Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Tuesday, 6 March 2012

Paneer-onion-color full Kachori



 కావల్సిన పదార్థాలు:
మైదా: 1/2kg
పనీర్‌ తురుము: 1cup
ఉల్లిపాయలు: 3(సన్నగా తరగినవి)
వాము: 1tsp
నెయ్యి: 1/2cup
జీలకర్ర: 1tsp
ఇంగువ: 1/2tsp
కొత్తిమీర తురుము: అరకప్పు,
వెల్లుల్లి రెబ్బలు: 8-10(చితగొట్టాలి)
పచ్చిమిర్చి: 2-4(సన్నగా తరగినవి)
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానము:
1. మైదాను ఒక గిన్నెలోకి తీసుకుని టేబుల్‌ స్పూను నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి.. నీటితో పిండిలా కలిపి ఇరవైనిమిషాలు నాననివ్వాలి. 

2. పాన్ లో చెంచా నెయ్యి కరిగించి వాము, జీలకర్ర, ఇంగువ వేయించి ఆ తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పలుకులు చేర్చాలి. ఉల్లిపాయముక్కలు బాగా వేగాక.. తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
3. ఇప్పుడు మైదాను ఉండల్లా చేయాలి. ఒక ఉండను తీసుకుని పూరీలా వత్తి మధ్యలో కొద్దిగా పనీర్‌ తురుము, ఉల్లిపాయ మిశ్రమం వేసుకుని గుండ్రంగా వచ్చేలా చుట్టూ మూసేయాలి.
4. తర్వాత ఫోర్కుతో అక్కడక్కడా రంథ్రాల్లా పెట్టి కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చాక దింపేయాలి. ఇలా మిగతా పిండినీ చేసుకోవాలి. వేడివేడిగా పెరుగుచట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment