
కావలసిన పదార్థాలు:
బెండకాయలు - పది, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రేకలు - ఐదు, పచ్చిమిరపకాయలు - రెండు, గరం మసాలా - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.తయారుచేయు విధానం:
బెండకాయల్ని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి నిలువుగా గాటు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెండకాయల్లో కూరాలి. స్టౌ మీద మూకుడు పెట్టి సరిపడా నూనె పోసి బెండకాయల్ని వేసి మూత పెట్టి సన్నని సెగపై పది నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మూత తీసి కాయల్ని రెండో వైపుకి తిప్పి మరో ఐదు నిమిషాలు వేగనిచ్చి తీసెయ్యాలి.
No comments:
Post a Comment