Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Sunday, 8 April 2012

Methi pieces of Mangoes


కావలసినవి:
మామిడికాయలు- 250 గ్రా., మెంతులు- 25 గ్రా., నూనె - 150 గ్రా.,
జీలకర్ర పొడి - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూడి, ఆవపొడి - టీ స్పూను, అల్లం, వెలుల్లి రసం - ఒకో టీస్పూను, పసుపు - చిటికెడు, కారం - తగినంత, ఉప్పు తగినంత.

తయారి:

మామిడికాయ తొక్క తీసుకుని కావలసిన సైజులో ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. బాణలిలో నూనెపోసి మరిగించి, పక్కకు తీసిపెట్టుకోవాలి. మామిడి ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని వీటికి ఆవపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కలుపుకోవాలి. కారం, పసుపు, ఉప్పు చేర్చుకోవాలి. మెంతుల్ని మెత్తగా పొడిచేసుకుని ముక్కల్లో కలుపుకోవాలి. వెల్లుల్లిపాయల్ని, అల్లం ముక్కల్ని దంచి వాటి రసాన్ని చెంచాడు చొప్పున తీసుకోవాలి. ఈ రసాన్ని మామిడి ముక్కల్లో వేసి బాగా కలపాలి. మరిగించి చల్లార్చిన నూనె ఈ ముక్కలమీద పోసుకుని సీసాలోకి తీసుకోవాలి. తయారు చేసిన మర్నాడు తింటే మెంతి ముక్కలు ఊరి మరింత రుచిగా ఉంటాయి. ఇవి పదిరోజులపాటు నిలవఉంటాయి.

No comments:

Post a Comment