కావల్సినవి:
సగ్గుబియ్యం- కప్పు, బంగాళాదుంప- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, కొత్తిమీర- కొద్దిగా, నూనె- పావుకప్పు, వేరుసెనగలు- కప్పు, ఉప్పు-రుచికి తగినంత.
తయారీ:
వేరుసెనగల్ని నూనె లేకుండా వేయించాలి. చల్లారాక పొట్టు తీసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. బంగాళాదుంప పొట్టు తీసి తురుముకోవాలి. తరవాత సగ్గుబియ్యంలో నీళ్లు పోసి ఐదు నిమిషాలయ్యాక ఒంపేసి పక్కన పెట్టాలి. మూడు గంటలయ్యాక నానిన సగ్గుబియ్యంలో పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు, బంగాళాదుంప తురుము వేసి బాగా కలపాలి. గట్టిగా ఉంటే కాసిని నీళ్లు కలుపుకోవాలి.ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి చేత్తో ఒత్తుకోవాలి. వీటిని పెనం మీద రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. వేడి వేడి సగ్గుబియ్యం రోటీలను కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

ఇదేదో బాగున్నట్టుంది వైష్ణవిగారు,
ReplyDeleteసగ్గుబియ్యానికి , వేరుశనగ పప్పు కి అవినాభావ సంబంధం కదండీ, ఒక్క పాయసంలో తప్పితే....
baagundandi
ReplyDeletememu try chestaam