Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Saturday 24 January 2015

ఉలవ గుగ్గిళ్ల్లు ఎందుకు తినాలంటే..?

వారానికి ఒకసారైనా మీ మెనూలో ఉలవల్ని ఎందుకు చేర్చాలో చూద్దాం. వంద గ్రాముల పిజ్జా తింటే.. అందులో పన్నెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే వంద గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వులు అస్సలు ఉండవు. వంద గ్రాముల ఉలవగుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు పీచుపదార్థమూ లభిస్తుంది. అదే పిజ్జాలలో అయితే - ఇంతేసి మోతాదులో పోషకవిలువలు శూన్యం. అందుకే ఉలవల విలువను ఆయుర్వేదం ఏనాడో గుర్తించింది. జ్వరం, జలుబు, గ్యాసి్ట్రక్‌, పెప్టిక్‌ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను తగ్గిస్తుంది ఉలవ. మహిళలలో వచ్చే బహిష్టు సమస్యకు చక్కటి పరిష్కారం వీటితో సాధ్యం.


ఇక, కండరాలను పటిష్టంగా ఉంచడంతోపాటు నరాలబలహీనత రానివ్వవు ఉలవలు. వీటిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పలు పద్ధతుల్లో వినియోగిస్తారు. ఉలవచారు, గుగ్గిళ్లు, కూరలు, లడ్డూలు, సూప్‌లు ఇలా ఈ మధ్య కాలంలో అందరినీ వేధించే అధిక బరువు సమస్యకు ఉలవలు భేషైన పరిష్కారం. నాణ్యమైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేగించి.. చల్లారిన తరువాత మెత్తటి పౌడర్‌లా చేయాలి. రోజూ పరకడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఉలవల మీద ఇదివరకే బోలెడన్ని పరిశోధనలు వచ్చాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉన్నట్లు తేలింది.

Wednesday 21 January 2015

ఒబిసిటీకి చెక్ పెట్టాలా?

ఒబిసిటీని దూరం చేసుకోవాలా? అయితే బ్లూబెర్రీస్ తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎరుపు నీల వర్ణంలో ఉన్న ఈ పండులో అనామ్లజనకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. బ్లూ బెర్రీలు రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్‌ వ్యాధి దూరమవుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
అలాగే బ్రొకోలీలో విటమిన్ K, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ అవసరమైన రెండు పోషకాలు ఎముకలు దంతాల బలోపేతం చేయడానికి సహాయం చేస్తాయి. అంతేకాక వివిధ రకాల క్యాన్సర్లను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇంకా స్థూలకాయాన్ని దూరం చేస్తాయి.

Wednesday 7 January 2015

లేత గోరింటాకు, ఉసిరికాయలతో కేశ సౌందర్యం

కేశాలకు గోరింటాకులో పాలు, ఉసిరికాయలను కలిపి గ్రైండ్‌చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎండిన ఉసిరికాయలను వాడేటప్పుడు వాటిని రెండు గంటల సేపు పాలలో నానబెట్టాలి.

జుట్టు రాలడాన్ని నివారించడంలో టీ ఆకులు బాగా పనిచేస్తాయి. టీ ఆకులను కాని పౌడర్‌ను కాని నీటిలో వేసి మరిగించి దించి కదలకుండా అరగంటసేపు అలాగే ఉంచాలి. ఆ నీటితో తలస్నానం చేయాలి. చివరలో ఈ నిటిలో నిమ్మరసం కలిపి జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి. నిమ్మరసం కలిపిన నీటిని పోశాక జుట్టును మాములు నీటితో కడగకూడదు.

 రెండు కోడిగుడ్ల తెల్లసొనలో రెండు టీస్పూన్ల ఆముదం, ఒక టీ స్పూన్‌ గ్లిజరిన్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల మొదలు నుంచి జుట్టుకంతా పట్టించి, 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ముందురోజు రాత్రి ఒక కప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు నాలుగయిదు మందార ఆకులను జతచేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తల స్నానం చేస్తే పట్టులా మెరుస్తుంది.

Wednesday 31 December 2014

నిమ్మ, బత్తాయి తొక్కలను పారేస్తున్నారా? కాస్త ఆగండి.

నిమ్మరసం కానీ, బత్తాయి రసం కానీ తీసిన తర్వాత తొక్కని ఇక నుంచి పారేయకండి. ఎందుకంటే సిట్రస్ జాతి పండ్ల తొక్కలను ఇంట్లో అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.  ఎలాగంటే.. 

*  గోరు వెచ్చని నీటిలో ఎండబెట్టిన నిమ్మకాయ తొక్కను వేసి స్నానం చేయండి. ఇది శరీరాన్ని, వెంట్రుకలనూ తాజాగా ఉంచుతుంది. 
 
* నిమ్మ, కమలా, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ తొక్కలను ఒక చిన్న గిన్నెలో వేసి దాన్నిండా నీటిని పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఫ్రిజ్‌లోని చెడు వాసనలు పోతాయి.
 
* సిట్రస్ జాతి పండ్ల తొక్కలకు కొద్దిగా బ్రౌన్ షుగర్‌ను అద్ది అర చేతులకు మోచేతులకు రుద్దితే మొరటుదనం పోయి కోమలంగా తయారవుతాయి. 
 
* సిట్రస్ ఫ్రూట్స్ పండ్ల తొక్కలను అండర్‌గార్మెంట్స్ ఉన్న సొరుగులో ఉంచితే, బట్టల నుంటి మంచి వాసన వస్తుంది. 
 
* నిమ్మ, నారింజ తొక్కలు నానబెట్టిన నీటితో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన ఉండదు. ఈ తొక్కలను నమిలితే దంతాలకు, చిగుర్లకూ ఎంతో మంచిది.