Pages

లేటెస్ట్ ఆర్టికల్స్

Sunday, 18 March 2012

Veg Sandwich



 కావలసినవి:
బ్రెడ్ స్లైస్‌లు - 2, లెట్యూస్ - 2 ఆకులు, కీరా - 2 ముక్కలు (గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేయాలి), ఉల్లిపాయ - (గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేయాలి) 2 ముక్కలు, టొమాటో - గుండ్రంగా, పలచగా, వెడల్పుగా కట్ చేసిన 2 ముక్కలు, ఛీస్ స్లైస్ - 1, ఉప్పు - చిటికెడు, పసుపు - చిటికెడు, మిరియాలపొడి - చిటికెడు, ఫ్రెంచ్ ఫ్రైస్ - 5 (బేకరీలలో లభిస్తాయి), పుదీనా చట్నీ - పావు టీ స్పూన్, కొలెస్లా సలాడ్ (ఉడికించిన క్యాబేజీ, బంగాళదుంప, క్యారెట్ కలిపి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లినది) - అర టీ స్పూన్ 



తయారి:
ముందుగా కూరగాయలను శుభ్రపరుచుకొని కావలసిన విధంగా కట్ చేసుకోవాలి. త్రికోణాకారంలో కట్ చేసుకున్న రెండు బ్రెడ్ స్లైస్‌లను తీసుకోవాలి. ఓవెన్‌లో గ్రిల్ చేయాలి. బయటకు తీసిన బ్రెడ్ స్లైసులకు పుదీనా చట్నీ రాయాలి. ఒక బ్రెడ్ మీద లెట్యూస్, టొమాటో, కీరా, ఉల్లిపాయ, ఛీజ్ స్లైస్‌లను... ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి. ఉప్పు, మిరియాల పొడి చల్లి, మరొక బ్రెడ్ స్లైస్‌ను దీనిపైన అమర్చాలి. దీనిని ఫ్రెంచ్ ఫ్రైస్‌తో సర్వ్ చేయాలి.
(శాండ్‌విచ్‌ను గ్రిల్ చేయకుండా సాదాగా కూడా తయారుచేసుకోవచ్చు.)

No comments:

Post a Comment