
రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి.
Papaya Curry

ఇవి కావాలి...
పచ్చి బొప్పాయి : 1 పచ్చిమిర్చి : 2 ఉల్లిపాయలు : 1 అల్లం : చిన్న ముక్క నూనె : 3 స్పూన్లు ఉప్పు, కారం : తగినంత పాలు : 1/4 కప్పు
ఇలా చేయాలి...
బొప్పాయికాయ శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలు కోసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి ఉడకబెట్టి వార్చుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. బాణాలిలో నూనె పోసి కాగాక తాలింపు వేసి వేగాక ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేపిన తర్వాత ఉడకబెట్టిన బొప్పాయి ముక్కలు, ఉప్పు వేసి బాగా వేగిన తరువాత పాలు పోయాలి. పాలు ఇగిరిపోయిన తరువాత దించాలి. ఇది వేడివేడిగా సర్వ్ చేయాలి.
Tuesday, 13 March 2012
Kashmiri Non
కావలసిన పదార్థాలు:
మైదా : 1/2kg
పాలు : 1cup
జామ్ : తగినంత
పంచదార : 1tsp
ఉప్పు : రుచికి తగినంత
బటర్ : తగినంత
పనీర్ తురుము : 1/2tsp
పండ్లముక్కలు : 1cup(పైనాపిల్, అరటిపండు, బొప్పాయి, ఆపిల్)
గార్నిషింగ్ కోసం: జీడిపప్పు, ద్రాక్ష, చెర్రీ, కొత్తిమీర
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్‌లో మైదా, పాలు, పంచదార, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి పావుగంటసేపు నాననివ్వాలి.
2. తరవాత ఉండలు చేసి నచ్చిన ఆకారంలో నాన్ ని ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి.
3. స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి నాన్ ని పచ్చిపచ్చిగా కాల్చి తీసేయాలి. దానికి ఒకవైపు జామ్ పూసి, దాని మీద పండ్లముక్కలు గట్టిగా అదిమి, మరోమారు పెనం మీద బటర్ వేసి రెండువైపులా కాల్చాలి.
4. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, చెర్రీ, కొత్తిమీర, పనీర్ తురుములతో గార్నిష్ చేయాలి. కాశ్మీర్ నాన్ రెడీ.

If the mosquitoes are more likely to suffer at home ....
- ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.
- పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.
- ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో అరడజను కర్పూరం బిళ్ళలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పోతాయి.
Monday, 12 March 2012
Cintaciguru dal
కందిపప్పు : పావు కిలో
ఇలా చేయాలి
కందిపప్పు కడిగి తగినన్ని నీరు పోయాలి. దాంట్లో పుల్లలు తీసి శుభ్రం చేసిన చింతచిగురు, ఉల్లిపాయ ముక్కలు, టమాట, పచ్చిమిర్చి ముక్కలు వేసి కుక్కర్‌లో ఉడికించి దించాలి. నాలుగు విజిల్స్ వచ్చాక దించాలి. తర్వాత బాండీలో 2 గరిటెల నూనె వేసి దాంట్లో ఇంగువ, ఎండుమిర్చి, పోపు సామాను వేసి పోపుపెట్టి ఉడికినపప్పు వేసి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఉడుకుతున్నపప్పుడు దింపి సర్వ్ చేయాలి. ఇదే విధంగా చుక్కకూరతో చేయవచ్చు.
చింతచిగురు : పావు కిలో
టమాటాలు : 2 పెద్దవి
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి, ఎండుమిర్చి : 4 కాయలు
పోపు సామాను : తగినంత
ఉప్పు, పసుపు,
కారం, ఇంగువ : సరిపడినంత
ఇలా చేయాలి
కందిపప్పు కడిగి తగినన్ని నీరు పోయాలి. దాంట్లో పుల్లలు తీసి శుభ్రం చేసిన చింతచిగురు, ఉల్లిపాయ ముక్కలు, టమాట, పచ్చిమిర్చి ముక్కలు వేసి కుక్కర్‌లో ఉడికించి దించాలి. నాలుగు విజిల్స్ వచ్చాక దించాలి. తర్వాత బాండీలో 2 గరిటెల నూనె వేసి దాంట్లో ఇంగువ, ఎండుమిర్చి, పోపు సామాను వేసి పోపుపెట్టి ఉడికినపప్పు వేసి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఉడుకుతున్నపప్పుడు దింపి సర్వ్ చేయాలి. ఇదే విధంగా చుక్కకూరతో చేయవచ్చు.
Remove Neck Black....
ఆభరణాలు ధరించడం,నూనె జిడ్డు, కాలుష్యం వల్ల మెడ నలుపుగా మారుతుంది.
పసుపులో నిమ్మరసం కలిపి మెడకు ప్యాక్ వేసి, ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ,
శుభ్రపరుచుకుంటే మెడ నలుపు తగ్గుతుంది.
Sunday, 11 March 2012
Cauliflower Pakora
కావలసిన పదార్థాలు:
కాలీ ఫ్లవర్: చిన్న పువ్వు
శనగపిండి: 3cups
బియ్యం: 2tbsp
నూనె : వేయించడానికి సరిపడా
పసుపు: చిటికెడు
ఉప్ప: రుచికి తగినంత
కారం: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
తయారు చేసే పద్ధతి:
1. కాలీఫ్లవర్ ను పువ్వులుగా విడగొట్టాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అవి కొంచెం మెత్తగా అయ్యాక దించాలి.
2. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి వేసి జారుగా కలిపి, అందులో ఉడికించిన కాలీ ఫ్లవర్ ను వేసి నూనెలో వేయించాలి. ఇవి ఎర్రగా వేగాక తీసి టమోటా సాస్ తో సర్వ్ చేస్తే బాగుంటాయి.

When Kant nalaka .....
కంట్లో నలకపడినప్పుడు కంటిని నలుపుతారు. అలా నలుపకూడదు. చల్లటి నీటిలో 4 లేదా 5 సార్లు కంటిని శుభ్రంగా కడగాలి. నీరు కంట్లోకి వెళ్ళేలా అరచేతిలో నీరు పోసుకొని తలవంచి ఒకటి రెండు సెకనుల పాటు కంటిని ఉంచితే నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి.
Saturday, 10 March 2012
Stuffed Capsicum
కాప్సికమ్ (సిమ్లా మిర్చి) - 5-6
ఉడకబెట్టిన ఆలూ - 2
ఉడకబెట్టిన పచ్చి బఠాణి-2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పసుపు - 1/4 టీ స్పూను
కారం - తగినంత
గరం మసాలా - 1/4 స్పూను
ఆమ్‌చూర్ - 1/4 టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారు చేసే విధానం:
కాప్సికమ్‌ను శుభ్రంగా కడిగి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత అందులో నీటిని వంచేసి చల్లారనివ్వాలి. ఉడకబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డను చిదమాలి. బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. ఇందులో మసాలా దినుసులు, ఆలుగడ్డ చిదుము, బఠాణీలు వేసి కొద్ది నిమిషాలు వేయించాలి. చాకుతో కాప్సికమ్ తొడిమను, లోపల ఉన్న గింజలను తొలిగించాలి. తర్వాత చేసి వేయించిన స్టఫిం గ్‌ను అందులో జాగ్రత్తగా పెట్టాలి. మరొక బాణలి పొయ్యి మీద పెట్టి తగినంత నూనె పోసి స్టఫ్ చేసుకున్న కాప్సికమ్‌ను అందులో వేసి అన్ని వైపుల నుంచి వేయిం చాలి. వేగిన కాప్సికమ్ మీద పనీర్ తురుము, కొత్తిమీర ఆకులు, గుండ్రంగా తరిగిన టమాటాలతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Know cough ...
అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటికడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
Friday, 9 March 2012
navaratan Kurma
ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - 3 కప్పులు
(ఆలూ, కారెట్, పచ్చి బఠాణీ, బీన్స్, కాలిఫ్లవర్, కాప్సికమ్, కాబేజ్, గోరు చిక్కుడు, సొరకాయ)
పనీర్ - 150 గ్రా. (తురిమినది)
టమాటాలు - 3
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగి)
అల్లం పేస్ట్ - 1 1/2 టీ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
పసుపు - 1 టీ స్పూను
కారం - 1 1/2 టీ స్పూన్లు
ధనియాలపొడి - 1 టీ స్పూను
గరం మసాలా పొడి - 2 టీ స్పూన్లు
మీగడ - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 6 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
పాలు/ నీళ్ళు - 1 కప్పు
డ్రై ఫ్రూట్స్ - 1/4 కప్పు
కొత్తిమీర - అలంకరణకి
తయారు చేసే విధానం:
టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి. తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజు తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు. తర్వాత ఒక స్పూన్ నేతిని బాణలిలో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి. వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిం చాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వా త అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి. గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి. బాణలికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి. తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి. తర్వాత అందులో పనీర్ వేసి గరిటతో తిప్పాలి. చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. సర్వ్ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి అధరవుగా బాగుంటుంది.

Know throat infection....
ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనెఫెక్షన్ తగ్గుతుంది.
Thursday, 8 March 2012
Munakkaya Sweet Curry

కావాల్సిన పదార్థాలు:
ములక్కాయలు: 2పెద్దవి
కొబ్బరి తురుము: 1/2cup
నానబెట్టిన బియ్యం: 4-6tbsp
బెల్లం లేక పంచదార: 50grms (తీపి ఇష్టమున్నవారు మరికాస్త ఎక్కువ వేసుకోవచ్చు)
ఆవాలు, జీలకర్ర, మినపప్పు: 2tbsp
ఎండు మిరపకాయలు: 2-4
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. రెండు గంటల ముందుగా బియ్యం నానబెట్టి, కూర వండే ముందు తురిమిన పచ్చి కొబ్బరి వేసి మెత్తగా, జారుగా గ్రైండ్ చేసుకోవాలి.
2. ములక్కాడ ముక్కలు రెండంగుళాలు చప్పున ముక్కలు తరుక్కుని, చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి.
3. పాన్ లో గ్రైండ్ చేసిన బియ్యం, కొబ్బరి పేస్ట్ కు గ్లాసు నీళ్ళు కలిపి పోసి అడుగంటకుండా ఉడకనివ్వాలి.
4. బియ్యప్పిండి కాస్త ఉడికినట్లు అనిపించాకా అందులో బెల్లం లేదా పంచదార వెయ్యాలి.
5. ఈ మిశ్రమం వండేప్పుడు ఎంత జారుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వండిన కాసేపటికి (బియ్యంతో రుబ్బిన పేస్ట్ వేయటం వలన) గట్టిపడి అంతా గట్టి ముద్దగా అయిపోతుంది.
6. బెల్లం లేదా పంచదార కరిగాకా ఉడికిన ములక్కాడ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు కూడా వేయాలి.
7. మొత్తం అంతా మరో ఐదు నిమిషాలు ఉడికాకా పోపుదినుసులతో విడిగా పోపు పెట్టి, ఉడుకుతున్న ఈ కూరలో కలపాలి. అంతే మునక్కాయ తీపికూర రెడీ.
Know urinary infection Pain.....
గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇనెఫెక్షన్ బాధ నుంచి బయట పడవచ్చు.
Wednesday, 7 March 2012
Kanda soup
కంద : పావు కిలో చింతపండు : 50 గ్రా
పసుపు : చిటికెడు
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 3
నూనె : 50 గ్రా
బెల్లం : 50 గ్రా
ఉప్పు, కారం : తగినంత
ఇలా చేయాలి...
కంద ముక్కను శుభ్రంగా కడిగి, పెచ్చుతీసి ముక్కలుగా తరిగి నీళ్ళు, పసుపు వేసి ఉడికించి, వార్చుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి చీలి కలుగా తరుక్కోవాలి. చింతపండు నీళ్ళలో నాన బెట్టాలి. గిన్నెలో నూనె వేసి కాగాక తాలింపు వేసి ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. తర్వాత కంద ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి ఎర్రగా వేయిం చాలి. ఇప్పుడు చింతపండు పలుసు పిండి పొయ్యాలి. పులుసు మరిగాక బెల్లం వేసి చిక్క బడ్డాక దించాలి. ఈ పులుసు పుల్లపుల్లగా, తియ్య గా ఉంటుంది. మరుసటి రో జు వరకు నిల్వ ఉంటుంది. దీని రుచి ఇంట్లో అందరికీ నచ్చుతుంది.

Tuesday, 6 March 2012
Paneer-onion-color full Kachori

కావల్సిన పదార్థాలు:
మైదా: 1/2kg
పనీర్ తురుము: 1cup
ఉల్లిపాయలు: 3(సన్నగా తరగినవి)
వాము: 1tsp
నెయ్యి: 1/2cup
జీలకర్ర: 1tsp
ఇంగువ: 1/2tsp
కొత్తిమీర తురుము: అరకప్పు,
వెల్లుల్లి రెబ్బలు: 8-10(చితగొట్టాలి)
పచ్చిమిర్చి: 2-4(సన్నగా తరగినవి)
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మైదాను ఒక గిన్నెలోకి తీసుకుని టేబుల్ స్పూను నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి.. నీటితో పిండిలా కలిపి ఇరవైనిమిషాలు నాననివ్వాలి.
2. పాన్ లో చెంచా నెయ్యి కరిగించి వాము, జీలకర్ర, ఇంగువ వేయించి ఆ తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పలుకులు చేర్చాలి. ఉల్లిపాయముక్కలు బాగా వేగాక.. తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
3. ఇప్పుడు మైదాను ఉండల్లా చేయాలి. ఒక ఉండను తీసుకుని పూరీలా వత్తి మధ్యలో కొద్దిగా పనీర్ తురుము, ఉల్లిపాయ మిశ్రమం వేసుకుని గుండ్రంగా వచ్చేలా చుట్టూ మూసేయాలి.
4. తర్వాత ఫోర్కుతో అక్కడక్కడా రంథ్రాల్లా పెట్టి కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. ఇలా మిగతా పిండినీ చేసుకోవాలి. వేడివేడిగా పెరుగుచట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
Monday, 5 March 2012
Milk Chocolate

ఇవి కావాలి...
పాలు : ఒక లీటరు
పంచదార : 350 గ్రాములు
కోకో పౌడర్ : 25 గ్రాములు
రిఫైన్డ్ పిండి : 15 గ్రాములు
యాలకులు : ఐదు
నెయ్యి : ఒక టేబుల్ స్పూన్
ఇలా చేయాలి...
ముందుగా యాలకులపై పొరను తీసేసి అందులోని విత్తనాలను పొడి చేయండి. ఒపాలను మరిగించండి. పాలలో సగం మిగిలే వరకు మరిగించాలి. తరువాత పాలలో పంచదారను, కోకో పొడిని, పిండిని వేసి మెల్లిగా కలిపి.. బుడగలు వచ్చేంత వరకు వేచి చూడండి. తరువాత అందులో కొంత నెయ్యిని వేసి కలపండి. కొంత వేడయ్యాక అప్పుడు మొత్తం నెయ్యిని కలపండి. కొంత సేపు తరువాత మంటను ఆపేయండి.యాలకుల పొడిని దానిపై చల్లి .. ఒక బౌల్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి. గట్టిడ్డాక మీకు నచ్చిన ఆకృతిలో కట్ చేసుకొండి. చిల్డ్ మిల్క్ చాకోలెట్ రెడీ.
Avoid cockroaches ......
వెల్లుల్లి పాయాలను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.
Sunday, 4 March 2012
Saturday, 3 March 2012
Egg Biryani
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 2ఉడికించిన కోడిగుడ్లు: 8
నూనె: 1/2
నీళ్లు: 3
ఉల్లిపాయలు: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
పలావ్ ఆకులు: ౨
దాల్చిన చెక్క: చిన్నది
యాలకులు: 4
పసుపు: 1/2tsp
కారం: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
కొత్తిమీర తురుము: 1/2cup
ఉప్పు: తగినంత
తయారు చేయు విధానం:
1. మొదటగా నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 2. రెండు నిమిషాల తర్వాత పలావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.
3. తర్వాత కోడి గుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారాక బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు వేయించాక నీళ్లు పోయాలి. అందులోనే ఉప్పు, గరం మసాలా పొడి చల్లి మూత పెట్టాలి.
4. మీడియం మంట మీద ఉడికించి నీరంతా ఇమిరిపోయాక, పొడిపొడిగా అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లుకుని దించేసుకోవాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ.
Sweet Roll Kaja

కావలసిన పదార్థాలు:
మైదా: 1/2kg
నెయ్యి: 50grm
ఉప్పు: చిటికెడు: చిటికెడు
వేరుసెనగపప్పు: 1cup
యాలకుల పొడి: 1tsp
శెనగపప్పు(పుట్నాలపప్పు): 1cup
జీడిపప్పు: 1cup
పంచదార: 1/2kg
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. మొదటగా పల్లీలు వేయించి పొట్టు తీసి పొడి చేయాలి. జీడిపప్పు కూడా విడిగా వేయించి పొడి చేయాలి. అలాగే పుట్నాల పప్పుని కూడా పొడి చేసి ఉంచాలి.
2. తర్వాత ఓ గిన్నెలో మైదా వేయాలి. అందులోనే కరిగించిన నెయ్యి, ఉప్పు వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి అరగంట పక్కన ఉంచాలి.
3. ఓ గిన్నెలో పల్లీల పొడి, పుట్నాలపొడి జీడిపప్పుపొడి, యాలకుల పొడి వేసి కలపాలి.
4. తర్వాత ఓ మందపాటి గిన్నెలో పంచదార వేసి అరకప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకూ మరిగించి దించేయాలి. ఇందులో కూడా కొద్దిగా యాలకులపొడి వేసి మూత పెట్టాలి.
5. మైదా పిండిని బాగా మర్థన చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సన్నగా పొడవుగా చాపలా వత్తాలి. ఇప్పుడు అందులో పల్లీలపొడి మిశ్రమాన్ని ఉంచి చాపలా చుట్టాలి.
6. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి కాగకా ఈ మైదా రోల్స్ ను దోరగా వేయించి తీసి పాకంలో వేయాలి. వీటిని సుమారు పావుగంట సేపు పాకంలోనే ఉంచి తీసి వడ్డించాలి. అంతే స్వీట్ రోల్ కాజా రెడీ....
Avoid the smell of cabbage Boiled..............
క్యాబేజ్ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి.
Friday, 2 March 2012
Corn Alu cutlet
కావలసినవి
స్వీట్‌కార్న్ - 1 కప్పు
ఆలు -3
ఉల్లిపాయ -1 చిన్నది
పచ్చిమిర్చి -4
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - 1/4 కప్పు
చేయండి ఇలా
ఆలు ఉడికించి చెక్కు తీసి పొడిపొడిగా మెదిపి ఉంచుకోవాలి. కార్న్, పచ్చిమిర్చి కలిపి బరకగా గ్రైండ్ చేసుకుని బంగాళా దుంపలో కలపాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలియబెట్టి చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని కాస్త వెడల్పుగా చేసుకోవాలి. పెనం వేడి చేసి కొద్దిగా నూనె వేసుకుంటూ ఈ కట్లెట్లను రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని టమాటా సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి. చాలా త్వరగా తయారుచేసుకునే అల్పాహారం ఇది.
Thursday, 1 March 2012
To be red with black lips .....
పెదవులు నల్లగా ఉన్నవారు వాటికి నిమ్మ రసం లేదా గ్లిసరిన్ రాస్తే పెదవులు ఎర్రగా మారతాయి.
Subscribe to:
Posts (Atom)