కావల్సినవి:
టమాటాలు- ఐదు, పనీర్- రెండొందల గ్రాములు, ఉల్లిపాయలు- ఒకటి, అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, ఉప్పు, కారం -రుచికి తగినంత, మైదా- పావు కప్పు, గరంమసాలా- పావు చెంచా, బ్రెడ్ పొడి- కొద్దిగా, కొత్తిమీర- అరకట్ట, నూనె- పావు కప్పు.
తయారీ:
టమాటాలను నాలుగు ముక్కలుగా కోసి గింజలను తొలగించి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. తరవాత బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, కారం వేయాలి. ఐదు నిమిషాలయ్యాక టమాటా ముక్కలు, పనీర్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలియతిప్పాలి. టమాటా ముక్కలు మగ్గాక ఉప్పు వేసి దించేయాలి. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కాసిని నీళ్లు పోసి గరిటె జారుగా కలుపుకోవాలి. బాణలిలో కప్పు నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక టమాటా, పనీర్ కూరను ఉండలా చేసి మైదా పిండిలో ఉంచి బ్రెడ్ పొడిలో అద్ది వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేయాలి. వీటిని టమాటాసాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

No comments:
Post a Comment