Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Monday, 19 March 2012

Bread Puri



 కావలసినవి:
గోధుమ పిండి - కప్పు
బ్రెడ్ స్లైస్‌లు - 4
జీలకర్రపొడి - అర టీ స్పూన్
పంచదార - టీ స్పూన్
కారం - టీ స్పూన్
ధనియాల పొడి - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
వాము పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి తగినంత

తయారి:

గిన్నెలో గోధుమ పిండి, పంచదార, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, ధనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. మరొక గిన్నెలో బ్రెడ్ స్లైస్‌లను చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పాలు, వాము వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని గోధుమ పిండిలో కలిపి, కొన్ని నీళ్లతో ముద్ద చేయాలి.

చిన్న చిన్న పిండి ఉండలు చేసుకొని, పూరీని వత్తి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా కాల్చాలి. ఈ పూరీలను గ్రేవీతో లేదా ఛోలేతో సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment