కావల్సినవి:గుడ్లు- నాలుగు, ఉల్లిపాయలు, టమాటా- ఒకటి చొప్పున, కొత్తిమీర- కొద్దిగా, పచ్చిమిర్చి- రెండు, ఆవాలు- చెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె- నాలుగు చెంచాలు, పావ్- నాలుగు, ఉప్పు- రుచికి తగినంత.
తయారీ:
గుడ్లలోని సొనను గిన్నెలోకి తీసుకొని ఉప్పు వేసి బాగా గిలక్కొట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గించాలి. కొద్దిసేపటికి అందులో గుడ్ల సొన వేయాలి. పది నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి దించేయాలి. తరవాత పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక పావ్‌ను నూనెతో రెండువైపులా కాల్చుకోవాలి. వేడివేడిగా ఉన్న పావ్‌ల మధ్యలో ఎగ్ బుర్జి పెట్టి సర్వ్ చేస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment