కావల్సినవి:
సేమియా- రెండు కప్పులు, బంగాళాదుంపలు- రెండు, క్యారెట్-ఒకటి, బీన్స్-
యాభై గ్రాములు, ఉల్లిపాయ తరుగు- కప్పు, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా,
మిరియాలపొడి- అరచెంచా, పచ్చిమిర్చి- నాలుగు, బ్రెడ్ ముక్కలు- నాలుగు,
నూనె- అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత.
తయారీ: బంగాళాదుంపలను మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టాలి. అలానే మరో గిన్నెలో నీళ్లు పోసి అందులో చెంచా నూనె, కొద్దిగా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక సేమియా వేసి మూతపెట్టాలి. సేమియా ఉడికాక నీళ్లు ఒంపేసి.. అందులో క్యారెట్, బీన్స్ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద, ఉప్పు, మిరియాలపొడి, బ్రెడ్‌పొడి చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్‌లెట్ మాదిరి చేత్తో పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక కట్‌లెట్ వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక దించేస్తే సరిపోతుంది. వీటిని టమాటాసాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి.

No comments:
Post a Comment