Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Thursday, 22 December 2011

Beautiful lips are the precautions to be taken ......


మృదువుగా, అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అయితే పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనందువల్ల అవి తరచు పొడిగా మారుతుంటాయి. పెదాలను నాలుకతో తడిచేసుకోవడం చాలామందిలో మనం గమనిస్తున్నదే. కాని అలా చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. చలికాలంలో చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవడం జరుగుతుంటుంది. పెదాలు చిట్లిపోయి రక్తం కూడా కారుతుంది. పెదాలు చిట్లిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోవడం, వాతావరణ మార్పులు ఇందులో ముఖ్యమైనవి. 
చలికాలంలో పెదాల సంరక్షణకు తీసుకోవలసిన సూచనలు ఇవి:
-పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకోవద్దు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమన ఉంటుంది కాని తడి ఆరిన తర్వాత నొప్పి అధికం అవుతుంది.

-బాగా నీరు తాగాలి. కనీసం రోజుకు పది గ్లాసుల నీరు తాగాలి.

-చవకరకం లిప్‌స్టిక్స్ వాడవద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఇ ఆయింట్‌మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.

-కలబంద రసాన్ని పూయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

-కీరా ముక్కను పెదాలపై రాయడం వల్ల పెదాలు మృదువుగా ఉంటాయి.

-రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలపై పేరుకుని ఉన్న నెయ్యి రాయడం వల్ల ఉదయానికి పెదాలు మృదువుగా, మెరుస్తూ కనపడతాయి.

-ఆలివ్ ఆయిల్‌ను రాయడం వల్ల కూడా పెదాల పగుళ్లు తగ్గుతాయి.

-మార్కెట్లో దొరికే టీ బ్యాగును గోరువెచ్చని నీటిలో ముంచి పెదాలపై నాలుగైదు నిమిషాల సేపు ఉంచడం వల్ల పెదాలకు కావలసిన తేమ ఏర్పడి నిగారింపు వస్తుంది.

-విటమిన్ ఎ, బి,సి, బి2, ఇ లోపాల వల్ల కూడా పెదాలు చిట్లిపోయి రక్తం కారుతుంది. ఈ విటమిన్లు దొరికే కూరగాయలు, పండ్లు తీసుకోవడంతోపాటు విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలి.

-కొన్ని అలర్జీల వల్ల కూడా పెదాలు అందవిహీనంగా తయారయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులలో వైద్యుని పర్యవేక్షణలో మందులు తీసుకోవడం మంచిది. 

No comments:

Post a Comment