అందమైన గోళ్ల కోసం మాయిశ్చరైజింగ్ అవసరమని బ్యూటీషన్లు అంటున్నారు. ఆరోగ్యవంతమైన గోళ్లు వేళ్లకు అందాన్ని ఇస్తాయి. అయితే గోళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అవి రకరకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది.
గోర్ల అడుగుభాగం బ్యాక్టీరియా, ఫంగస్ నివాసానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో తేమ ఉండకుండా చూసుకోవాలి. గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు చేతులకు తప్పనిసరిగా గ్లౌస్ చేసుకోవాలి. సబ్బు నీళ్లలో ఎక్కువసేపు నానితే గోర్లు మెత్తబడి విరిగిపోతాయి. పని పూర్తవగానే చేతులతో పాటు గోర్లను తడి లేకుండా ఆరబెట్టాలి.
గోర్లకు ట్రిమ్మింగ్, ఫైలింగ్ తప్పనిసరి. పెరిగిన మూలలో, ముందు భాగంలో కత్తిరించి గుండ్రటి ఆకారం వచ్చేలా షేప్ చేయాలి. తర్వాత గరుకు లేకుండా ఫైల్ చేయాలి. ఇందుకోసం పదునైన మానిక్యూర్ కత్తెర లేదా క్లిప్పర్స్ వాడాలి. స్నానం తర్వాత గోర్లు మెత్తగా ఉంటాయి. కాబట్టి ఈ పనులకు అదే సరైన సమయం.
అలాగే మాయిశ్చరైజర్ ఉపయోగించే ప్రతీసారీ గోర్లను దృష్టిలో పెట్టుకోవాలి. గోరు మూలల్లో, అడుగున చిగుర్రలో మాయిశ్చరైజ్ జరిగేలా మసాజ్ చేయాలి. ఇందుకోసం హ్యాండ్ క్రీమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.
No comments:
Post a Comment