Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Saturday, 31 March 2012

Mentukura Tips

తరుచుగా మొటిమలు వస్తూ తగ్గకుండా అవి మచ్చలుగా పడేవారు 10 రోజులకు ఒకసారి ఆవిరిపట్టి తరువాత మెంతుల పొడి 1/2 స్పూన్‌, పసుపు 1/4 స్పూన్‌, దోస కాయ గుజ్జు 1 టీ స్పూన్‌, టమాట రసం 1 టీ స్పూన్‌ కలిపి అందు లో 1 టీ స్పూన్‌ కొబ్బరినీరు, సున్నం మీద తేట కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసి దానిని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత చన్నీటితో కడగాలి. వారానికి ఒకసారి మెంతికూర ఆకులని, వేపి చిగుళ్ళని, పసుపు కలిపి నూరి ముఖానికి రాసి 5 నిమిషాలు నెమ్మదిగా వేళ్ళతో మసాజ్‌ చేసి 20 నిమిషాల తరువాత ముఖాన్ని కడగాలి. ఇలా చేయటం వల్ల మొటిమలు తగ్గుతాయి.మెంతికూర 4 కట్టలు, గోరింటాకు 1/2 కప్పు, వేప పొడి 1/4 కప్పు, పెరుగు 1 కప్పు, అన్నింటినీ కలిపి తలకి పట్టించి అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా 10 రోజులకి ఒకసారి చేస్తే తలలో చుండ్రు తగ్గుతుంది. ఫేషియల్‌గా మెంతికూర ముఖంపై మచ్చలు ఉన్నా, మొటిమలు ఉన్నా వారికి ఫేషియల్‌ చేసి తరువాత ప్యాక్‌ చేసే ముందు చిన్న మెంతికూర రసం 5 చెంచాలు, నిమ్మరసం 1/2 చెంచా, పుదీనా రసం 2 చెంచాలు కలిపి వేళ్ళతో ముఖాన్ని మసాజ్‌ చేస్తే ఎలాంటి మొటిమలైనా, మచ్చలైనా తగ్గుతాయి.

No comments:

Post a Comment