Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Saturday, 14 April 2012

Dry Fruit Sand Witch


కావలసిన పదార్థాలు:
జీడిపప్పు: 3cups
బాదం: 1cup
పిస్తా: 1cup
పంచదార: 3cups
కుంకుమ పువ్వు: 1tsp
యాలకుల పొడి: 1tsp
నెయ్యి: కొద్దిగా

తయారు చేయు విధానం:

1. ముందుగా కొన్ని జీడిపప్పులను పక్కన తీసిపెట్టి మిగిలిన వాటిని ఓ అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా గ్రైండ్ చేయాలి.
2. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పు పొడిని వేసి వేయించాలి. పంచదారను విడిగా పాకం పట్టుకుని వేగుతున్న జీడిపప్పు పొడిలోనికి కలుపుకోవాలి.
3. తర్వాత పొడిచేయకుండా ఉంచిన జీడిపప్పును, బాదం, పిస్తాను ముక్కలు చేసుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు పంచదార మిశ్రమంలో పావు వంతు తీసుకుని అందులో కుంకుమపువ్వు, డ్రైప్రూట్స్ ముక్కలను కలపాలి.
5. మిగతా జీడిపప్పు పొడి, చక్కెర మిశ్రమాన్ని రెండు భాగాలు చేసుకుని ఒక్కొక్కభాగాన్ని పూరీల పీట వేసి రుద్దుకోవాలి. ఇప్పుడు మూడు లేయర్లు తయారవుతాయి. మొదటగా జీడిపప్పును మిక్స్ లేయర్ మళ్ళీ జీడిపప్పు మిక్స్ లేయర్ పరిచి చివరిగా కావాలనుకుంటే సిల్వర్ పేపర్ వేసి కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి. ఇవి పది రోజలు వరకూ తాజాగా ఉంటాయి...

No comments:

Post a Comment