Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Wednesday, 7 January 2015

లేత గోరింటాకు, ఉసిరికాయలతో కేశ సౌందర్యం

కేశాలకు గోరింటాకులో పాలు, ఉసిరికాయలను కలిపి గ్రైండ్‌చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎండిన ఉసిరికాయలను వాడేటప్పుడు వాటిని రెండు గంటల సేపు పాలలో నానబెట్టాలి.

జుట్టు రాలడాన్ని నివారించడంలో టీ ఆకులు బాగా పనిచేస్తాయి. టీ ఆకులను కాని పౌడర్‌ను కాని నీటిలో వేసి మరిగించి దించి కదలకుండా అరగంటసేపు అలాగే ఉంచాలి. ఆ నీటితో తలస్నానం చేయాలి. చివరలో ఈ నిటిలో నిమ్మరసం కలిపి జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి. నిమ్మరసం కలిపిన నీటిని పోశాక జుట్టును మాములు నీటితో కడగకూడదు.

 రెండు కోడిగుడ్ల తెల్లసొనలో రెండు టీస్పూన్ల ఆముదం, ఒక టీ స్పూన్‌ గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల మొదలు నుంచి జుట్టుకంతా పట్టించి, 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ముందురోజు రాత్రి ఒక కప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు నాలుగయిదు మందార ఆకులను జతచేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తల స్నానం చేస్తే పట్టులా మెరుస్తుంది.

No comments:

Post a Comment