- ఒక బంగాళదుంపపై పొరను తీసివేసి దాంతో మీ కళ్ల చుట్టు ఉన్న చర్మంపై మృధువుగా రుద్దండి.ఇలా ఒక వారం చేయండి. తర్వాత మార్పును మీరే గమనిస్తారు.
- దీంతో పాటు సమయానికి నిద్దుర పోవాలి . కనీసం ఎనిమిది గంటలైన కునుకు తీయాలి.
- చల్లని పాలలో దూదిని తడిపి దాన్ని కళ్లపై ఉంచండి. 15 నిముషాల వరకు అది మీ కళ్లపై ఉన్న విషయాన్ని మర్చిపొండి.అలాగని తీసేయడం మాత్రం మర్చిపోకండి. 15 నిముషాల తరువాత తీసేసి ముహాన్ని కడగండి.
- స్నానం తరువాత చల్లని నీటిలో కళ్లని ముంచండి. చల్లదనాన్ని కళ్లకు అందించండి. మీ కళ్లు చాలా అందంగా మారుతాయి.
- ఒక టీ స్పూన్ టమాటో గుజ్జును, చిటికెడు పసుపు పొడి, అర టీస్పూన్ నిమ్మరసం, ఒ క టీస్పూన్ శనగ పిండిని తీసుకొని మెత్తని ఒక మిశ్రమాన్ని తయారు చేయండి.మీ కనురెప్పలపై అప్లై చేయండి. ఇది తప్పకుండా మాయ చేస్తుంది.
- రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు ముఖాన్ని కడగండి.
- అలీవ్ నూనె, పసుపు పొడిని కలిపి ముద్దగా చేసుకొన్ని కళ్లకింది నల్లని చారలపై అప్లై చేయండి.
- విటమిన్ ‘ఈ’ నూనెతో కళ్లకింది చారలపై మెల్లగా మసాజ్ చేయండి.
- రోజ్ వాటర్‌తో మీ కంటిని రోజు నిద్రపోయే ముందు శుభ్రం చేయండి.
- కీరా ముక్కలను మీ కనురెప్పలపై ఉంచి రిలాక్స్‌గా కలల లోకంలో విహారించండి.
Tuesday, 20 March 2012
Some of the care to be beautiful eyes
Subscribe to:
Post Comments (Atom)
nice
ReplyDelete