Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Friday, 30 March 2012

Beautiful eyebrows - some tips

  • కొనదేలిన ముక్కు ఉన్నవారు ఐబ్రోస్‌ లావుగా ఉంటే మంచిది.
  • దూదిని ఆల్కహాల్‌లో ముంచి కనుబొమ్మల కింద భాగం, వెంట్రుకలపై భాగం బాగా శుభ్రం చేసి బ్రష్‌ చేసుకోండి. అయినా టాల్కమ్‌ పౌడర్‌ను ప్లకింగ్‌కి ముందు వేసుకోవటం మరిచిపోకూడదు. కన్నుకు అనుగుణమైన రీతిలో కనుబొమ్మల్ని షేప్‌ చేసుకొని ఐబ్రోలైనర్‌తో గీసుకోవాలి. గీతకు పైన వచ్చే వెంట్రుకల్ని ప్లక్కర్‌తో తీసివేయాలి. ప్లక్కర్‌ చర్మాన్ని పట్టకోకుండా జాగ్రత్త వహించాలి.
  • చిన్న ముఖం ఉన్న వారికి చిన్న కనుబొమ్మలే అందంగా ఉంటాయి.
  • కోడిగుడ్డు ఆకారంలో మీ ఫేస్‌ ఉంటే కనుబొమ్మలు దట్టంగా, ట్రిమ్‌గా ఉంటేనే బాగుంటుంది.
  • త్రికోణాకృతి ముఖం గలవారికి కనుబొమ్మలు కాస్త మందంగా ఉండి కిందకి వంపు తిరిగి ఉండాలి.
  • కనుబొమ్మలు మొత్తం తీసివేసి ఐబ్రోపెన్సిల్‌తో గీసుకునే దానికన్నా వాటిని షేప్‌ చేసుకుంటే మంచిది.
  • పెద్దదిగా ముక్కు ఉన్న వారు కనుబొమ్మల మధ్య దూరం తక్కువగా ఉండేటట్లు తీర్చిదిద్దుకోవాలి.
  • కనుబొమ్మల్ని తీర్చిదిద్దుకోవటంలో శ్రద్ధ, ఓపిక కనబరిస్తే మీరు అందంగా కనపడగలరు.
  • గుండ్రటి ముఖం ఉన్న వారికి కనుబొమ్మలు వంపు తిరిగి సన్నగా ఉంటేనే మంచిది.
  • ముఖం చదరంగా ఉంటే కనుబొమ్మలు పొడవుగా, చివర్లు కొనదేలి ఉంటే బాగుంటుంది. 

No comments:

Post a Comment