![]() |
కావలసిన పదార్థాలు:
బెంగళూరు టమోటాలు -4, మైదా పిండి - ఒక కప్పు, బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూను, పాలు - ఒక టేబుల్ స్పూను, నెయ్యి - అర కప్పు, పచ్చి కొబ్బరికోరు - ఒక కప్పు, యాలకుల పొడి - కొద్దిగా, పంచదారపొడి - రెండు టేబుల్ స్పూన్లు, కిస్‌మిస్‌లు - పది, బాదం పలుకులు -ఆరు, జీడిపప్పు - ఎనిమిది, చెర్రీలు - పది.తయారుచేయువిధానం:
టమోటాలను వేడి నీళ్లలో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత తొక్క తీసేసి పండుని మిక్సీలో వేసి రుబ్బుకుని గుజ్జుతీసుకోవాలి. ఇందులో మైదాపిండి వేసి బాగా కలపాలి.
పాలు, బేకింగ్ పౌడర్, పంచదార కూడా వేసి పిండిని జారుగా కలపాలి. ఇప్పుడు ఒక నాన్‌స్టిక్ పెనం పొయ్యి మీద పెట్టి గరిటతో పిండిని దోసెల్లా పోయాలి. ఈ పూరీ దాని నెయ్యి వేసి ఒక వైపు కాలాక తిరగేసి మళ్లీ నెయ్యి వేసి కాల్చాలి. ఇలా అన్నీ చేసుకున్నాక ప్లేటులో పెట్టి మడతలు వేయాలి. వీటిపైన పచ్చి కొబ్బరి , కిస్‌మిస్‌లు, జీడిపప్పు, బాదంపప్పు ,చెర్రీ పెడితే చూడడానికి అందంగా ఉంటుంది.

No comments:
Post a Comment